Saturday, 10 November 2012

 
దేశంలోని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో లెక్చరర్‌గా చేరేందుకు, విద్యా సంస్థల్లో పరిశోధనలు చేసేందుకు భారతీయులకు నెట్ ప్రధాన అర్హత. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది. నెట్‌లో అర్హత సాధించి యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పరిశోధనలు చేసేందుకు ఆసక్తి చూపే వారికి యూజీసీ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అందజేస్తుంది. జాతీయ స్థాయిలో జరిగే నెట్ తీరుతెన్నులు, అర్హతలు తదితర అంశాల గురించి తెలుసుకుందాం.
నెట్ ఎందుకు? 
దేశంలో బోధన వృత్తిలోకి రావాలనే ఆసక్తి ఉన్న వారికి, విద్యా రంగంలో పరిశోధనలు చేయాలనుకునే వారికి కనీస ప్రమాణాలు ఉండాలనే కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 1984లో తొలిసారిగా జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)ను ప్రవేశపెట్టింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 1988లో చేసిన సూచనలకు అనుగుణంగా లెక్చరర్‌షిప్‌నకు ప్రధానమైన అర్హతగా 1989లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ను ప్రవేశపెట్టింది. యూజీసీకి చెందిన నేషనల్ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ బ్యూరో ఈ పరీక్షలను పర్యవేక్షిస్తుంది.
 దేశవ్యాప్తంగా 77 యూనవర్సిటీల పరిధి కేంద్రాల్లో మొత్తం 94 సబ్జెక్టుల్లో నెట్ జరుగుతుంది.
నెట్ షెడ్యూలు: నెట్‌ను యూజీసీ ప్రతి సంవత్సరం జూన్, డిసెంబరు నెలల్లో నిర్వహిస్తుంది. నోటిఫికేషన్లను మార్చి, సెప్టెంబరు మాసాల్లో విడుదల చేస్తుంది.
ఫలితాల వెల్లడి: జూన్‌లో నిర్వహించే నెట్ ఫలితాలను అక్టోబరులో, డిసెంబర్ నెట్ ఫలితాలను ఏప్రిల్‌లో వెల్లడిస్తారు.
నెట్ సబ్జెక్టులు:
ఇంగ్లిష్, తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ, లా, ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ, సోషియాలజీ, ఎడ్యుకేషన్, కామర్స్, కన్నడ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళ్, అరబిక్, లింగ్విస్టిక్స్, చైనీస్, నేపాలీ, మణిపురి, గుజరాతీ, ఫ్రెంచి, పర్షియన్, రాజస్థానీ, జర్మన్, జపనీస్, అడల్ట్ ఎడ్యుకేషన్/ కంటిన్యుయింగ్ ఎడ్యుకేషన్/నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇండియన్‌కల్చర్, లేబర్ వెల్ఫేర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ మొదలైనవి.
 సైన్స్ సబ్జెక్టుల వారికి..
ప్రధాన సైన్స్ సబ్జెక్టులైన కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియరిక్ ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్‌లకు సంబంధించిన నెట్‌ను కౌన్సిల్ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్)తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తారు. సీఎస్ఐఆర్- నెట్ నోటిఫికేషన్‌ను విడిగా జారీచేస్తుంది.
అర్హతలు:
ఏదైనా పీజీలో (హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సైన్స్ మొదలైనవి) కనీసం 55 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా నెట్ రాయవచ్చు. పీహెచ్‌డీ డిగ్రీ ఉన్న వారికి అర్హత మార్కుల్లో సగటున 5 శాతం వరకు మినహాయింపు ఇస్తారు. అభ్యర్థి వయసు ప్రకటనలో పేర్కొనే తేదీ నాటికి 28 సంవత్సరాలు దాటకూడదు. ఇతరులకు నిబంధనలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. లెక్చరర్‌షిప్‌నకు గరిష్ఠ వయో పరిమితి నిబంధన లేదు.
ఫీజు నిమిత్తం జనరల్ అభ్యర్థులు రూ.450, ఓబీసీలు రూ.225, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.110లను చలానా రూపంలో ఎస్‌బీఐలో చెల్లించాలి. ఈ కాపీని దరఖాస్తుకు జతచేసి పంపాలి.

2012 నుంచి నూతన పరీక్ష విధానం:
యూజీసీ 2012 జూన్‌లో నూతన పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్పటిదాకా నెట్ డిస్క్రిప్టివ్ విధానంలో జరిగేది. అభ్యర్థుల సౌకర్యార్థం థియరీ స్థానంలో ఆబ్జెక్టివ్ విధానాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు మొత్తం మూడు పేపర్లలో కటాఫ్ మార్కులను కూడా నిర్దేశించింది.

పేపర్ -1: ఇది జనరల్ పేపర్. అభ్యర్థికి టీచింగ్/ రిసెర్చ్‌లో ఎంత మేరకు ఆసక్తి ఉందనే విషయాన్ని గుర్తిచడమే ఈ పేపర్ ఉద్దేశం. ఇందులో రీజనింగ్ఎబిలిటీ, కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్‌లాంటి అంశాలపై 60 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థి మాత్రం 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది.
పేపర్ -2: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు ఆధారంగా 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాన్ని గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.
పేపర్ -3: ఇక్కడ కూడా అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు ఆధారంగా 75 ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాన్ని గుర్తించాలి. ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు.

పైన పేర్కొన్న మార్కులను ఆయా పేపర్లలో విడివిడిగా పొందితేనే అర్హులుగా గుర్తిస్తారు. జేఆర్ఎఫ్‌కు, లెక్చరర్‌షిప్‌నకు, రెండింటికి కలిపి కటాఫ్ పాయింట్లను యూజీసీ నిర్ణయిస్తుంది.
అర్హత గుర్తింపు ఎలా ఇస్తారు?
* కేవలం జేఆర్ఎఫ్ కోరుకుంటున్నామా, లేదా లెక్చరర్‌షిప్ కోసమా, లేదా రెండింటి కోసమా అనేది అభ్యర్థి దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. అభ్యర్థి దేని పరిధిలోకి వస్తాడనేదానికి దరఖాస్తులో చేసిన సూచనే ఆధారం.
* అభ్యర్థి నెట్‌లోని మూడు పేపర్లలో చూపిన ప్రతిభ ఆధారంగా జేఆర్ఎఫ్ + లెక్చరర్‌షిప్ లేదా కేవలం జేఆర్ఎఫ్ లేదా లెక్చరర్‌షిప్‌నకు అర్హతను యూజీసీ నిర్ణయిస్తుంది.
* లెక్చరర్‌షిప్‌నకు అర్హత పొందిన వారిని జేఆర్ఎఫ్ అవార్డుకు పరిగణనలోకి తీసుకోరు.
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్): 
అభ్యర్థి జేఆర్ఎఫ్‌కు అర్హత సాధిస్తే యూజీసీ వివిధ స్కీముల కింద ఇచ్చే ఫెలోషిప్ పొందడానికి కూడా అర్హులే. దీని పరిధి రెండు సంవత్సరాలు. అభ్యర్థికి జేఆర్ఎఫ్ అవార్డు లెటర్ జారీ చేసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల వరకు తాను చేస్తున్న పరిశోధనలపై స్కాలర్‌షిప్‌లు పొందవచ్చు.
నెట్ నుంచి మినహాయింపు:
కాలేజీలు/ ఇన్‌స్టిట్యూషన్లు/ యూనివర్సిటీలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరాలంటే నెట్/ స్లెట్/ సెట్ కనీస అర్హతగా ఉండాలనేది ఒక నిబంధన. ఒకవేళ అభ్యర్థికి పీహెచ్‌డీ డిగ్రీ (యూజీసీ నిబంధనలకు అనుగుణంగా) ఉంటే వారిని నెట్/ స్లెట్/ సెట్ అర్హత నుంచి యూజీసీ మినహాయింపు ఇచ్చింది.
ప్రిపరేషన్ విధానం
జాతీయ స్థాయిలో జరిగే నెట్ పరీక్షను తేలిగ్గా తీసుకోకూడదు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉన్నా, థియరీపై అభ్యర్థికి పూర్తి అవగాహన ఉండాలి. ప్రణాళికా బద్ధంగా చదివిన వారికి ఆబ్జెక్టివ్ నెట్ ఒక వరం లాంటిది.. సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకుని నిర్ణీత సమయాన్ని కేటాయిస్తూ మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేస్తే చాలు. పరీక్షలో సులభంగా అర్హత సాధించవచ్చు.
పేపర్ -1 (జనరల్‌పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్): 
అభ్యర్థికి టీచింగ్, రిసెర్చ్ రంగంలో ఎంత మేరకు ఆసక్తి ఉందో తెలుసుకోవడమే ఈ పేపర్ ముఖ్య ఉద్దేశం. అభ్యర్థి ఏదైనా ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాడా, అవగాహనా శక్తి (కాంప్రహెన్షన్) ఎంత ఉంది?విశ్లేషణ తీరు ఎలా ఉంది? విషయ తార్కిక వాదనలు సరైన రీతిలో ఉన్నాయా లేదా అనే విషయాలను ఈ పేపర్ ద్వారా అంచనా వేస్తారు.
ఇందులో... 1) టీచింగ్ ఆప్టిట్యూడ్, 2) రిసెర్చ్ ఆప్టిట్యూడ్ 3) రీడింగ్ కాంప్రహెన్షన్ 4) కమ్యూనికేషన్ 5) రీజనింగ్ 6) లాజికల్ రీజనింగ్ 7) డేటా ఇంటర్‌ప్రిటేషన్ 8) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 9) పీపుల్ ఎన్విరాన్‌మెంట్ 10) హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్: గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాలుంటాయి.
ప్రిపరేషన్: ఈ సిలబస్ చాలా విస్తారమైనది. ప్రతి అంశం పైనా పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలి. సిలబస్‌ను క్రమ పద్దతిలో చదవాలి. కరెంట్ టాపిక్‌లపై విడిగా నోట్స్ రాసుకోవాలి. ప్రశ్నలను వేగంగా చదవడం, అర్థం చేసుకోవడం, సమాధానాన్ని త్వరగా గుర్తించడం బాగా అలవాటు చేసుకోవాలి. దీనికోసం ప్రతిరోజూ మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ ప్రశ్న పత్రాలను ఎక్కువగా చేస్తూనే, సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి.
* ఈ పేపర్‌కు సంబంధించి మార్కెట్లో విభిన్న రకాల మెటీరియల్ దొరుకుతున్నా, ప్రామాణికమైన పుస్తకాలనే తీసుకోవాలి. ఒక సబ్జెక్టుకు సంబంధించి రకరకాల పుస్తకాలను చదవకూడదు.
పేపర్ 2, 3:
ఈ పేపర్లు అభ్యర్థి డిగ్రీ, పీజీలలో తాను చదివిన వాటినుంచి ఎంచుకున్నవి. కాబట్టి వీటిపై దరఖాస్తు నాటికే ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. ఈ విభాగాల్లో ప్రశ్నల సరళి చాలా లోతుగా ఉంటుంది. వార్షిక పరీక్షలకు చదివినట్లు ఇక్కడ చేయకూడదు. పోటీ పరీక్ష దృష్ట్యా చదవాలి. సబ్జెక్టులను ఒకటికి రెండు సార్లు రివిజన్ చేయాలి. నిర్ణీత సమయాన్ని కేటాయించాలి. రోజువారీ మాక్ టెస్టులతోపాటు వారానికి ఒక చాప్టర్‌ను పూర్తి చేయాలి. మాక్ టెస్టుల వల్ల అభ్యర్థికి వేగంగా చదవడం, అర్ధం చేసుకోవడం అలవడుతుంది. అంతేకాదు ఏ విభాగంలో తక్కువ మార్కులు వస్తున్నాయో, ఎక్కడ ఎక్కువ మార్కులు పొందగలుగుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగా అభ్యర్థి తక్కువ మార్కులు వస్తున్న చాప్టర్లపై మరింత ఎక్కువ శ్రద్ధ చూపాలి. తద్వారా పరీక్షలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించి మంచి స్కోర్ చేసి విజయం సాధించగలుగుతారు.
ఆన్‌లైన్ అప్లికేషన్ దరఖాస్తు విధానం:
* మొదట అభ్యర్థి యూజీసీ వెబ్‌సైట్‌నుంచి బ్యాంక్ చలానా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్‌లో పరీక్ష ఫీజు కింద నిర్ణీత మొత్తానికి చలానా రూపంలో ఫీజు చెల్లించి రశీదు పొందాలి.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయబోయే ముందు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను, ఫీజు రశీదును స్కానింగ్ చేయించాలి.
* ఆన్‌లైన్‌రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అప్లికేషన్, అటెండెన్స్ స్లిప్, అడ్మిషన్ కార్డ్ తీసుకోవాలి.
* ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తుకు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి.
* ప్రింట్ అప్లికేషన్‌కు తమ అర్హతలను తెలిపే అన్ని సర్టిఫికెట్ కాపీలను జతచేసి తాము ఏ వర్సిటీ పరిధిలోకి వస్తామో సంబంధిత వర్సిటీకి/ కాలేజీకి పంపాలి.
* ఆన్‌లైన్ అడ్మిషన్ కార్డుపై ఫొటోను అతికించి పరీక్ష రోజున హాల్‌కు తీసుకురావాలి.
వెబ్‌సైట్: http://oldwebsite.ugc.ac.in/inside/net.html
తాజా యూజీసీ నెట్ (డిసెంబరు) సమాచారం:
ప్రస్తుత 2012 సంవత్సరానికి డిసెంబరులో నిర్వహించనున్న నేషనల్ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)కు యూజీసీ ఇటీవల ప్రకటన జారీ చేసింది.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబరు 16.
* ప్రింట్అవుట్ అప్లికేషన్‌ను పంపడానికి చివరి తేదీ: నవంబరు 22.
* ప్రింట్అవుట్ అప్లికేషన్‌ను నేరుగా యూజీసీకి పంపకూడదు. తమ ప్రాంత వర్సిటీ కార్యాలయానికి పంపాలి.
* పరీక్ష తేదీ: 2012 డిసెంబరు 30

Sunday, 4 November 2012

Key Board Shortcuts


KEYBOARD SHORTCUTS
Share 125 USEFUL KEYBOARD SHORTCUTS

1. CTRL+L – Open the Open dialog box
2. CTRL+N – Start another instance of the browser with the same Web address
3. CTRL+O – Open the Open dialog box, the same as CTRL+L
4. CTRL+B – Open the Organize Favorites dialog box
5. CTRL+E – Open the Search bar
6. CTRL+F – Start the Find utility
7. CTRL+H – Open the History bar
8. CTRL+I – Open the Favorites bar
9. CTRL+P – Open the Print dialog box
10. CTRL+R – Update the current Web page
11. CTRL+W – Close the current window
12. CTRL+C – Copy
13. CTRL+X – Cut
14. CTRL+V – Paste
15. CTRL+Z – Undo
16. DELETE – Delete
17. SHIFT+DELETE – Delete the selected item permanently without placing the item in the Recycle Bin
18. CTRL while dragging an item – Copy the selected item
19. CTRL+SHIFT while dragging an item – Create a shortcut to the selected item
20. F2 key – Rename the selected item
21. CTRL+RIGHT ARROW – Move the insertion point to the beginning of the next word
22. CTRL+LEFT ARROW – Move the insertion point to the beginning of the previous word
23. CTRL+DOWN ARROW – Move the insertion point to the beginning of the next paragraph
24. CTRL+UP ARROW – Move the insertion point to the beginning of the previous paragraph
25. CTRL+SHIFT with any of the arrow keys – Highlight a block of text
26. SHIFT with any of the arrow keys – Select more than one item in a window or on the desktop, or select text in a document
27. CTRL+A – Select all
28. F3 key – Search for a file or a folder
29. ALT+ENTER – View the properties for the selected item
30. ALT+F4 – Close the active item, or quit the active program
31. ALT+ENTER – Display the properties of the selected object
32. ALT+SPACEBAR – Open the shortcut menu for the active window
33. CTRL+F4 – Close the active document in programs that enable you to have multiple documents open simultaneously
34. ALT+TAB – Switch between the open items
35. ALT+ESC – Cycle through items in the order that they had been opened
36. F6 key – Cycle through the screen elements in a window or on the desktop
37. F4 key – Display the Address bar list in My Computer or Windows Explorer
38. SHIFT+F10 – Display the shortcut menu for the selected item
39. ALT+SPACEBAR – Display the System menu for the active window
40. CTRL+ESC – Display the Start menu
41. ALT+Underlined letter in a menu name – Display the corresponding menu
42. Underlined letter in a command name on an open menu – Perform the corresponding command
43. F10 key – Activate the menu bar in the active program
44. RIGHT ARROW – Open the next menu to the right, or open a submenu
45. LEFT ARROW – Open the next menu to the left, or close a submenu
46. F5 key – Update the active window
47. BACKSPACE – View the folder one level up in My Computer or Windows Explorer
48. ESC – Cancel the current task
49. CTRL+SHIFT+ESC – Open Task Manager
50. Dialog box keyboard shortcuts
51. CTRL+TAB – Move forward through the tabs
52. CTRL+SHIFT+TAB – Move backward through the tabs
53. TAB – Move forward through the options
54. SHIFT+TAB – Move backward through the options
55. ENTER – Perform the command for the active option or button
56. SPACEBAR – Select or clear the check box if the active option is a check box
57. Arrow keys – Select a button if the active option is a group of option buttons
58. F1 key – Display Help
59. F4 key – Display the items in the active list
60. Microsoft natural keyboard shortcuts
61. Windows Logo – Display or hide the Start menu
62. Windows Logo+BREAK – Display the System Properties dialog b
63. Windows Logo+D – Display the desktop
64. Windows Logo+M – Minimize all of the windows
65. Windows Logo+SHIFT+M – Restore the minimized windows
66. Windows Logo+E – Open My Computer
67. Windows Logo+F – Search for a file or a folder
68. CTRL+Windows Logo+F – Search for computers
69. Windows Logo+F1 – Display Windows Help
70. Windows Logo+ L – Lock the keyboard
71. Windows Logo+R – Open the Run dialog box
72. Windows Logo+U – Open Utility Manager
73. Accessibility keyboard shortcuts
74. Right SHIFT for eight seconds – Switch FilterKeys either on or off
75. Left ALT+left SHIFT+PRINT SCREEN – Switch High Contrast either on or off
76. Left ALT+left SHIFT+NUM LOCK – Switch the MouseKeys either on or off
77. SHIFT five times – Switch the StickyKeys either on or off
78. NUM LOCK for five seconds – Switch the ToggleKeys either on or off
79. Windows Logo +U – Open Utility Manager
80. Windows Explorer keyboard shortcuts
81. END – Display the bottom of the active windowl
82. HOME – Display the top of the active window
83. NUM LOCK+Asterisk sign – * – Display all of the subfolders that are under the selected folder
84. NUM LOCK+Plus sign – + – Display the contents of the selected folder
85. NUM LOCK+Minus sign – - – Collapse the selected folder
86. LEFT ARROW – Collapse the current selection if it is expanded, or select the parent folder
87. RIGHT ARROW – Display the current selection if it is collapsed, or select the first subfolder
88. Shortcut keys for Character Map
89. RIGHT ARROW – Move to the right or to the beginning of the next line
90. LEFT ARROW – Move to the left or to the end of the previous line
91. UP ARROW – Move up one row
92. DOWN ARROW – Move down one row
93. PAGE UP – Move up one screen at a time
94. PAGE DOWN – Move down one screen at a time
95. HOME – Move to the beginning of the line
96. END – Move to the end of the line
97. CTRL+HOME – Move to the first character
98. CTRL+END – Move to the last character
99. CTRL+O – Open a saved console
100. CTRL+N – Open a new console
101. CTRL+S – Save the open console
102. CTRL+M – Add or remove a console item
103. CTRL+W – Open a new window
104. F5 key – Update the content of all console windows
105. ALT+SPACEBAR – Display the MMC window menu
106. ALT+F4 – Close the console
107. ALT+A – Display the Action menu
108. ALT+V – Display the View menu
109. ALT+F – Display the File menu
110. ALT+O – Display the Favorites menu
111. CTRL+P – Print the current page or active pane
112. ALT+Minus sign – - – Display the window menu for the active console window
113. SHIFT+F10 – Display the Action shortcut menu for the selected item
114. F1 key – Open the Help topic, if any, for the selected item
115. F5 key – Update the content of all console windows
116. CTRL+F10 – Maximize the active console window
117. CTRL+F5 – Restore the active console window
118. ALT+ENTER – Display the Properties dialog box, if any, for the selected item
119. F2 key – Rename the selected item
120. CTRL+ALT+END – Open the Microsoft Windows NT Security dialog box
121. ALT+PAGE UP – Switch between programs from left to right
122. ALT+PAGE DOWN – Switch between programs from right to left
123. ALT+INSERT – Cycle through the programs in most recently used order
124. ALT+HOME – Display the Start menu
125. CTRL+ALT+BREAK – Switch the client computer between a window and a ful

Saturday, 28 July 2012


పిహెచ్.డి. చేయాలంటే ఇదీ మార్గం!

phd-heading talangana patrika telangana culture telangana politics telangana cinemaదేశంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్.డి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. వివిధ శాఖల్లో డాక్టరేట్ చేసేందుకు వందలాది మంది సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పిహెచ్.డి చేసేందుకు కార్యాచరణ.

పరిశోధనాత్మక విద్యగా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రదానం చేసే అత్యున్నత డిగ్రీగా గుర్తింపు పొందినది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ.. సంక్షిప్తంగా పి.హెచ్‌డి. విద్యాధికులు కావాలనుకునే వారి లక్ష్యాన్ని నెరవేర్చే గౌరవప్రద డాక్టరేట్ డిగ్రీ పిహెచ్‌డి. సుదీర్ఘ పరిశ్రమ, ఏకాగ్రత, తులనాత్మక పరిశోధనా దృష్టి, క్లిష్టమైన పరీక్షా విధానాలను విజయవంతంగా పూర్తి చేసినప్పుడే పిహెచ్‌డి డిగ్రీని పొందే అవకాశం ఉంటుంది.

పిహెచ్‌డి ప్రత్యేకత 
పిహెచ్‌డి చేసే విద్యార్థి ఒక స్కాలర్ మార్గ దర్శకత్వంలో పరిశోధన చేయవలసి ఉంటుంది. స్కాలరే విద్యార్థికి ‘రీసెర్చ్ సూపర్‌వైజర్’గా ఉంటారు. ఈ పరిశోధనను 4 సంవత్సరాల పాటు చేయవలసి ఉంటుంది. ఇంత తీవ్రమైన, సూక్ష్మమైన పరిశోధన చేసి ఒక అంశంపై లోతైన విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు కాబట్టి పిహెచ్‌డి చేసిన వారిని ఆయా రంగాల నిష్ణాతులుగానూ, విధాన రూపకల్పనలో అర్హులుగానూ, అ అంశాన్ని ఉన్నత స్థాయిలో బోధించడానికి అర్హులుగాను పరిగణించడం జరుగుతుంది.

పిహెచ్‌డి ప్రవేశ ప్రక్రియ 
భారతదేశంలోని విశ్వ విద్యాలయాలన్నింటిలోనూ పిహెచ్‌డికి సంబంధించిన ఒకే రకమైన నియమాలు ఉన్నాయి. పిహెచ్‌డి చేయాలంటే, ప్రత్యేక అంశంలో పరిశోధనాత్మక విద్య పూర్తి చేయాలంటే ముందుగా దానికి అనుమతి, అర్హత కావాలి. దాన్నే పిహెచ్‌డి ప్రవేశ పరీక్షగా చెప్పుకోవాలి. ఇటీవలే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు పిహెచ్‌డి ప్రవేశానికి ఒక ప్రత్యేక అర్హత పరీక్షను ప్రవేశపెట్టారు. దీనిని అన్ని విశ్వ విద్యాలయాల వారు నిర్వహిస్తారు. పి.హెచ్‌డి చేయడానికి ఈ అర్హత పరీక్ష ద్వారా ప్రవేశం పొందడంతో పాటు అమలులో ఉన్న ఇతర అర్హతలు.
1. యుజిసి వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించే జూనియర్ రీసెర్చ్ ఫెలోనేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్.
2. సీఎస్‌ఐఆర్ పరీక్ష (ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్ష. ఈ పరీక్ష ద్వారా అర్హత పొందిన అభ్యర్థికి పిహెచ్‌డిలో ప్రవేశానికి ప్రాధాన్యత లభింంచడంతో పాటు నెలకు 18 వేల రూపాయల ఫెలోషిప్ కూడా లభిస్తుంది.)
3. ఎం.ఫిల్ పరీక్ష 4. పి.హెచ్‌డి ప్రవేశ పరీక్ష.
పైన ప్రస్తావించినవన్నీ పిహెచ్. డి చేయడానికి అవసరమైన ప్రాథ మిక అర్హతలు మాత్రమే. కేవలం దీని ద్వారానే పి.హెచ్‌డిలో ప్రవేశం లభిస్తుందనుకుంటే పొరపాటే. అర్హత పొందిన తర్వాత ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదా హరణకు ఉస్మానియా యూనివర్సి టీ పద్ధతిని పరిశీలిస్తే అక్కడ పిహెచ్‌డి ప్రవేశ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ కమిటీకి డీన్, హెడ్, బిఓఎస్ ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. అర్హత సంపాదించిన అభ్యర్థులందరూ కమిటీ ఇంటర్వ్యూకి హాజరుకావలసి ఉంటుంది. ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ ఆధారంగా అందుబాటు లోని ఖాళీలను బట్టి అభ్యర్థులకు ప్రవేశం కల్పించడం జరుగుతుంది.

ఈ ప్రవేశ ప్రక్రియ మొత్తానికి కలిపి 100 మార్కులు ఉంటాయి. 
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఫస్ట్‌క్లాస్) 25 మార్కులు
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (డిస్టింక్షన్) 30 మార్కులు
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (గోల్డ్ మెడలిస్ట్) 40 మార్కులు
బోధనా అనుభవం 10 మార్కులు
పరిశోధనా పత్రాలు 10 మార్కులు
(ఒక్కో పేపర్‌కి ఐదు మార్కులు)
సెమినార్ ప్రజంటేషన్స్ 10 మార్కులు
రీసెర్చ్ డిజైన్, ఇంటర్వ్యూ 30 మార్కులు

ప్రస్తుతం పిహెచ్‌డికి విపరీతంగా పోటీ పెరిగిపోయింది. రీసెర్చ్ సూపర్‌వైజర్ దగ్గర ఉన్న ఖాళీల ప్రకారమే సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. ఒక్కో రీసెర్చ్ సూపర్‌వైజర్ ఒక్కసారి 6గురు అభ్యర్థులకు మాత్రమే ‘గైడ్’గా ఉండగలరు. ఒక విభాగంలో ఉన్న సూపర్‌వైజర్‌ల సంఖ్యను 6 సంఖ్యతో గుణిస్తే వచ్చే సంఖ్యే అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యగా గుర్తిస్తారు. ఉదాహరణకి ఒక విభాగంలో ఆరుగురు సూపర్‌వైజర్‌లుంటే ఒక్కొక్కరికీ ఆరుగురు అభ్యర్థుల చొప్పున మొత్తం 36 ఖాళీలుంటాయన్న మాట. ఒక వేళ అప్పటికే అక్కడ 30 మంది పిహెచ్‌డి పరిశోధన చేస్తుంటే కేవలం 6 సీట్లు ఉన్నట్లు భావించాలి. దీన్ని బట్టి పిహెచ్‌డి సీటు సంపాదించడం అంత తేలిక కాదనే విషయం అభ్యర్థులు గ్రహించి పోటీలో ముందుగా నిలవాలంటే రీసెర్చ్ డిజైన్‌పై ఎంతో కృషి చేయవలసి ఉంటుంది.

పిహెచ్‌డి. విజయసూత్రాలు 
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనేది పేరుకి తగ్గట్టుగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఉన్నత విలువలు కలిగిన ఎంతో పవ్రితమైన పరిశోధనాత్మక విద్యగా ప్రతి విద్యార్థి భావించాలి. ఈ విద్యను ఎంతో అంకిత భావంతో అభ్యసించవలసి ఉంటుంది. పిహెచ్‌డి నిర్దిష్ట సమయంలో విజయవంతంగా పూర్తి చేయడమనేది ప్రధా న లక్ష్యంగా ఉండాలి. పిహెచ్.డి అనేది కేవలం ఒక విద్య మాత్రమే కాదు మానవ జీవిత విలువలను, స్థాయిని పెంచే మహోన్నత పరిశోధనా కార్యక్రమం. పిహెచ్.డిని ఆ విధంగా భావించి చేసినప్పుడే ఆ ఉన్నత విద్యకి, విద్యార్థికి సార్థకత చేకూరుతుంది.

ప్రవేశ అర్హతకు సూచనలు 
అభ్యర్థి యం.ఫిల్. చేయకుండా నేరుగా పిహెచ్‌డి ప్రవేశానికి ప్రయత్నిస్తున్నట్లుయితే వారికి రీసెర్చ్ డిజైన్ రూపకల్పన ఎంతో కీలకమైనదని గ్రహించాలి. ఎందుకంటే అభ్యర్థి రీసెర్చ్ డిజైన్ రూపకల్పన ఇంటర్వ్యూలో మంచి మార్కులు సంపాదించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. మంచి రీసెర్చ్ డిజైన్ తయారీకి అభ్యర్థులు క్రింది అంశాలు దృష్టిలో ఉంచు కోవాలి.

1. రీసెర్చ్ అంశాన్ని ప్రొఫెసర్లతో, నిపుణులతో చర్చించి ఎంపిక చేసుకోండి.
2. గతంలో అభ్యర్థులు రూపొందించిన థీసిస్‌లను ఒక సారి పరిశీలించండి.
3. రీసెర్చ్ డిజైన్‌ను ఒక పద్ధతి ప్రకారం రూపొందించండి.
4. ముందుగా ‘టాపిక్ ఇంట్రడక్షన్’ రాయండి.
5. ఎంచుకున్న అంశం లేదా విషయం యొక్క లక్షణాలు, ఆ విషయం ఉద్దేశించి మీరు ఏరకమైన స్టేట్‌మెంట్‌తో పరిశోధన చేయబోతున్నారనేది ప్రస్తావించండి.
6. పరిశోధనా ఉద్దేశాలను తెలియజేయండి.
7. డాటా, సమాచార సేకరణ పద్ధతులు, వాటిని ఎలా, ఎక్కడ నుంచి సంపాదిస్తారు. వాటి సోర్స్ ఏమిటి, వాటిని ఏ విధంగా విశ్లేషిస్తారో చెప్పే విశ్లేషణా విధానాలు, పరిణామాలు, ఊహాత్మక ఫలితాలు, ఉదాహరణగా ఒక నమూనా డిజైన్ మొదలైనవి వివరంగా, శాస్త్రీయంగా తయారు చేయాలి.
8. పరిశోధనాంశాల వర్గీకరణ, తయారైన డిజైన్ స్క్రిప్ట్‌ని ఒక సారి సమీక్షించుకోవాలి. పైన ప్రస్తావించిన అంశాలు, రీసెర్చ్ డిజైన్ తయారీ ప్రక్రియ అన్ని సబ్జెక్టుల వారికి కూడా వర్తిస్తా

Thursday, 19 July 2012

గ్రూప్-2 ఎ.పి. హిస్టరీకరెంట్ ఎగ్జామ్స్ కవరేజిpart - II : unit-IIIఆంధ్రప్రదేశ్ సామాజిక, రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన బ్రిటిష్ వలస పాలన ముఖ్యంగా మచిలీపట్నంలో ఆంగ్లేయులు వర్తక స్థావరాన్ని (1611)ఏర్పాటు చేయడం మొదలు 1947 వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఈ యూనిట్లో పేర్కొనడం జరిగింది.
పరీక్ష కోణంలో ఈ యూనిట్ నుండి అత్యధిక ప్రశ్నలు రావటమే కాకుండా యూనిట్ 4 మరియు 5లను అర్థం చేసుకోవడానికి కూడా ఈ యూనిట్ సిలబస్ ఉపయోగ పడుతుంది. కాబట్టి అభ్యర్థులు 1857 తిరుగుబాటు ప్రభావం మొదలుకొని భారత జాతీయోధ్యమానికి సమాతరంగా ఆంధ్రలో జరిగిన సంఘటనలను చదవటం వల్ల పేపర్-1లోని భారతదేశ చరిత్రలో ‘భారత జాతీయోద్యమం’అంశానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు.
ముఖ్యంగా సామాజిక, సాంస్కృతిక జాగృతికి సంబంధించిన ఉద్యమాలు, వాటి నాయకులు, అదే విధంగా ఆయా ఉద్యమాల యొక్క ఫలితాలు వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి. కాబట్టి ఆ కోణంలో అభ్యర్థులు క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది.
జాతీయోద్యమంలో జరిగిన కీలకమైన ప్రతి సంఘటనలో పాల్గొన్న మొదటి, లేక ఏకైక ఆంధ్ర నాయకుని గూర్చిన ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నందున అభ్యర్థులు విశిష్ఠమైన అంశాలను ఎక్కువసార్లు రివిజన్ చేయాల్సి ఉంటుంది.
1.బ్రిటిష్ వర్తకులు ఆంధ్ర ప్రాంతంలో గోల్కొండ రాజుల అనుమతితో మచిలీపట్నంలో తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న సంవత్సరం? ( )1. క్రీ.శ.1611 2. క్రీ.శ.1612
3. క్రీ.శ.1632 4. క్రీ.శ.1614
2.క్రీ.శ. 1756లో ఫ్రెంచ్‌సేనాని బుస్సీని అధికారం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నిజాం నవాబు? ( )1. నాసర్ జంగ్ 2. ముజఫర్ జంగ్
3. సలాబత్ జంగ్ 4. నిజాం-ఉల్- ముల్క్
3.క్రీ.శ.1757లో బొబ్బిలి కోటపై యుద్ధానికి ఫ్రెంచ్ వారిని ప్రోత్సహించిన విజయనగర రాజు? ( )1. తిరుమలరాయలు
2. మొదటి శ్రీరంగదేవరాయలు
3. రెండో వెంకటరాయలు
4. విజయరామరాజు
4.రాయలసీమలో రైతులకు ఉపయుక్తమైన రైత్వారీ విధానాన్ని అమలు జరిపి ప్రశంసలందుకున్నది.? ( )1. థామస మన్రో 2. డూప్లే
3. కౌంట్ డీ లాలీ 4. బుస్సీ
5.రాజధానిని ఔరంగబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చిన నిజాం నవాబు? ( )1. సలాబత్ జంగ్ 2. నిజాం ఆలీఖాన్
3. నాసర్ జంగ్ 4. ముజఫర్ జంగ్
6.1867లో నిజాం రాజాన్ని ‘జిలాబంది విధానాన్ని’ అనుసరించి 5 సుభాలుగా విభజించటం జరిగింది. అయితే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినది? ( )1. సాలార్ జంగ్ -1 2. సాలార్ జంగ్ -2
3. మహబూబ్ ఆలీఖాన్ 4. సలాబత్ జంగ్
7.హైదరాబాద్‌లో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించినది ? ( )1. నాసిరుద్దౌల 2. సాలార్ జంగ్-1
3. ముబారిజ్ ఉద్దౌల 4. కాశిం రజ్వీrachanalu8.1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును అణిచి వేయుట వల్ల బ్రిటిష వారి చేత ‘స్టార్ ఆఫ్ ఇండియా’గా పిలవబడ్డ నిజాం నవాబు? ( )1. సికిందర్ జా 2. నిజాం ఆలీఖాన్
3. నాసర్ జంగ్ 4. ఆప్జల్ ఉద్దౌల
9.భారతదేశంలో వెలస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన మొదటి పాలకుడు? ( )1. నిజాం ఆలీఖాన్ 2. సలాబత్ జంగ్
3. మహబూబ్ ఆలీఖాన్ 4. ఉస్మాన్ ఆలీఖాన్
10.ఆంగ్లేయుల పరిపాలనలో ప్రచురించబడిన తొలి ఆంధ్రపత్రిక? ( )1. దేశభిమాని 2. ఆంధ్రప్రకాశిక
3. సత్యదూత 4. కృష్ణపత్రిక
11.అత్యంత వివాదాస్పదమైన ఇల్బర్ట్ బిల్లు వివాదంపై బ్రిటిష్ వారు సంప్రదించిన ఏకైక తెలుగు వ్యక్తి? ( )1. కందుకూరి వీరేశలింగం 2. ఏనుగుల వీరాస్వామి
3. గిడుగు రామమూర్తి 4. రాజాగజపతిరావు
12.ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ‘‘వీర గంథము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ’’ అన్న సుప్రసిద్ధ గీతం రచించినది? ( )1. రాచకొండ విశ్వనాథశాస్త్రి
2. త్రిపురనేని రామస్వామి
3. పానుగంటి లక్ష్మీనరసింహారావు
4. రాజాగజపతిరావు
13.సుప్రసిద్ధ దండియాత్రలో పాల్గొన్న ఆంధ్రుడు? ( )1. ముట్నూరి కృష్ణారావు 2.కొక్కొండ వెంకటరత్నం
3. ఎర్నేని సుబ్రహ్మణ్యం 4. అడవి బాపిరాజు
14.ఆంధ్ర ప్రాంతంలో ‘‘హోంరూల్ లీగ్’’ కు కార్యదర్శిగా పని చేసినది? ( )1. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
2. గాడిచర్ల హరిసర్వోత్తమరావు
3. కొండా వెంకటప్పయ్య
4. అయ్యదేవర కాళేశ్వరరావు
15.ఆంధ్ర సోషలిస్టు కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు? ( )1. తెన్నేటి విశ్వనాథం
2. కోటగిరి వెంకటకృష్ణారావు
3. బ్రహ్మజ్యోస్యులు సుబ్రహ్మణ్యం
4. త్రిపురనేని రామస్వామి చౌదరి
16. అల్లూరి సీతారామరాజు మొగల్లులో జన్మించగా, సమాధిని నెలకొల్ప బడిన ప్రాంతం? ( )1. మొగల్లు
2. చింతపల్లి
3. కృష్ణదేవిపేట
4. రంపచోడవరం
17.పెదనందిపాడు ఉద్యమ నాయకుడైన పర్వతనేని వీరయ్య చౌదరికి గల బిరుదు? ( )1. దేశభక్త 2. ఆంధ్ర రత్న
3. ఆంధ్రబీష్మ 4. ఆంధ్ర శివాజీ
18.ఆంధ్రలో వందేమాతర ఉద్యమంలో భాగంగా బిపిన్ చంద్రపాల్ పర్యటనలో పాల్ ఉపన్యాసాలను తెలుగులో అనువదించినది?( )1. న్యాపతి సుబ్బారావు
2. ముట్నూరి కృష్ణారావు
3. పానుగంటి లక్ష్మీనరసింహరావు
4. కొమర్రాజు లక్షణరావుimppersons19.జపాను చరిత్రను తెలుగులోకి అనువదించినది? ( )1. ఆదిపూడి సోమనాధరావు 2. గుఱ్ఱం జాషువా
3. ఏటుకూరి నరసయ్య 4. శ్రీశ్రీ
20.ఆంధ్రలో వందేమాతర ఉద్యమ కాలంలో కోటప్పకొండ సంఘటనకు గాను మరణశిక్షకు గురైనది?( )1. రామచంద్రరావు
2. చిన్నపరెడ్డి
3. మల్లాది వెంకట సుబ్బారావు
4. కన్నెగంటి హనుమంతుడు
21.కందుకూరి వీరేశలింగం ‘హితకారిణి సమాజాన్ని’ స్థాపించిన సంవత్సరం? ( )1. 1919 2. 1909
3. 1908 4. 1901
22.హైదరాబాద్‌లో వెలువడిన మొదటి పత్రిక ‘గోల్కొండ పత్రిక’ కాగా, ఆ పత్రిక స్థాపకుడు ఎవరు? ( )1. దేవులపల్లి రామానుజారావు
2. ముట్నూరి కృష్ణారావు
3. గాజుల లక్ష్మీనరసుశెట్టి
4. సురవరం ప్రతాపరెడ్డి
23.ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచినది? ( )1. నిమ్న జాతుల చరిత్ర జాలా రంగస్వామి
2. నవజీవనం వుండ్రు సుబ్బారావు
3. జీవనజ్యోతి మళ్ల వెంకటరత్నం
4. వీరభారతి ఉన్నవ లక్ష్మీనారాయణ
1. 1 మరియు 2 2. 1,2 మరియు 3
3. 4 4. పైవన్నీ
24.ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్యను హైదరాబాద్‌లో స్థాపించినది? ( )1. కాశీనాథుని నాగేశ్వరరావు 2. భాగ్యరెడ్డివర్మ
3. జాలా రంగస్వామి 4. 1 మరియు 2patrika25.కేరళలో శ్రీనారాయణగురు స్థాపించిన ‘శ్రీనారాయణ ధర్మపరిపాలన యోగం’ అనే సంస్థ ఏ కులస్థుల సంస్కృతీ కరణకు ప్రముఖంగా తోడ్పడినది?( )1. తులు 2. నంబూద్రి
3. ఎజవా 4. నాయకర్లు
26.‘రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం’ ఎక్కడ స్థాపించబడినది? ( )1. హన్మకొండ 2. కర్నూలు
3. హైదరాబాద్ 4. గుంటూరు
27.‘విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి’ స్థాపనలో ప్రముఖంగా కృషి చేసినది? ( )1. రామచంద్ర పిళ్లై
2. కొమర్రాజు లక్ష్మణరావు
3. రావిచెట్టు రంగారావు
4. శ్రీనాయని వెంకటరంగారావు
28.1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది? ( )1. రావి నారాయణరెడ్డి
2. మాడపాటి హనుమంతరావు
3. స్వామి రామానంద తీర్థ
4. రామకృష్ణదూత్answers29.‘ఆత్మగౌరవ ఉద్యమం’ బలపడటానికి ‘పెరియార్’గా ప్రసిద్ధి చెందిన ‘రామస్వామి నాయకర్’ ప్రారంభించిన వార పత్రిక? 1. ద్రవిడ కజగం 2. నిమ్నజాతుల చరిత్ర
3. సోషలిస్ట్ 4. కుడి అరసు ( )
30.జస్టిస్ పార్టీ మొదటి సమావేశానికి ‘పి.రామరాయనింగార్’ అధ్యక్షత వహించగా, ఈ సమావేశం ఎక్కడ జరిగినది?( )1. మద్రాస్ 2. కోయంబత్తూర్
3. రాజమండ్రి 4. నెల్లూరు
ఈ యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో వచ్చిన ప్రశ్నలు
1.ఆంధ్రలో జరిగిన శాసనోల్లంఘనోద్యమంలో డిక్టేటర్‌గా నియమితుడైన నాయకుడు? గూప్-2, 2008)
1. కొండా వెంకటప్పయ్య ( 1 )
2. టంగుటూరి ప్రకాశం
3. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
4.ఎన్.జి.రంగా
2.నెల్లూరు జిల్లాలో జరిగిన జమిందారీ వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినది ఈ క్రింది వారిలో ఎవరు?
1. బెజవాడ గోపాలరెడ్డి ( 3 )
2. పొనకా కనకమ్మ
3. ఓరుగంటి వెంకటసుబ్బయ్య
4. వెన్నెలకంటి రాఘవయ్య నగూప్-2, 2008)
3.తెలుగు సాహిత్యంలో వీరేశలింగం రచించిన తొలి తెలుగు నవల? గూప్-2 2011)( 1 )1. రాజశేఖర చరిత్ర 2. లోకరంజని
3. సతీహిత బోధిని 4. రసికోల్లాసిని
4.భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వాడెవరు? నగూప్-2, 2011) ( 2 )1. పి.సీతారామయ్య 2. పి.ఆనందాచార్యులు
3. టిపకాశం 4. ఎన్.సంజీవరెడ్డి
5.ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలుత ఏర్పడినపుడు దాని కార్యస్థానం ఎక్కడ ఉండేది? నగూప్-2, 2008)1. విశాఖపట్నం 2. బెజవాడ ( 2 )
3. గుంటూరు 4. మద్రా

కరెంట్ అపైర్స్

Expected_Qఈజిప్ట్‌లో ఎన్నికైన తొలి అధ్యక్షుడు ఎవరు?1.కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు? ( )1. సంజయ్‌రెడ్డి 2. వినోద్‌పిళ్ళై3. జవహర్‌ఠాకుర్ 4. ఎవరూ కాదు2. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు సుధీంధ్రా అనే క్రికెటర్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. దీంతో ఈ శిక్షను ఎదుర్కొన్న మూడో క్రికెటర్ సుధీంధ్రా. జీవితకాల నిషేధానికి గురైన మిగతా ఇద్దరు క్రికెటర్లెవరు? ( )1. అజారుద్దీన్, అజయ్‌జడేజా2. అజారుద్దీన్, అజయ్‌శర్మ3. అజారుద్దీన్, మనోజ్ ప్రభాకర్4. ప్రవీణ్ ఆమ్రే, అజయ్ జడేజా3.మధ్యప్రదేశ్‌కు చెందిన సుధీంద్రా ఐపీఎల్‌లో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ( )1. డెక్కన్ ఛార్జర్స్ 2. చెన్నై సూపర్‌కింగ్స్3. పంజాబ్ కింగ్స్11 4. పూణె వారియర్స్4.ఐఎస్‌ఎసి విస్తరించుము? ( )1. ఇండియన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్2. ఇస్రో స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్3. ఇండియన్ శాటిలైట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్4. ఇస్రో శాటిలైట్ సెంటర్5.రాష్ర్టపతి ఎన్నికలకు సంబంధించి కింది అంశాలను జతపరుచుము? ( )అంశం గణాంకాలు1. ఎలక్టోరల్ కాలేజీలోనిఎంపీలు ఎ. 5,49,4742. ఎలక్టోరల్ కాలేజీలోనిఎమ్మేల్యేలు బి. 7763. ఎమ్మేల్యేల ఓటు విలువ సి. 5,49,4084. ఎంపీల ఓటు విలువ డి. 41201. 1బి, 2డి, 3ఎ, 4సి2. 1బి, 2డి, 3సి, 3ఎ3. 1బి, 2ఎ, 3డి, 4సి 4. పైవేవీ కావు6. ఈజిప్ట్‌లో ఎన్నికైన తొలి అధ్యక్షుడు ఎవరు? ( )
1. హోస్ని ముబారక్ 2. మహ్మద్ వెూరీ3. అబ్దుల్ రహ్మాన్ 4. పైవేవీకావు7.మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం రాసిన కొత్త పుస్తకం ‘టర్నింగ్ పాయింట్స్, ఏ జర్నీ త్రూ ఛాలెంజెస్’ ఇది ఏ పుస్తకానికి సీక్వెల్‌గా కలాం రాశారు? ( )1. వింగ్స్ ఆఫ్ ఫైర్ 2. ఇగ్నైటెడ్ మైండ్స్3. విజన్ 20-20 4. ఏదీకాదు
8.‘2జి’ స్పెక్ట్రంపైన వేసిన ‘ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’కు ఎవరు నాయకత్వం వహించనున్నారు?1. కపిల్‌సిబాల్ 2. ఎ.కె.ఆంటోనీ ( )3. శరద్‌పవార్ 4. జైపాల్‌రెడ్డి9.ప్రపంచపు అత్యుత్తమ అథ్లెట్‌ల జాబితాను ఇంగ్లాండ్‌కు చెందిన స్పోర్ట్ ప్రో విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన ‘మేరీకాం’ ఎన్నో స్థానంలో ఉన్నారు?( )1.37 2. 38 3.39 4. 4010.రాష్ర్ట చీఫ్ సెక్రటరీగా మిన్నీ మాథ్యూ నియామకం అయ్యారు. రాష్ర్టంలోని ఈ అత్యున్నత పదవిని అలంకరించిన రెండో మహిళ మిన్ని మాథ్యూ కాగా తొలి మహిళ ఎవరు? ( )1. సథినాయర్ 2. ఎం.ఎస్.లక్ష్మీ3. రేచల్ ఛటర్జీ 4. ఎవరూకాదు11. ‘యూరోజోన్’కు సంబంధించి కింది వానిలో సరైనవేవి? (ఇటీవల చర్యలకు సంబంధించి) ( )1. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు (యూరో) చేయూతనివ్వడానికి 500 బిలియన్ యూరోలతో యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజం ఏర్పాటుకు నిర్ణయం2. మార్కెట్లు స్థిరంగా ఉండేలా ఈ బెయిల్ ఔట్ ప్యాకేజీని సరళమైన పద్ధతిలో ఇస్తారు.3. స్పెయిన్, ఇటలీ దేశాలకు ఈ ప్యాకేజీ ఉద్దేశించినది.4. పైవన్నీ12. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరు?1. జోస్ ఇమ్మాన్యువల్ బారోసో ( )
2. హెర్మన్ వ్యాన్ రొంపు3. ఏంజెలా మెర్కెల్
4. పైఎవరూ కాదుexampoint13. బీసీసీఐ కొత్తగా ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక విభాగం చీఫ్ ఎవరు? ( )1. అరుణ్‌జైట్లీ 2. ఎన్‌యశీనివాసన్3. రవి సవాని 4. నిరంజన్‌షా14. ‘ఈయూ’ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దేశం ఏది?1. జర్మనీ 2. ఫ్రాన్స్ 3. బ్రిటన్ 4. సైప్రస్15.ఇటీవలే ముగిసిన ‘యూరోకప్‌కు సంబంధించి కింది వానిలో సరైనది? ( )1. జూన్ 8 నుంచి జూలై 1 వరకు నిర్వహించిన యూరో 2012లో స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది.2. 31 మ్యాచ్‌లతో కొనసాగిన ఈ టోర్నీ నిర్వహణలో ఉక్రెయిన్ భాగస్వామి.3. యూరోటోర్నీ ప్రారంభమైన తర్వాత వరుసగా రెండుసార్లు స్పెయిన్ విజేతగా ఆవిర్భవించి సంచలనం సృష్టించింది.4. పైవన్నీ 16.స్పెయిన్ ఇటీవల సాధించిన టోర్నీలేవి? ( )1. ప్రపంచకప్ - 2010 2. యూరోకప్-20083. యూరోకప్ - 20121. కేవలం 2,3 2. కేవలం 1,23. పైవన్నీ 4. కేవలం 1,3answersఎంత సులభం?ప్రశ్నః అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టిన మందు?జ. పెన్సిలిన్ (డిగ్రీ కాలేజి లెక్చరర్స్ ఎగ్జామ్- 9.6.2012)ఎంత కష్టం?ప్రశ్న ః భాలీ అనె కొండజాతి ప్రజలు ఉండే రాష్ట్రం ?జ. ఘాలయా(డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఎగ్జామ్ - 9.6. 2012)

Monday, 16 July 2012



తేదీలు - దినోత్సవములు


జనవరి
1: రహదారి భద్రతా దినోత్సవం
2: ప్రపంచ శాంతి దినోత్సవం
3: మహిళా టీచర్స్ డే
4: వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం
5: సైనిక దినోత్సవం
9: ప్రవాస భారతీయ దివస్
10: ప్రపంచ నవ్వుల దినోత్సవం
11: జాతీయ విద్యాదినోత్సవం
12: జాతీయ యువజన దినోత్సవం
స్వామీ వివేకానంద జయంతి
15: వరల్డ్ రిలిజియన్ దినోత్సవం, సైనిక దినోత్సవం
17: ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
21: మణిపూర్, మేఘాలయ,
త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
23: సుభాష్‌చంబ్రోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం
25: ఇండియా టూరిజం దినోత్సవం,
ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
26: భారత గణతంత్ర దినోత్సవం,
ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం
30: అమరవీరుల సంస్మరణ దినం, గాంధీజీ వర్థంతి, కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.
ఫిబ్రవరి
1: భారత తీర రక్షక దళ దినోత్సవం
2: వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం
4: వరల్డ్ క్యాన్సర్ డే, శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవం
11: ప్రపంచ వివాహ దినోత్సవం
12: జాతీయ ఉత్పాదనా దినోత్సవం,
గులాబీల దినోత్సవం.
14: ఇంటర్ నేషనల్ కండోమ్ డే, ప్రేమికుల దినోత్సవం
20: మిజోరామ్, అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినం
21: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
22: ప్రపంచ స్కౌట్ దినోత్సవం, కవలల దినోత్సవం
24: సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
25: జాతీయ సైన్స్ దినోత్సవం.
మార్చి
4: జాతీయ భద్రతా దినోత్సవం
5: అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం
ప్రపంచ బధిరుల దినం
8: అంతర్జాతీయ మహిళా దినం
9: వరల్డ్ కిడ్నీ డే
10: కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల డే
15: ప్రపంచ పౌర హక్కుల దినం
18: మానవ హక్కుల దినం
20: సాంఘిక సాధికారత స్మారక దినం
21: ప్రపంచ అటవీ దినం, ప్రపంచ అంగ వికలుర దినం, ప్రపంచ కవితా దినం
22: ప్రపంచ జల దినోత్సవం
23: ప్రపంచ వాతావరణ దినోత్సవం,
అమర వీరుల దినోత్సవం
24: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం
26: బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం
27: అంతర్జాతీయ నాటక దినోత్సవం
28: నేషనల్ షిప్పింగ్ దినోత్సవం
ఏప్రిల్
1: ఒరిస్సా రాష్ట్ర అవతరణ దినోత్సవం
2: పోలీస్ పతాక దినం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
5: నేషనల్ మారిటైమ్ డే
7: ప్రపంచ ఆరోగ్య దినం
8: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం
10: ప్రపంచ హోమియోపతి డే
12: ప్రపంచ రోదసీ దినోత్సవం
13: జలియన్ వాలాబాగ్ సంస్మరణ
దినోత్సవం
14: అగ్నిమాపక దినోత్సవం, అంబేద్కర్ జయంతి, మహిళా పొదుపు దినోత్సవం
15: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం
16: తెలుగు రంగస్థల దినోత్సవం
17: ప్రపంచ హిమోఫిలియా దినం
18: ప్రపంచ సాంస్కృతిక దినం
21: జాతీయ సమాచార హక్కుల దినం,
జాతీయ పబ్లిక్ రిలేషన్స్ దినం
22: ప్రపంచ ధరిత్రి దినోత్సవం
23: ప్రపంచ పుస్తకాల దినోత్సవం
25: ప్రపంచ మలేరియా దినం
26: సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం,
ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం
28: ప్రపంచ భద్రతా దినోత్సవం,
ప్రపంచ పశుచికిత్సా దినం
29: అంతర్జాతీయ నృత్య దినోత్సవం
30: బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.
మే
1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం
3: ప్రపంచ ఆస్తమా దినోత్సవం, ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినోత్సవం
4: బొగ్గు గని కార్మిక దినోత్సవం
5: వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం,
అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం
6: ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం
7: ఠాగూర్ జయంతి, నవ్వుల దినోత్సవం
8: ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
11: జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం
12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం,
అంతర్జాతీయ వలస పక్షుల దినం
13: మాతృ దినోత్సవం
15: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
17: ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
18: ఇంటర్నేషనల్ మ్యూజియమ్స్ డే
21: తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
22: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
24: కామనె్వల్త్ దినోత్సవం
27: నెహ్రూ వర్థంతి
29: వౌంట్ ఎవరెస్ట్ దినోత్సవం,
అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం
30: గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం
యు.ఎస్. స్ట్ఫా దినోత్సవం
31: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.
జూన్
1: అంతర్జాతీయ బాలల దినోత్సవం,
ప్రపంచ పాల దినోత్సవం
4: అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం
5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం
8: ప్రపంచ సముద్ర దినోత్సవం
12: ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం
14: పతాక దినోత్సవం
18: గోవా స్వాతంత్య్ర దినోత్సవం
20: తండ్రుల దినోత్సవం, మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ శరణార్థుల దినోత్సవం
21: ప్రపంచ సంగీత దినోత్సవం
23: ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం
25: ప్రపంచ అవయవ దాన, మార్పిడి దినోత్సవం
26: ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం
28: పేదల దినోత్సవం
29: గణాంక దినోత్సవం.
జూలై
1: వైద్యుల దినోత్సవం, వాస్తు దినోత్సవం, ప్రపంచ వ్యవసాయ దినోత్సవం, వన మహోత్సవ వారోత్సవాలు జూలై 1నుండి జూలై 7 వరకు.
2: ప్రపంచ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం
5: అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం
6: ప్రపంచ రేబిస్ దినోత్సవం
11: ప్రపంచ జనాభా దినోత్సవం
12: నాబార్డ్ స్థాపక దినోత్సవం
17: పాఠశాలల భద్రత దినోత్సవం,
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
26: కార్గిల్ విజయోత్సవ దినం
29: ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే
ఆగస్టు
1: తల్లిపాల దినోత్సవం
2: ఆంగ్లో ఇండియన్ దినోత్సవం
6: హిరోషిమా దినోత్సవం
8: క్విట్ ఇండియా దినోత్సవం
9: నాగసాకి దినోత్సవం
10: డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినం
12: లైబ్రేరియన్స్ డే
13: లెఫ్ట్‌హ్యాండర్స్ డే
15: స్వాతంత్య్ర దినోత్సవం,
పశ్చిమ బెంగాల్ దినోత్సవం
18: అంతర్జాతీయ స్వదేశీవాదుల దినం
19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినం
20: సద్భావన దినం (రాజీవ్ గాంధీ జయంతి)
మలేరియా నివారణ దినం
24: సంస్కృత దినోత్సవం
29: తెలుగు భాష దినోత్సవం, జాతీయక్రీడా దినోత్సవంసెప్టెంబర్
1: పోషక పదార్థాల వారోత్సవం
2: కొబ్బరికాయల దినోత్సవం
4: అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ
దినోత్సవం (ఆంధ్రప్రదేశ్)
5: ఉపాధ్యాయ దినం- రాధాకృష్ణన్
జన్మదినం
8: ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం
9: వరల్డ్ ఫస్ట్‌ఎయిడ్ డే
10: హర్యానా, పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం
14: హిందీ దినోత్సవం
15: ఇంజినీర్స్ దినోత్సవం, సంచాయక దినోత్సవం
16: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
17: మహిళల మైత్రీ దినోత్సవం
20: రైల్వే భద్రతాదళ వ్యవస్థాపక దినం
21: బయోస్ఫియర్ దినం,
అంతర్జాతీయ శాంతి, అహింస దినోత్సవం,
ప్రపంచ అల్జిమర్స్ దినోత్సవం
22: క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం, గులాబీల దినోత్సవం
24: ప్రపంచ హృదయ దినోత్సవం, ప్రపంచ నదుల దినోత్సవం, ఎన్.ఎస్.ఎస్. దినోత్సవం.
26: చెవిటి వారి దినోత్సవం
27: ప్రపంచ పర్యాటక దినోత్సవం
28: అంతర్జాతీయ సమాచార హక్కుల దినం, గన్నర్స్ డే, వరల్డ్ హార్ట్ డే,
ప్రపంచ నదుల దినోత్సవం.
సెప్టెంబర్ 4వ ఆదివారం- కూతుళ్ల దినోత్సవం.
అక్టోబర్
1: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, వన్యప్రాణి వారోత్సవాలు, జాతీయ తపాలా దినోత్సవం, స్వచ్ఛంద రక్తదాన దినం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం.
ప్రపంచ ఆవాస దినోత్సవం.
2: మానవ హక్కుల పరిరక్షణ దినం, గాంధీ జయంతి, గ్రామ్‌స్వరాజ్ డే,
ఖైదీల దినోత్సవం.
ప్రపంచ జంతువుల దినోత్సవం
4: ప్రపంచ జంతు సంక్షేమ దినం
5: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
6: వరల్డ్ స్మైల్ డే,
ప్రపంచ గృహవసతి దినం
8: భారత వాయుసేన దినోత్సవం
రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ
దినోత్సవం
9: ప్రపంచ పోస్ట్ఫాస్ దినోత్సవం,
న్యాయ సేవా దినం,
జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం.
10: ప్రపంచ మానసిక ఆరోగ్య దినం
12: ప్రపంచ దృష్టి దినోత్సవం
13: ప్రపంచ గుడ్డు దినోత్సవం
14: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
15: అంతర్జాతీయ అంధుల ఆసరా దినం,
గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే,
ప్రపంచ కవిత్వ దినం.
16: ప్రపంచ ఆహార దినం
17: అంతర్జాతీయ దారిద్ర నిర్మూలన
దినోత్సవం
21: పోలీస్ సంస్మరణ దినం
23: అంతర్జాతీయ పాఠశాల గ్రంథాలయ
దినోత్సవం
24: ఐక్యరాజ్యసమితి దినోత్సవం,
ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం, ఇండో-టిబెటియన్ సరిహద్దు దళాల
అవతరణ దినోత్సవం
27: పదాతిదళ దినోత్సవం, శిశుదినోత్సవం
28: అత్తవార్ల దినోత్సవం
30: ప్రపంచ పొదుపు దినోత్సవం
31: జాతీయ సమైక్యత దినోత్సవం,
జాతీయ పునరంకిత దినం,
ఇందిరాగాంధీ వర్ధంతి.
నవంబర్
1: ఆంధ్రప్రదేశ్, కర్నాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భవ దినోత్సవం.
గర్వాల్ రైఫిల్ దినం
7: ఎన్.టి.పి.సి. స్థాపన దినోత్సవం,
బాలల సంరక్షణ దినం
8: వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే
9: లీగల్ సర్వీసెస్ దినం,
ప్రపంచ నాణ్యతా దినోత్సవం
10: రవాణా దినం
11: వెటరన్స్ డే, జాతీయ విద్యా
దినోత్సవం
14: ప్రపంచ మధుమేహ దినోత్సవం,
ప్రపంచ బాలబాలికల దినోత్సవం,
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు,
జాతీయ పుస్తక వారోత్సవాలు, సహకార సంఘాల వారోత్సవాలు.
17: ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం.
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
19: ప్రపంచ సాంస్కృతిక,
వారసత్వ దినం, పౌరుల దినోత్సవం
20: యూనివర్సల్ చిల్డ్రన్స్ డే
21: ప్రపంచ మత్స్య పరిశ్రమ దినం, ప్రపంచ టెలివిజన్ దినం.
25: అంతర్జాతీయ స్ర్తిలపై జరిగే అకృత్యాల వ్యతిరేక దినం, జాతీయ జంతు సంక్షేమ దినం, ఎన్‌సిసి దినోత్సవం.
26: జాతీయ న్యాయ దినోత్సవం,
సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.
డిసెంబర్
1: ప్రపంచ ఎయిడ్స్ దినం,
నాగాలాండ్ దినోత్సవం,
సరిహద్దు భద్రత దళ ఏర్పాటు దినోత్సవం
2: ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా
దినోత్సవం
4: భారత నౌకాదళ దినోత్సవం
5: అంతర్జాతీయ వాలంటీర్స్ దినం
6: పౌర రక్షణ దినం
7: సైనికదళాల పతాక దినం,
అంతర్జాతీయ పౌర విమానయాన
దినోత్సవం
8: హోమ్‌గార్డ్స్ ఏర్పాటు దినోత్సవం
జలాంతర్గాముల దినోత్సవం
9: జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం
10: అంతర్జాతీయ మానవ హక్కుల దినం.
ప్రపంచ జంతువుల హక్కుల దినం
11: యునిసెఫ్ దినోత్సవం, అంతర్జాతీయ పర్వత దినోత్సవం
12: అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం
14: జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
15: ఇంటర్నేషనల్ టీ డే
17: పెన్షనర్స్ డే
18: అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం,
మైనారిటీ హక్కుల దినం (భరతదేశం)
19: గోవా విముక్తి దినోత్సవం.
22: ప్రపంచ గణిత దినం
23: కిసాన్ దినోత్సవం
24: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, సెంట్రల్ ఎక్సైజ్ డే
26: జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
31: వరల్డ్ స్పిరిట్యువల్ డే

Tuesday, 10 July 2012



మే 2 
¤ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ వారంరోజుల పర్యటన కోసం దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా చేరుకున్నారు.
    » ప్రిటోరియాలోని చారిత్రక యూనియన్ బిల్డింగ్ (అధ్యక్ష భవనం) వద్ద దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌జుమాతో ప్రతిభాపాటిల్ సమావేశమయ్యారు
 
 
    » విద్యుత్, ఐటీ, ఆరోగ్యం, టూరిజం, మౌలికాభివృద్ధి లాంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని భారత్, దక్షిణాఫ్రికా నిర్ణయించాయి
మే 3 
¤ దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ జైలుశిక్ష అనుభవించిన ఓల్డ్‌ఫోర్ట్ జైలులోనే రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
    » చారిత్రక ఓల్డ్‌ఫోర్ట్ జైలును ప్రస్తుతం దక్షిణాఫ్రికా దేశ అత్యున్నత న్యాయస్థానంగా మార్చారు
.
    » దక్షిణాఫ్రికా స్వాతంత్య్రానికి ముందు అణచివేత కేంద్రాలుగా నిలిచిన కారాగారాలు, ఇతర కేంద్రాలను మ్యూజియమ్‌లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చేస్తున్నారు. 
మే 6 
 ¤ మూడురోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ కోల్‌కతా చేరుకున్నారు (ఆమె బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చారు).  
¤ దక్షిణాఫ్రికాలో శాస్త్ర సాంకేతిక విద్యారంగం అభివృద్ధి, యువతలో నైపుణ్యాల పెంపు దిశగా తోడ్పడే ఒక ఐటీ కేంద్రానికి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ డర్బన్‌లో శంకుస్థాపన చేశారు.
    » 1904లో మహాత్మాగాంధీ స్థాపించిన 'ఫీనిక్స్ సెటిల్‌మెంట్' ఆశ్రమ ప్రాంతంలోనే 'మహాత్మాగాంధీ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు
మే 7 
¤ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ న్యూఢిల్లీలో రేస్‌కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలో మన్మోహన్‌తో సమావేశమయ్యారు (మూడు దేశాల ఆసియా పర్యటనలో భాగంగా ఆమె భారత్ చేరుకున్నారు).
    » భారత పర్యటనకు ముందు హిల్లరీ చైనా, బంగ్లాదేశ్‌లలో పర్యటించారు
.
    » హిల్లరీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కోల్‌కతాలో సమావేశమయ్యారు.
¤ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా 1893లో జాతి వివక్షతో మహాత్మాగాంధీని రైల్లోనుంచి తోసేసిన చరిత్రాత్మక ఘటనకు సాక్షిగా నిలిచిన పీటర్ మారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌ను రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సందర్శించారు
మే 8 
¤ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
    » పౌరసమాజం చేపట్టే వినూత్న ఆవిష్కరణలను గుర్తించి, పెట్టుబడి పెట్టడానికి అమెరికాతో సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టుకు 50 లక్షల డాలర్లు ఇస్తున్నట్లు భారత్ ప్రకటించింది. హిల్లరీ క్లింటన్‌తో సమావేశమైన కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహరాల శాఖ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
¤ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చివరి విదేశీ పర్యటన ముగిసింది. తొమ్మిది రోజుల సీషెల్స్, దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం ఆమె ఢిల్లీ చేరుకున్నారు.
మే 27
¤ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మూడురోజుల పర్యటన నిమిత్తం మయన్మార్ చేరుకున్నారు
.
    » గడిచిన 25 ఏళ్లలో మయన్మార్ పర్యటనకు వెళ్లిన తొలి ప్రధాని మన్మోహన్ కావడం విశేషం
.
మే 28
¤ మయన్మార్ పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ద్వైపాక్షిక సహకారంపై ఆ దేశాధ్యక్షుడు థెయిన్ సెయిన్‌తో చర్చలు జరిపారు.
    » వాణిజ్యం, ఇంధనం తదితర 12 రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈమేరకు మనదేశం మయన్మార్‌కు 50 కోట్ల డాలర్ల రుణ సాయం అందించనుంది
 
 
మే 29 
¤ మయన్మార్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ దేశ ప్రజాస్వామ్య యోధురాలు ఆంగ్‌సాన్ సూకీని యాంగాన్‌లో కలుసుకున్నారు.
మే 31
 ¤ భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీపావెల్ రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిలతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు 
    » భారత్‌లోని బ్రిటన్ హైకమిషనర్ బేవాన్, ఇండోనేషియా రాయబారి అండీగాలిబ్ కూడా సీఎం, గవర్నర్‌లతో సమావేశమయ్యారు.


మే 1 
¤ 2012లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ రేటు పెరిగి 202 మిలియన్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) విడుదల చేసిన 'ప్రపంచ పని నివేదికలో పేర్కొంది
మే 3 
¤ గ్రామీణ, పట్టణ ప్రజల తలసరి ఆదాయం, ఖర్చులపై జులై 2009 - జూన్ 2010 మధ్య జాతీయ శాంపిల్ సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ) నిర్వహించిన సర్వేను విడుదల చేశారు
.
సర్వేలోని ముఖ్యాంశాలు
:
     » దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సరాసరి నెల ఖర్చు రూ.1054 (రోజుకు రూ.35). పట్టణ, నగర ప్రాంతాల్లో అది రూ.1984 (రోజుకు రూ
.66).
     » గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత దిగువస్థాయిలోని 10శాతం మంది నిరుపేదలు రోజుకి రూ.15 (నెలకు రూ.453) ఖర్చు చేస్తుంటే, పట్టణ పేదలు రోజుకి రూ.20 (నెలకు రూ.599) తో బతుకు వెళ్లదీస్తున్నారు
.
     » గ్రామీణ ప్రాంతాల్లో నెలకు తలసరి వినియోగ ఖర్చు (ఎంపీసీఈ)లో బీహార్, చత్తీస్‌గఢ్ రూ.780తో వెనుకబడి ఉన్నాయి. వాటికంట్ కాస్త మెరుగైన స్థానంలో ఒడిశా, జార్ఖండ్ ఉన్నాయి.(రూ.820).
     » గ్రామీణ ఎంపీసీఈలో కేరళలో అత్యధికంగా నెలకు రూ.1835, పంజాబ్‌లో రూ.1649, హర్యానాలో రూ.1510 ఖర్చు చేస్తున్నారు
.
     » పట్టణ ఎంపీసీఈలో రూ. 2437తో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో కేరళ (రూ. 2413), హర్యానా (రూ. 2321) ఉన్నాయి. రూ. 1238 ఖర్చుతో బీహార్ అట్టడుగున ఉంది.
     » ఆహారంపై గ్రామీణ ప్రాంతాల్లో 57 శాతం, పట్టణాల్లో 44 శాతం ఖర్చు చేస్తున్నారు
.
     » గ్రామాల్లో తృణధాన్యాల వినియోగం నెలకు 11.3 కేజీలు ఉంటే, నగరాల్లో అది 9.4 కేజీలుగా ఉంది
.
     » ఎన్ఎస్ఎస్ఓ అంచనాల ఆధారంగానే ప్రణాళికా సంఘం 2009-10లో దారిద్య్రరేఖను నిర్ధారించింది. పట్టణ ప్రాంతాల్లో అది రూ. 28.65 వద్ద, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 22.42 వద్ద ఉన్నట్లు పేర్కొంది
.
     » ప్రణాళికా సంఘం అంచనాల ప్రకారం 2009-10లో 35.46 కోట్లమంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. 2004-05లో ఈ సంఖ్య 40.72 కోట్లు. 
మే 8 
¤ 'అంతర్జాతీయ వయసు, పెద్దల ఆరోగ్యంపై అధ్యయనం' పేరిట అమెరికా గణాంక విభాగం నిర్వహించిన సర్వే ప్రకారం 2050 నాటికి భారతదేశ మొత్తం జనాభాలో మూడోవంతు మంది 50 ఏళ్లకు పైబడినవారు ఉంటారు.
     » 2010 భారత జనాభా లెక్కల ప్రకారం దేశంలో 50 ఏళ్ల వయసువారు 19.18 కోట్లమంది ఉన్నారు. మొత్తం జనాభాలో ఇది 16.4 శాతం.
     » 2020 నాటికి ఇది 20 శాతానికి (26.49 కోట్లు), 2050 నాటికి 32.6 శాతానికి (54.04 కోట్లు) చేరుతుంది. 
మే 16
¤ 1990-2010 మధ్య మాతృ మరణాల ధోరణిపై ఐరాస జనాభా నిధి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస బాలల నిధి, ప్రపంచ బ్యాంకు కలిసి ఒక నివేదికను విడుదల చేశాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు:
     » ప్రపంచవ్యాప్తంగా 2010లో 2,87,000 మంది గర్భిణులు మరణించారు. 1990తో పోలిస్తే ఇది 47% తక్కువ.
     » 2010లో భారత్‌లో 56,000 (19%), నైజీరియాలో 40,000 (14%) మాతృ మరణాలు చోటుచేసుకున్నాయి.
     » కాంగో (15 వేలు), పాకిస్థాన్ (12 వేలు), సూడాన్ (10 వేలు), ఇండోనేషియా (9 వేలు), టాంజానియా (8,500), బంగ్లాదేశ్ (7,200), అఫ్గనిస్థాన్ (6,400) మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
     » మొత్తం 180 దేశాల్లో సర్వే నిర్వహించారు. మాతృ మరణాల సూచి 154 దేశాల్లో తగ్గితే 26 దేశాల్లో పెరిగింది.
     » మాతృ మరణాల సూచిలో తగ్గుదల సాధించిన తొలి అయిదు దేశాలు ఇస్తోనియా (95%), మాల్దీవులు (93%), రుమేనియా (84%), భూటాన్ (82%), ఈక్వటోరియల్ గినియా (81%).
     » ఈ దేశాలు 2015 లక్షిత సంవత్సరం కంటే చాలా ముందుగానే తగ్గుదలను సాధించడం విశేషం. 
మే 21
¤ టి.ఆర్. బాలు నేతృత్వంలో 31 మంది సభ్యులతో రైల్వేలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది.
     » రైల్వేస్టేషన్లు, రైళ్లలో సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడంపై స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
మే 25
¤ నీల్సన్ - ఇండియా టుడే సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని యూనివర్సిటీల్లో 2012 సంవత్సరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 6వ స్థానం లభించింది.
     » దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీల్లో ఓయూకి ప్రథమ స్థానం దక్కడం విశేషం
.
     » గత ఏడాది 6వ స్థానంలో ఉన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఈ ఏడాది 9వ స్థానం దక్కింది.


మే 23  
¤ విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల అంశంపై అధ్యయనం జరిపిన జె.సి. కలా కమిటీ తన నివేదికను కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించింది.
    » ఈ కమిటీ తవ్వకాలకు సానుకూలంగా పలు సిఫార్సులు చేసింది. దీంతో పాటు ప్రభావిత ప్రాంతాల ప్రజల అభిప్రాయాలకు పెద్దపీట వేయాలని, మరోసారి గిరిజన సలహా మండలి తీర్మానం తీసుకోవాలని సూచించింది
.
    » బాక్సైట్ తవ్వకాల వల్ల ప్రజలు నేరుగా ఎక్కడా నిర్వాసితులయ్యే ప్రసక్తి లేదని నివేదికలో పేర్కొన్నారు
.
    » తవ్వకాలు జరిగే ప్రాంతం రాతినేలలు కావడం, ఇతర ప్రతికూల కారణాల వల్ల అక్కడ పచ్చదనం లేదని; చెప్పుకోదగిన పర్యావరణ సున్నిత ప్రాంతాలూ లేవని నివేదికలో తెలిపారు
.
    » తవ్వకాల వల్ల ఆదిమ జాతులకు ఎలాంటి ముప్పులేదని, చారిత్రక, సాంస్కృతిక కట్టడాలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు
.
మే 25  
¤ బొగ్గు, సహజ వాయువు, భూమి లాంటి సహజ వనరుల కేటాయింపు, ధరల నిర్ణయంలో పారదర్శకత కోసం అశోక్‌చావ్లా కమిటీ చేసిన 69 సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది
.
    » చావ్లా కమిటీ గతేడాది మేలో తన నివేదికను సమర్పించింది. మొత్తం 81 సిఫార్సులు చేయగా 69 సిఫార్సులకు ప్రభుత్వ ఆమోదం లభించింది

ఏప్రిల్ 4
¤ మల్టీనేషనల్ డిజైన్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ (ఎండీఈపీ) సంస్థలో నూతన సభ్యురాలిగా భారత్ చేరింది. ఈ సంస్థను అమెరికా, ఫ్రాన్స్ ప్రారంభించాయి. ఇందులో ఈ రెండు దేశాలతోపాటు కెనడా, చైనా, ఫిన్లాండ్, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రిటన్ దేశాలకు సభ్యత్వం ఉంది.
   » నూతన అణుశక్తి నమూనాకు సంబంధించి ఈ దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి.
ఏప్రిల్ 6
¤ ప్రపంచంలో మొదటిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితోనే పారా మిలటరీ పైప్ బ్యాండ్ (సంగీత బృందం)ను ఏర్పాటుచేసిన ఘనతను కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) దక్కించుకుంది.
   » దేశంలోని మూడు మహిళా సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ల నుంచి ఎంపిక చేసిన 22 మందితో ఈ సంగీత బృందం ఏర్పాటైంది.
   » 1986లో మహిళా సీఆర్‌పీఎఫ్ తొలి బెటాలియన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు దళాలు పనిచేస్తున్నాయి.
   » అన్ని కేంద్ర దళాలు, రాష్ట్రాల పోలీసు శాఖలకు ఉన్నట్లే సీఆర్‌పీఎఫ్‌కు కూడా పురుషుల బ్యాండ్ ఉంది.
   » సీఆర్‌పీఎఫ్ డీఐజీ - నీతూ భట్టాచార్య (మహిళా విభాగం)
   » సీఆర్‌పీఎఫ్ డీఐజీ - విజయ్‌కుమార్
ఏప్రిల్ 7
¤ 2010లో భారతదేశాన్ని సందర్శించిన పర్యటకుల వివరాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ముఖ్యాంశాలు:    » 2010లో ఆంధ్రప్రదేశ్ 15.57 కోట్ల మంది పర్యటకులను ఆకర్షించింది. దేశం మొత్తం మీద దేశీయ పర్యటకుల వాటాలో 21 శాతాన్ని కైవసం చేసుకుంది.
   » ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసిన మొత్తం పర్యటకుల సంఖ్య 15.58 కోట్లు. ఇందులో 99 శాతం (15.57 కోట్లు) దేశీయ పర్యటకులే. వీరిలో అధికులు సందర్శించిన ప్రాంతం తిరుపతి.
   » తర్వాతి స్థానాలు హైదరాబాద్, విశాఖపట్నం.
   » మన రాష్ట్రాన్ని సందర్శించిన విదేశీ పర్యటకుల సంఖ్య 3,22,825.
   » 2009తో పోలిస్తే 2010లో మన రాష్ట్రాన్ని సందర్శించిన దేశీయ పర్యటకుల సంఖ్య 1.1% తగ్గింది. విదేశీ పర్యటకుల సంఖ్య 59.4 శాతం తగ్గింది.
   » దేశీయ సందర్శకుల సంఖ్యలో మన తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (14.6 కోట్లు), తమిళనాడు (11.44 కోట్లు), మహారాష్ట్ర (4.84 కోట్లు), కర్ణాటక (3.80 కోట్లు) ఉన్నాయి. ఈ అయిదు రాష్ట్రాల వాటా 67.4%; మన రాష్ట్ర వాటా 21%.
   » విదేశీ పర్యటకులను ఎక్కువగా ఆకర్షించింది మాత్రం మహారాష్ట్ర (50 లక్షలు). తర్వాత తమిళనాడు (28 లక్షలు), ఢిల్లీ (18 లక్షలు), ఉత్తరప్రదేశ్ (16 లక్షలు), బీహార్ (6 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (3.22 లక్షలు).
   » మొత్తం మీద భారత్‌లో దేశీయ పర్యటకుల సంఖ్య 74.02 కోట్లు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వృద్ధి 10.7 శాతం.
   » భారత్‌కు విచ్చేసిన విదేశీ పర్యటకుల సంఖ్య 1.78 కోట్లు. కిందటి ఏడాదితో పోలిస్తే వృద్ధి 24.2%.
   » విదేశీ పర్యటకుల రాకలో ప్రపంచంలో భారత్ వాటా 0.61%. ప్రపంచ పర్యటకంలో భారత్ స్థానం 40.
   » పర్యటకం కోసం 2011-12లో కేటాయించిన నిధులు రూ. 1100 కోట్లు.
   » 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12)లో కేటాయించిన నిధులు రూ. 5156 కోట్లు.
   » ఆంధ్రప్రదేశ్‌కు 2011-12లో కేటాయించిన నిధులు రూ. 20.38 కోట్లు. 2010-11లో
రూ. 37.29 కోట్లు, 2009-10లో రూ. 109.89 కోట్లు కేటాయించారు.
ఏప్రిల్ 10
¤ దేశంలోనే తొలిసారి భారతీ ఎయిర్‌టెల్ సంస్థ కోల్‌కతాలో నాలుగోతరం (4జీ) సేవలను ప్రారంభించింది.
    » భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ సంజయ్ కపూర్.
 
 ¤ భారత మొదటి జల వారోత్సవాలను ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు.  
ఏప్రిల్ 12
¤ ప్రైవేటు పాఠశాలలు పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా ఇచ్చి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా హక్కు చట్టానికి రాజ్యంగ గుర్తింపును సమర్థిస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే మైనార్టీ విద్యాసంస్థలకు దీన్నుంచి మినహాయింపు ఇచ్చింది.
¤ మతంతో సంబంధం లేకుండా వివాహ నమోదును (రిజిస్ట్రేషన్) తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనన మరణాల చట్టం, 1969లో సవరణ కోసం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది.
    » బాల్య వివాహాలను అరికట్టడానికి వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు, 18వ లా కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
    » సిక్కుల వివాహాలను హిందూ వివాహ చట్టం కింద కాకుండా 'ఆనంద్ వివాహ చట్టం, 1909' కింద ప్రత్యేకంగా నమోదు చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను కూడా కేంద్రం ఆమోదించింది. దీనికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం సిక్కులు, జైనులు, బౌద్ధుల వివాహాలను హిందూ వివాహ చట్టం కిందే నమోదు చేస్తుండటంతో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
¤ 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఏఐసీటీఈ రెండు సరికొత్త మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందులో ఒకటి అయిదేళ్ల మేనేజ్‌మెంట్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కాగా, ఇంకోటి బీటెక్, బీఆర్క్, బీఫార్మా డిగ్రీలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం. 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరూ ఈ రెండు కోర్సులకు అర్హులే.
¤ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ) ఉత్తరప్రదేశ్‌లో రూ. 10,000 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయతలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.
    » ప్రతిపాదిత వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలును సుసాధ్యం చేసేందుకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్ ఎస్‌పీవీ (జీఎస్‌టీఎన్ ఎస్‌పీవీ)గా వ్యవహరించనున్నారు. ఇది కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐటీ సంబంధ మౌలిక సదుపాయాలను, సేవలను సమకూరుస్తుంది. దీన్ని రూ. 10కోట్ల మూల ధనంతో ఏర్పాటు చేస్తారు.
ఏప్రిల్ 13
¤ ఎంపీ ల్యాడ్స్ పథకం నుంచి వివిధ క్రీడా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడానికిప్రభుత్వం ఎంపీలకు అనుమతించింది.
   » పంచాయత్ యువ క్రీడా ఖేల్ అభియాన్ (పీవైకేకేఏ), అర్బన్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీం(యూఎస్ఐఎస్పథకాలను ఎంపీ ల్యాడ్స్‌తో కలిపేందుకు  నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ 19
¤  రైల్వే ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ. 3 నుంచి రూ. 5 కు పెంచాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
   » పెంచిన ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి.
¤ అసోం శాసన సభ 75వ వార్షికోత్సవ సమావేశాన్ని గౌహతిలో నిర్వహించారు.
   » ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఏప్రిల్ 22
¤ ప్రపంచంలో భారీ టెలీస్కోప్ నిర్మాణ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరాలని భారత్ నిర్ణయించింది.ఇందుకోసం రూ. 700 కోట్లను అణుశక్తి శాఖ మంజూరు చేసింది   » అమెరికాలో నిర్మిస్తున్న  టెలీస్కోప్ ద్వారా స్పష్టమైన చిత్రాలుడేటాను పొందవచ్చు   » అమెరికాకెనడాజపాన్చైనాలకు  ప్రాజెక్టులో సభ్యత్వం ఉందిదీని నిర్మాణం 2019లోపూర్తవుతుందని భావిస్తున్నారు   » ప్రపంచంలో అతిపెద్దదైన హబుల్ టెలీస్కోప్ కంటే ఇది 10 రెట్లు ఎక్కువ శక్తిమంతమైంది
ఏప్రిల్ 24
¤ గిరిజన ప్రాంతాల్లోని కేంద్రీయ విద్యాసంస్థల్లో రాష్ట్రాల కోటా కింద ఎస్సీఎస్టీఓబీసీలకు రిజర్వేషన్కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.
¤ 
రాజ్యసభ సభ్యులుగా 50 మంది ప్రమాణ స్వీకారం చేశారువీరిలో అరుణ్‌జైట్లీమాయావతి,విలాస్‌రావ్ దేశ్‌ముఖ్రాజీవ్ శుక్లాచిరంజీవిజయా బచ్చన్ మొదలైనవారు ఉన్నారు   » భాజపా నేత అరుణ్ జైట్లీని రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.
ఏప్రిల్ 25
¤ పార్లమెంటు భద్రత కోసం 1500 మంది బలగాలతో ప్రత్యేక దళం ఏర్పాటుకు ప్రభుత్వంఆమోదించింది   » ప్రత్యేక శిక్షణ పొందిన సీఆర్‌పీఎఫ్ బలగాలతో 'పార్లమెంటు డ్యూటీ గ్రూప్పేరిట  దళంపార్లమెంటు ప్రాంగణంలో విధులు నిర్వహిస్తుంది
ఏప్రిల్ 26
¤ ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్)పై వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం నుంచి 8.6శాతానికి పెంచుతున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది
ఏప్రిల్ 28
¤ 2011లో దేశ వ్యాప్తంగా పాముకాటు వల్ల 1440 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖప్రకటించింది   » అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 380 మంది పాము కాటు వల్ల చనిపోయారురెండోస్థానంలోఒడిశా (మృతులు సంఖ్య 296), మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ (258 మంది మృతులునిలిచాయి   » రేబిస్ వల్ల గతేడాది దేశ వ్యాప్తంగా 223 మంది చనిపోయారుఅత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 73మంది మరణించారుతర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (45 మంది), ఒడిశా (24 మంది), తమిళనాడు (21మందికర్ణాటక (18 మందినిలిచాయి.