current affairs June2012
జాతీయం
బినాయక్ సేన్, బులూ ఇమామ్‌లకు గాంధీ అవార్డుభారత్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్ సేన్, బులూ ఇమామ్‌లకు లండన్‌లోని గాంధీ ఫౌండేషన్ అంతర్జాతీయ శాంతి పురస్కారాలను ప్రకటించింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో వీరికి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. బెంగాల్‌కు చెందిన పిల్లల వైద్యుడైన సేన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముఖ్యంగా ఛ త్తీస్‌గఢ్ రాష్ట్రంలో గిరిజనుల ఆరోగ్యం కోసం విశేష కృషి చేశారు. జార్ఖండ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త బులూ ఇమామ్ పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అంతర్జాతీయ శాంతి అవార్డును గాంధీ ఫౌండేషన్ 1998 లో ఏర్పాటు చేసింది. గాంధీ సిద్ధాంతాలను ప్రభోదిస్తూ, అహింసా మార్గాన్ని అనుసరించే వ్యక్తులు, గ్రూపులకు ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు.
ఐటీడీసీ చైర్మన్‌గా వాఘేలాఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) చైర్మన్‌గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా జూన్ 13న బాధ్యతలు స్వీకరించారు. దేశంలో అశోకా గ్రూప్ హోటళ్లను ఐటీడీసీ నిర్వహిస్తోంది. ఐటీడీసీ చైర్మన్‌కు కేబినెట్ స్థాయి హోదా ఉంటుంది.
భారత వృద్ధి రేటు 6.9 శాతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2012-13లో 6.9 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. ‘గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్’ పేరిట ప్రపంచ బ్యాంకు జూన్ 12న విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం భారత్ 2013-14లో 7.2 శాతం, 2014-15లో 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటుంది. సంస్కరణలు నిలిచిపోవడం, విద్యుత్ సమస్య, బలహీన ద్రవ్య విధానం వంటి కారణాలతో గత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి సన్నగిల్లిందని నివేదిక విశ్లేషించింది. 2011-12లో భారత జీడీపీ 6.5 శాతానికి క్షీణించింది.
బార్క్ డెరైక్టర్‌గా శేఖర్ బసుబాబా అణు పరిశోధన కేంద్రం(బార్క్) డెరైక్టర్‌గా శేఖర్ బసు నియమితులయ్యారు. ప్రస్తుతం బసు న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఐబీఏ చైర్మన్‌గా అలోక్ మిశ్రాఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్‌గా బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ అలోక్ మిశ్రా ఎన్నికయ్యారు. కె.ఆర్. కామత్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్), జేపీ దువా(అలహాబాద్ బ్యాంక్), చందా కొచ్చర్(ఐసీఐసీఐ బ్యాంక్) డిప్యూటీ చైర్ పర్సన్‌లుగా ఎన్నికయ్యారు.
07- 13 జూన్ 2012
సీఈసీగా వి.ఎస్.సంపత్నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)గా వీరవల్లి సుందరం(వి.ఎస్.) సంపత్ జూన్ 6న నియమితులయ్యారు. ఎస్.వై. ఖురేషి స్థానంలో జూన్ 11న సంపత్ బాధ్యతలు స్వీకరించారు. 2015 జనవరిలో 65 ఏళ్ల వయసులో ఆయన పదవీ విరమణ చేస్తారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం కమిషనర్ లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే దాకా (వీటిలో ఏది ముందు పూర్తయితే అది) పదవిలో కొనసాగుతారు. ఎన్నికల సంఘంలో ఇప్పుడు ఉన్న ఇద్దరు ఎన్నికల కమిషనర్లలో 62 ఏళ్ల సంపత్, హెచ్.ఎస్. బ్రహ్మ కంటే సీనియర్ కావడంతో సంప్రదాయాన్ని పాటించి ఆయనకే సీఈసీగా పదోన్నతి కల్పించారు. సంపత్ 2009 ఏప్రిల్‌లో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన 1973 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి.
నౌకాదళ ప్రధానాధికారిగా దేవేంద్ర జోషి భారత నౌకాదళ ప్రధానాధికారిగా వైస్ అడ్మిరల్ దేవేంద్ర జోషి నియమితులు కానున్నారు. జలాంతర్గాముల విధ్వంసక యుద్ధతంత్రంలో నిపుణుడైన జోషి ప్రస్తుతం పశ్చిమ నౌకాదళ ముఖ్యాధికారిగా వ్యవహరిస్తున్నారు. 2012 ఆగస్ట్ 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత నౌకాదళాధిపతి అడ్మిరల్ నిర్మల్ వర్మ స్థానంలో జోషి బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. జోషి 1974 ఏప్రిల్ 1న
భారతీయ నౌకదళంలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరడం ద్వారా కెరీర్ ప్రారంభించారు.
భారతీయ నౌకదళంలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరడం ద్వారా కెరీర్ ప్రారంభించారు.
ఆనంద్ మహీంద్రాకు లీడర్‌షిప్ అవార్డుభారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ) నాయకత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయనతోపాటు అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్ అలన్ ములాలీ కూడా ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సంస్థ భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందింపజేయడానికి కృషి చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన బాలికల నిష్పత్తిఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది బాలురకు బాలికల నిష్పత్తి 943కు తగ్గింది (ఇది 2001లో 961). ఆరు సంవత్సరాలలోపు ప్రతి 1000 మంది బాలురకు బాలికల నిష్పత్తి పట్టణాల్లో 946 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 942గా ఉంది (ఇది 2001 లో పట్టణాల్లో 963, గ్రామీణ ప్రాంతాల్లో 955). రాష్ట్ర జనగణన విభాగం జూన్ 7 విడుదల చేసిన మండలాల వారీ జనాభా ఈ వివరాలను వెల్లడించాయి.
రాష్ట్ర మొత్తం జనాభా:* 8,46,65,533 (గ్రామీణ జనాభా-5,63,11,788. పట్టణ జనాభా-2,83,53,745).
* రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పట్టణ జనాభాతో పోల్చితే గ్రామీణ జనాభా వృద్ధి రేటు తగ్గింది.
* అత్యధిక జనాభా ఉన్న మండలాల జాబితాలో 10.35 లక్షల జనాభాతో విజయవాడ అర్బన్ తొలిస్థానంలో నిలవగా.. మారేడుమిల్లి (తూర్పుగోదావరి)కి చివరి స్థానం దక్కింది.
* రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలు ఉన్నారు. బాల బాలికల (0 నుంచి 6 ఏళ్ల వయసు) నిష్పత్తి అత్యంత తక్కువగా నల్గొండ జిల్లా చిట్యాల(528)లో నమోదయింది. రెండో స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ మండలం (704) నిలిచింది.
* రాష్ట్ర సగటు అక్షరాస్యత 67.66 శాతం (దేశ సగటు అక్షరాస్యత 74.04). 2001లో 2.61 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 2.45 కోట్లకు తగ్గింది.
రాష్ట్ర మొత్తం జనాభా:* 8,46,65,533 (గ్రామీణ జనాభా-5,63,11,788. పట్టణ జనాభా-2,83,53,745).
* రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పట్టణ జనాభాతో పోల్చితే గ్రామీణ జనాభా వృద్ధి రేటు తగ్గింది.
* అత్యధిక జనాభా ఉన్న మండలాల జాబితాలో 10.35 లక్షల జనాభాతో విజయవాడ అర్బన్ తొలిస్థానంలో నిలవగా.. మారేడుమిల్లి (తూర్పుగోదావరి)కి చివరి స్థానం దక్కింది.
* రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలు ఉన్నారు. బాల బాలికల (0 నుంచి 6 ఏళ్ల వయసు) నిష్పత్తి అత్యంత తక్కువగా నల్గొండ జిల్లా చిట్యాల(528)లో నమోదయింది. రెండో స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ మండలం (704) నిలిచింది.
* రాష్ట్ర సగటు అక్షరాస్యత 67.66 శాతం (దేశ సగటు అక్షరాస్యత 74.04). 2001లో 2.61 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 2.45 కోట్లకు తగ్గింది.
ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌గా ఆర్‌పీ సింగ్నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) నూతన చైర్మన్‌గా రాజీందర్ పాల్ సింగ్ (ఆర్.పి.సింగ్) జూన్ 11న నియమితులయ్యారు. ఈయన 1976 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ (రిటైర్డ్) అధికారి. ఆర్.పి.సింగ్ ఈ పదవిలో మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కొనసాగుతారు.
జాతీయంఐఎస్‌సీఏ శత వార్షికోత్సవంఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఐఎస్‌సీఏ) శత వార్షికోత్సవాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జూన్ 2న కలకత్తా యూనివర్సిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదిని ‘భారత్‌లో శాస్త్ర సంవత్సరం’గా ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 100 పరిశోధన ఫెలోషిప్‌లు అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 2003 నాటి విధానపత్రం స్థానంలో శరవేగంగా మారిపోతున్న శాస్త్రరంగాన్ని ప్రతిబింబిస్తూ నూతన శాస్త్రసాంకేతిక విధానాన్ని రూపొందిస్తామన్నారు.
జాతీయ టెలికాం విధానం 2012కు కేబినెట్ ఆమోదంజాతీయ నూతన టెలికాం విధానం(ఎన్‌టీపీ) 2012కు కేంద్ర కేబినెట్ మే 31న ఆమోదం తెలిపింది. కొత్త విధానం వల్ల రోమింగ్ చార్జీలు రద్దవుతాయి. దేశమంతటా ఉచిత రోమింగ్, పూర్తి స్థాయి నెంబర్ పోర్టబిలిటీ అందుబాటులోకి వస్తాయి. దేశంలో ఎక్కడ ఏ నెట్‌వర్క్‌కు మారినా ప్రస్తుతం ఉపయోగిస్తున్న నెంబరునే ఉపయోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 39 శాతం టెలికాం సర్వీసులను 2020 నాటికి 100 శాతానికి పెంచుతారు. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను కనీసం 2 ఎంబీపీఎస్‌కు పెంచుతారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. కొత్త విధానంలో ఆపరేటర్లకు లెసైన్సులు, స్పెక్ట్రమ్ విడిగా కల్పిస్తారు. ఏకీకృత లెసైన్సింగ్ విధానం అమల్లోకి వస్తుంది. ఆపరేటర్లు కేవలం ఒకే టెక్నాలజీకి పరిమితం కాకుండా ఏ టెక్నాలజీ ద్వారానైనా సర్వీసులు అందించవచ్చు.
సైనికాధిపతిగా బిక్రమ్ సింగ్భారత సైనిక దళానికి 25వ సైనికాధిపతిగా జనరల్ బిక్రమ్ సింగ్ మే 31న బాధ్యతలు స్వీకరించారు. జనరల్ విజయ్ కుమార్ (వీకే) సింగ్ నుంచి పగ్గాలు చేపట్టిన బిక్రమ్ సింగ్ రెండు సంవత్సరాల మూడు నెలలపాటు పదవిలో కొనసాగుతారు. ఇంతకుముందు ఈయన కోల్‌కతా కేంద్రంగా ఉన్న తూర్పు సైనిక విభాగం అధిపతిగా పని చేశారు. ఇండియన్ మిలటరీ అకాడమీ ద్వారా 1972, మార్చి 31న సిఖ్ లైట్ ఇన్‌ఫ్రాంటీ రెజిమెంట్‌లో చేరడం ద్వారా కెరీర్ ప్రారంభించారు.
హైదరాబాద్‌లో బ్రిటన్ కాన్సులేట్బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయా(కాన్సులేట్)న్ని మే 31న హైదరాబాద్‌లో ఆ దేశ దౌత్య విభాగాధిపతి సైమన్ ఫ్రేజర్ ప్రారంభించారు. ఇది హైదరాబాద్‌లో మూడో కాన్సులేట్ కార్యాలయం. మొదట ఇరాన్, 2008 లో అమెరికాలు తమ కాన్సులేట్ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. దీంతో భారత్‌లో బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయాల సంఖ్య ఏడుకు చేరింది.
భట్టాచార్యకు బ్రిటన్ సాహిత్య పురస్కారంబ్రిటన్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ప్రదానం చేసే ‘ఆన్‌డాట్జీ-2012’ బహుమతికి ఢిల్లీకి చెందిన రాహుల్ భట్టాచార్య ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘ద స్లై కంపెనీ ఆఫ్ పీపుల్ హూ కేర్’ నవలకుగాను ఈ బహుమతి లభించింది. భారతీయ పాత్రికేయుడి సాహసకృత్యాలే ఇతివృత్తంగా ఈ నవల సాగుతుంది. ఒక భారతీయుడికి తొలిసారిగా ఈ అవార్డు దక్కింది. భట్టాచార్య ‘పండిట్స్ ఫ్రమ్ పాకిస్థాన్’ అనే క్రికెట్ పుస్తకాన్ని కూడా రాశారు.
‘ఆకాశ్’ పరీక్ష విజయవంతం
No comments:
Post a Comment