Wednesday, 27 June 2012


Current events and Ap polity and Economy 



* భారత ప్రధాని మీడియా సలహాదారుగా నియమితులైనది ఎవరు.?
- భారత ప్రధాని మీడియా సలహాదారుగా పంకజ్ పచౌరి నియమితులయ్యారు. పంకజ్ పచౌరి గతంలో ఎన్‌డిటీవీ హిందీ ఛానల్‌కు ప్రయోక్తగా వ్యవహరించేవారు. ఇంత వరకూ మీడియా సలహాదారుగా ఉన్న హరీశ్ ఖరే రాజీనామా చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలు, లక్ష్యాలు మీడియాకు మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ , ముద్రణ, సామాజిక మీడియాకు , ప్రజలకు అందించడంలో పచౌరి సలహాలు ఇస్తారు. ప్రధాని కార్యాలయంలో బాధ్యతలు చేపట్టినన వారిలో పచౌరి మూడో జర్నలిస్టు.
* ఆంధ్రప్రదేశ్ దేవాదాయ మంత్రిగా నియమితులైనది ఎవరు?
- రామచంద్రయ్య
* ఆంధ్రప్రదేశ్ వౌలిక వసతులు, పెట్టుబడులు, సహజవాయువులు, ఓడరేవులు శాఖ మంత్రి ఎవరు?
- గంటా శ్రీనివాసరావు
* మొక్కజొన్నలో విత్తనాలకు పోషకాల బదిలీని నియంత్రించే జన్యువుకు ఆక్స్‌ఫర్డు శాస్తవ్రేత్తలు ఏం పేరు పెట్టారు?
- మెగ్-1 అని పేరు పెట్టారు. సాధారణంగా జన్యువుల్లో తల్లి తరఫు క్రోమోజోములు, తండ్రి తరఫు క్రోమోజోములు రెండూ ఉంటాయి. మెగ్-1లో మాత్రం తల్లి తరఫు క్రోమోజోములు మాత్రమే ఉంటాయి.
* సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎవరు?
- జస్టిస్ ఎస్ హెచ్ కపాడియా
* రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు?
- అశోక్ గెహ్లాట్
* ప్రస్తుత ప్రసార భారతి చైర్ పర్సన్ ఎవరు?
- మృణాల్ పాండే
* రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ఎవరు?
-జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ
* హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది?
- సిమ్లా
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీవిరమణ వయస్సు ఎంత ?
- 65 సంవత్సరాలు
* శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రానికి ఏ శాస్తవ్రేత్త పేరును నామకరణం చేశారు?
- సతీష్ దావన్
* అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ ఎవరు?
- కల్పనా చావ్లా
* మిస్‌వరల్డ్-2011 విజేత ఎవరు?
- ఇవియాన్ లునసోల్ సర్కోస్ (వెనుజువెల)
* మెసపటోమియా ప్రాంతాన్ని ప్రస్తుతం ఏ దేశంగా వ్యవహరిస్తున్నాం?
-ఇరాక్
* నేపాల్ ప్రధాన మంత్రి ఎవరు?
- బాబూరాం భట్టారాయ్
* రాష్ట్ర శాసనమండలి అధ్యక్షుడు ఎవరు?
- డాక్టర్ ఎ. చక్రపాణి
* రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎవరు?
- నాదెండ్ల మనోహర్
* పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఎవరు?
- యూసఫ్ రజా గిలానీ
* పాకిస్థాన్ అధ్యక్షుడు ఎవరు?
- ఆసిఫ్ అలీ జర్దారీ

ప్రభుత్వ పథకాలు భారత్ నిర్మాణ్ యోజన:

ప్రభుత్వ పథకాలు
భారత్ నిర్మాణ్ యోజన:

ప్రధాని మన్మోహన్ సింగ్ భారత్ నిర్మాణ్ యోజనను న్యూఢిల్లీలో 2005, డిసెంబర్ 16న ప్రారంభించారు. ఈ పథకాన్ని నాలుగేళ్ల వ్యవధితో (2005-2009) రూ.1,74,000 కోట్ల వ్యయంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏర్పాటు చేశారు. గ్రామీణ అంశాలను ఎంపిక చేసి, నాలుగేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలు నిర్ణయించారు.
1. సాగునీటిపారుదల: 2009 వరకు అదనంగా కోటి హెక్టార్లకు సాగునీరు అందించడం లక్ష్యం
2. తాగునీటి సరఫరా: తాగునీరు అందుబాటులో లేని 74,000 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించడం
3. గ్రామీణ రోడ్లు : 1000 జనాభా ఉన్న అన్ని గ్రామాలకు, 500 జనాభా ఉన్న గిరిజన కొండ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేపట్టాలి.
4. గృహ నిర్మాణం: పేదలకు అదనంగా 60 లక్షల గృహాలు నిర్మించడం
5. గ్రామీణ విద్యుదీకరణ: గ్రామీణ ప్రాంతాలన్నింటినీ విద్యుదీకరించాలి. 2.3 కోట్ల గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి.

6. టెలిఫోన్ సౌకర్యం: గ్రామీణ ప్రాంతాలకు టెలిఫోన్ సౌకర్యం కల్పించడం.
అందరికీ ఆరోగ్యం, వైద్యసేవలు, పౌష్టికాహారం, ఆహారభద్రత మొదలైన ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో భా గంగా భారత్ నిర్మాణ్ యోజనను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకానికి 2010-11 కేం ద్ర బడ్జెట్‌లో రూ. 48,000 కోట్లు, 2011-12 కేం ద్రబడ్జెట్‌లో రూ. 58,000 కోట్లు కేటాయించారు.

స్వర్ణజయంతి గ్రామీణ స్వరోజ్‌గార్ యోజన - (SGSY) ఏప్రిల్ 1, 1999:
కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్‌జిఎస్‌వై ప్రారంభించారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (IRDP), దాని అనుబంధ పథకాలను కలిపి (SGSY) ఏర్పాటుచేశారు. దీనిలో విలీనం చేసిన పథకాలు...
1. సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం IRDP
2. TRYSEM (Training for Rural Youth & self Employment 3.3. Development of women & Chil-dren in Rural Areas (DWCRA)
4. Million Wells Scheme (MWS)
5. Supply of improved toolkits to Rural Artisans (SITRA)
6. Ganga Kalyan Yogana (GKY)
SGSY ని భారతదేశంలో అతి ముఖ్యమైన స్వయం సంమృద్ధి పథకంగా పేర్కోవచ్చు. ఈ పథకంలో గ్రామీణ పేదలను స్వయం సహాయక బృందాలుగా (Self Help Groups SHG) ఏర్పాటు చేయటం, వారి సామర్థ్యాన్ని పెంచటం, అవస్థాపనా సౌకర్యాలు కల్పించటం మొదలైనవి చేపడతారు.

SGSY 50 శాతం షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ తరగతులకు; 40 శాతం మహిళలకు, 3 శాతం వికలాంగులకు లబ్ది చేకూర్చేలా రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు. ఈ పథకానికయ్యే ఖర్చులో కేంద్రం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరిస్తాయి.

Note: SGSY గ్రామీణ ప్రాంతాల్లోని స్వ యం ఉపాధి పథకం
స్వర్ణజయంతి షహారీ రోజ్‌గార్ యోజన (SJSRY)
డిసెంబర్ 1, 1997లో దీన్ని పట్టణ పేదరిక నిరుద్యోగ నిర్మూలన కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో స్వయం ఉపాధి, వేతన ఉపాధి కలిసి ఉన్నాయి. SJSRY పథకం పట్టణ నిరుద్యోగులు, పట్టణ అల్ప ఉపాధి ఉన్నవాళ్లకు ఉపాధి కల్పిస్తుంది. దీన్ని 2009, ఏప్రిల్ 1 నుంచి ప్రక్షాళన చేశారు. ఈ పథకాన్ని ప్రస్తుతం 5 పట్టణ పథకాల ద్వారా అమలుపరుస్తున్నారు అవి..

1. The Urban Self Employment Programme (USEP)
2. The Urban Women Self help Programme (UWSP)
3. Skill Training for Employment Promotion amongst Urban Poor (STEP-UP)
4. The Urban Wage Employment Programme (UWEP)
5. The Urban Community Development Network (UCDN)

Note: SJSRY ఒఖ్గ పట్టణ ప్రాంతానికి చెందింది. ఇది స్వయం ఉపాధి, వేతన ఉపాధితో కూడిన పథకం.
జాతీయ సామాజిక సహాయతా కార్యక్రమం: (National Social Assistance Programme -NSAP) ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక భద్రత కల్పించాలనే ఆదేశిక సూత్రాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1995 ఆగస్ట్ 15న NSAPని ప్రారంభించింది. ప్రారంభంలో 65 ఏళ్లకు పై బడిన వృద్ధులు, కుటుంబ పెద్ద కోల్పోయిన కుటుంబాలు, గర్భిణులకు ఆర్థిక చేయూత ఇవ్వటానికి ఈ పథకం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ పథకంలో మూడు పథకాలను అమలు చేస్తున్నారు. అవి...

ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (IGNOAPS): 65 ఏళ్లు పైబడిన వృద్థులకు నెలకు రూ. 200 పెన్షన్ ఇచ్చే పథకం. ప్రారంభంలో రూ.75 గా ఉన్న ఈ మొత్తాన్ని 2006 ఏప్రిల్ 1 నుంచి రూ. 200కు పెంచారు. కేంద్రం ఇచ్చే మొత్తానికి సమానంగా అంటే రూ. 200 కనీస పెన్షన్ రాష్ర్ట ప్రభుత్వం ఇవ్వాలని సూచించారు. అంటే ఒక వృద్ధునికి రూ. 400 ప్రతినెలా లభించేలా చేశారు. ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఈ పథకం విస్తరించారు. 2010-11 నుంచి AIDS వ్యాధి గ్రస్తులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించారు.

జాతీయ కుటుంబ లబ్ధి పథకం NFBS: ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం అందిస్తారు.

అన్నపూర్ణ పథకం: వృద్ధాప్య పెన్షన్ పొందలేని వృద్ధులకు అన్నపూర్ణ పథకం ద్వారా నెలకు 10 కి.గ్రా. ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ పథకాన్ని ఏప్రిల్, 2000 నుంచి అమలు చేస్తున్నారు.

అంత్యోదయ అన్న యోజన: పేదరిక రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ఈ పథకం డిసెంబర్ 25, 2000న ఏర్పాటు చేశారు. BPL కుటుంబాలకు రూ.3కు కిలో బియ్యం, రూ. 2కు కిలో గోధుమలు చొప్పున నెలకు 25 కి.గ్రా. అందించేవారు. 2002 ఏప్రిల్ 1 నుంచి ఈ మొత్తాన్ని 35 కి.గ్రా.లకు పెంచారు. ప్రారంభంలో కోటి పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా దీన్ని ఏర్పాటు చేశారు. 2005-06 నుంచి ఈ పథకాన్ని 2.5 కోట్ల కుటుంబాలకు విస్తరించారు.

ఇందిర ప్రభ పథకం:
ఈ పథకాన్ని గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలోని సిరిగొండాయపాలెంలో నవంబర్ 19, 2004న ప్రారంభించారు. ప్రభుత్వం పంచిన మిగులు భూములు, అసైన్డ్ భూములను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి 90 శాతం నిధులు నాబార్డ్ అందిస్తుంది. నాబార్డ్ సమగ్ర భూ అభివృద్ధి పథకం ద్వారా ఈ పథకానికి నిధులు లభిస్తున్నాయి.

భూభారతి:
కేంద్రప్రభుత్వం 1988-89లో భూమి రికార్డుల కంప్యూటరీకరణ పథకాన్ని ప్రారంభించింది. ఇది భూమి కమతాల మధ్య సరైన సరిహద్దులు నిర్ణయించి రైతుల మధ్య జరిగే వివాదాలను పరిష్కరిస్తుంది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2006, నవంబర్‌లో భూభారతి పేరుతో నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో ప్రారంభించారు.

పొలంబడి:
ఈ పథకాన్ని తూర్పుగోదావరి జిల్లాలోని తొర్రేడు గ్రామంలో ప్రారంభించారు. కేంద్ర జాతీయ వ్యవసాయ విధానంలో పేర్కొన్న విధంగా సేంద్రీయ వ్యవసాయ విధానం అమలుకోసం ఈ పథకం రాష్ట్రంలో ప్రారంభించారు. రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణ, నీటి యాజమాన్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ.. మొదలైన అంశాలపై శిక్షణ ఇవ్వటం ఈ పథకం లక్ష్యాలు.

పశుక్రాంతి:
ఆంధ్రప్రదేశ్‌లో పాడి పరిశ్రమ అభివృద్ధికి సెప్టెంబర్ 6, 2007లో ఈ పథకాన్ని కడపలోని పులివెందులలో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 2 పశువులను 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తారు. ఈ పథకం ద్వారా ఒకవైపు పేదరికం తగ్గించడం, మరోవైపు పాడిపరిశ్రమ అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం జీవక్రాంతి పేరుతో రాష్ట్రంలో నిరుపేదలకు మేకలు, గొర్రెలు మొదలైనవి పంపిణీ చేస్తున్నారు. రూ.100 కోట్లతో కడపలో ఇందిరా గాంధీ పశువ్యాధి నిర్దారణ చికిత్స కేంద్రం స్థాపించారు.

Y.S.R. అభయహస్తం:
స్వయం సహాయక గ్రూపు మహిళలకు పెన్షన్ కల్పించే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ‘అభయహస్తం’ పేరుతో ఫిబ్రవరి 6, 2008న ప్రారంభించారు. ఈ పథకాన్ని నవంబర్ 1 2009న ై‘వె.ఎస్.ఆర్ అభయహస్తం’ అని పేరుమార్చి, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రారంభించారు. స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించి, వృద్ధాప్యంలో మహిళలకు చేయూత ఇవ్వటానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

స్వయం సహాయక గ్రూప్‌ల్లోని మహిళలు నెలకు కనిష్టంగా రూ.30, గరిష్టంగా రూ.150 ఎల్‌ఐసీకి చెల్లించాలి. అంతే మొత్తం నగదును రాష్ట్ర ప్రభుత్వంకూడా ఆ మహిళల పేరుతో ఎల్‌ఐసీకి చెల్లిస్తుంది. మహిళకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.500 - రూ.2,200 వరకు పెన్షన్ అందిస్తారు. ఈ మహిళలు మరణిస్తే రూ. 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 75,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇద్దరు పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకు చదివే వారికి నెలకు రూ. 100 చొప్పున ఏడాదికి రూ.1200ల స్కాలర్‌షిప్ అందిస్తారు.

ప్రాక్టీస్ బిట్స్
1. జన్మభూమి ప్రారంభించిన సంవత్సరం? (ఏఈఈ-2008)
1) 2005 2) 2002 3) 2000 4) 1997

2. గ్రామీణ భూమిలేని కార్మికులకు ఉద్యో గితా హామీ పథకం ఏ ప్రణాళికలో ప్రారంభించారు? (డిప్యూటీ ఈఓ-2008)
1) 3 2) 4 3) 5 4) 6

3. రాష్ట్రంలో డ్వాక్రా విధానం ఎప్పుడు ప్రారంభమైంది? (ఏఈఈ-2008)
1) 1982-83 2) 1990-91
3) 2001-02 4) 2003-04

4. స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజనలో విలీనం చేయని పథకం?
(నాన్ గెజిటెడ్-2005)
1) TRYSEM 2) NRY
3) DWCRA 4) IRDP
5. రాష్ట్రంలో గ్రామీణ దారిద్య్ర నివారణ పథకం? (గ్రూప్-2, 2002)
1) దీపం 2) డ్వాక్రా
3) వెలుగు 4) ఆదరణ

6. అంత్యోదయ అన్నయోజన ఎప్పుడు ప్రారంభిచారు? (గ్రూప్-2, 2003)
1) 2001 2) 2000 3) 2002 4) 2003

7. అంత్యోదయ కార్యక్రమం ఉద్దేశం? (ఎంపీడీఓ-98)
1) భారతదేశంలో పేదరికాన్ని పూర్తిగా పారదోలడం
2) హరిజనుల అభివృద్ధి
3) అల్ప సంఖ్యాకుల అభివృద్ధి
4) అట్టడుగున ఉన్న నిరుపేదలకు సహాయం

8. JRY ఏ పథకం? (గ్రూప్-1, 1995)
1) పేదరిక నివారణ
2) ప్రాంతీయ అభివృద్ధి
3) విద్యుత్ అభివృద్ధి 4) పర్యావరణ

9. జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
(ఏఈఈ-2008)
1) ఫిబ్రవరి 2, 2006
2) ఫిబ్రవరి 2, 2007
3) మార్చి 20, 2007
4) ఏప్రిల్ 16, 2005

10. NREGPని ఎప్పటి నుంచి -MGNREGP గా మార్చారు?
(అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్స్-2011)
1) నవంబర్ 14, 2008
2) సెప్టెంబర్ 1, 2006
3) అక్టోబర్ 2, 2009
4) అక్టోబర్ 2, 2010

11. NREGP ఖర్చులో కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు?
1)50:50 2)72:25 3)25:75 4)90:10

12. భూభారతి ఎప్పుడు ప్రారంభించారు?
1) ఆగస్ట్ 15, 2007
2) అక్టోబర్ 2, 2007
3) సెప్టెంబర్ 1, 2006
4) నవంబర్ 1, 2006
13. {పజాపథంలో ఎన్ని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు?

1) 7 2) 10 3) 13 4) 20

14. 20 అంశాల పథకంను ప్రారంభించిన ప్రణాళిక ?
1) 2 2) 3 3) 4 4) 5


సమాధానాలు:
1) 4 2) 4 3) 1 4) 2 5) 3 6) 2 7) 4 8) 1 9) 1 10) 3
11) 4 12) 4 13) 1 14) 4
1. 2011, డిసెంబర్ 22న బాధ్యతలు స్వీకరించిన రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్?
1) మదన్ భీం రావు లోకూర్
2) సుభాష్ రెడ్డి 3) శ్రీకృష్ణ 
4) నిస్సార్ అహ్మద్ కక్రూ

2. 2011 నవంబర్ 4న ముఖ్యమంత్రి రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖల ద్వారా అందించే 12 రకాల సేవల పత్రాల కోసం తిరుపతిలో ప్రారంభించిన పథకం?
1) మీ సేవ 2) రచ్చబండ
3) రైతు రెవెన్యూ పథకం 4) రీక్యాప్

3. జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన 28 ప్రాజెక్టుల నిర్మాణ గడువును రాష్ర్ట ప్రభుత్వం ఎన్నేళ్లు పొడిగించింది?
1) 1 2) 2 3) 4 4) 5 

4. ఆరోగ్య అత్యవసర సేవలైన 108 అంబు లెన్సుల నిర్వహణకు రాష్ర్ట ప్రభుత్వం జీవీకే సంస్థకు ఎన్నేళ్లకు అప్పగించింది?
1) 1 2) 5 3) 10 4) 12 

5. అంగన్‌వాడీ కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం * 1500 నుంచి ఎంతకు పెంచింది?
1) రూ. 2000 2) రూ. 3000
3) రూ. 4000 4) రూ. 5000

6. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక పురుష- {స్తీ నిష్పత్తి ఉన్న జిల్లా?
1) రంగారెడ్డి 2) హైదరాబాద్
3) విజయనగరం 4) నిజామాబాద్

7. ప్రాథమిక విద్యాహక్కు చట్టాన్ని ఏ ఆర్టికల్‌లో చేర్చారు?
1) 19 2) 20 3) 21 4) 21 (ఎ)

8. సమాచార హక్కును రాజ్యాంగంలోని ఏ అధికరణలో అనుబంధీకరించారు? 
1) 14 2) 19 3) 21 4) 25

9. భారత ప్రాధికార సంస్థ(UIDAI) చైర్మన్?
1) నందన్ నీలేకని 2) రంగరాజన్
3) ప్రధానమంత్రి 4) కె.సి. రెడ్డి

10. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు బాధ్యత ఎవరిది?
1) కేంద్ర ప్రభుత్వం 2) రాష్ర్ట ప్రభుత్వం
3) కేంద్రం, రాష్ట్రాలు 4) పార్లమెంటు

11. దేశంలోనే ఏకైక కూర్మనాథస్వామి (విష్ణువు) దేవాలయం ఏ జిల్లాలో ఉంది?
1) చిత్తూరు 2) నెల్లూరు
3) నిజామాబాద్ 4) శ్రీకాకుళం

12. కానుగ విత్తనాల నుంచి బయోడీజిల్ తీసి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే కార్యక్రమాన్ని రాష్ట్రంలో తొలిసారిగా ఏ జిల్లాలో ప్రారంభించారు?
1) ఆదిలాబాద్ 2) మహబూబ్‌నగర్
3) శ్రీకాకుళం 4) ఖమ్మం

13. ఏ జిల్లాలో జనుము ఉత్పత్తి అధికం?
1) శ్రీకాకుళం 2) విజయనగరం
3) నిజామాబాద్ 4) వరంగల్

14. 1956లో గిరిజన సహకార సంఘాన్ని ఎక్కడ స్థాపించారు?
1) విజయవాడ 2) విజయనగరం
3) విశాఖపట్నం 4) ఆదిలాబాద్

15. అరటిపండ్ల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న జిల్లా?
1) తూర్పు గోదావరి 2) పశ్చిమగోదావరి
3) కృష్ణా 4) గుంటూరు

16. పోలవరం ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
1) కృష్ణా 2) పెన్నా
3) తుంగభద్ర 4) గోదావరి

17. 1918లో రాష్ట్రంలో తొలి సహకార సంఘాన్ని పట్టాభి సీతారామయ్య గుడ్లవల్లేరులో స్థాపించారు. ఇది ఏ జిల్లాలో ఉంది?
1) విశాఖపట్నం 2) కృష్ణా
3) పశ్చిమ గోదావరి 4) తూర్పుగోదావరి

18. గ్రామా ల్లో100 రోజుల ఉపాధి కల్పనకు 1993లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం?
1) ఈజీఎస్ 2) ఈఏఎస్
3) ఎన్‌ఆర్‌ఈపీ 4) ఎన్‌ఆర్‌ఈజీపీ

19. పొగాకు ఉత్పత్తిలో భారతదేశ హవానాగా పేరుగాంచిన రాష్ర్టం?
1) ఆంధ్రప్రదేశ్ 2) ఉత్తర ప్రదేశ్
3) తమిళనాడు 4) కేరళ

20. ఉత్పత్తి, సంపద పంపిణీ గురించి వివరించేది?
1) ఆర్థిక వృద్ధి 2) ఆర్థికాభివృద్ధి
3) దేశాభివృద్ధి 4) సామాజిక అభివృద్ధి

21. నగరీకరణ, అక్షరాస్యత రేటు ఆర్థికా భివృద్ధికి ఏ రకమైన సూచిక?
1) ఆర్థిక 2) జనాభా 
3) సాంఘిక 4) అభివృద్ధి 

22. నిరుపేదలకు ఆహారధాన్యాల పంపిణీ చేసే కార్యక్రమం?
1) అన్నపూర్ణ యోజన 
2) అంత్యోదయ అన్న యోజన
3) చౌకధరల పంపిణీ 4) పైవన్నీ

23. ‘వాడరేవు’ ఓడరేవును ఏ జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారు?
1) విశాఖపట్నం 2) నెల్లూరు
3) కృష్ణా 4) ప్రకాశం

24. ఏ రంగం ద్వారా మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి?
1) ప్రాథమిక 2) ద్వితీయ 
3) తృతీయ 4) కుటుంబ 

25. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో నిధులు సమకూర్చాలి?
1) 50:50 2) 60:40 3) 70:30 4) 90:10


26. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపించే పేదరికం ఏ రకమైంది?
1) సంపూర్ణ 2) సాపేక్ష 
3) వ్యవస్థాపర 4) సంస్థాగత 

27. భారతదేశంలో తొలి జనాభా గణన నిర్వహించిన సంవత్సరం?
1) 1872 2) 1881 3) 1891 4) 1901

28. అర్థశాస్త్రంలో నోబుల్‌ప్రైజ్‌ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1933 2) 1945 3) 1969 4) 1901

29. అమలులో ఉన్న వేతనం వద్ద పనిచేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితి ఏ నిరుద్యోగిత?
1) ఇచ్ఛాపూర్వక 2) అనిచ్ఛాపూర్వక 
3) ప్రచ్ఛన్న 4) వ్యవస్థాపూర్వక 
30. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ ఎన్నంచెల విధానాన్ని సూచించింది?
1) 1 2) 2 3) 3 4) 5 

31.ఙ్ట్చఛగ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో కలిసి కనిష్ట-గరిష్ట సభ్యుల సంఖ్య? 
1) 3-15 2) 5-21
3) 10-30 4) 6-18

32. మండల పరిషత్ కార్యనిర్వాహణ అధికారి 
1) జడ్‌పీటీసీ 2) ఎంపీటీసీ
3) ఎంపీడీఓ 4) ఎమ్మార్వో

33. భారతదేశంలో సూక్ష్మరుణ సంస్థలను నియంత్రించేది?
1) ఆర్‌బీఐ 2) ఎస్‌బీఐ
3) నాబార్‌‌డ 4) ఆప్కాబ్

34. రూపాయి లోగో (*) రూపకర్త?
1) సుధాకర్ రావ్ పాండే
2) ఉదయ్ కుమార్ 3) సుశీల్ కుమార్
4) నందన్ నీలేకని

35. భూ గరిష్ట పరిమితిలో భాగంగా రాష్ట్రంలో భూమిని ఎన్ని గ్రేడులుగా వర్గీకరించారు?
1) 6 2) 7 3) 10 4) 11

36. 1997లో ప్రారంభించిన ‘జన్మభూమి కార్యక్రమం’ను ఏ దేశం నుంచి గ్రహిం చారు?
1) దక్షిణ కొరియా 2) ఉత్తర కొరియా
3) జపాన్ 4) ఫ్రాన్స్

37. అంత్యోదయ యోజన పథకాన్ని మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఆంధ్రప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) రాజస్థాన్ 4) కేరళ

38. వెలుగు, డ్వాక్రా పథకాలను విలీనం చేిసి ఇందిరాక్రాంతి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 2004 2) 2005 3) 2006 4) 2007

39. 2011 ప్రకారం అత్యల్ప జనాభా ఉన్న జిల్లా?
1) ఆదిలాబాద్ 2) విజయనగరం
3) శ్రీకాకుళం 4) మహబూబ్‌నగర్

సమాధానాలు
1) 4 2) 1 3) 3 4) 2 5) 2 6) 4 7) 4 8) 2 9) 1 10) 2 11) 4 12) 1 13) 2 14) 3 15) 1 16) 4 17) 2 18) 2 19) 1 20) 2 21) 3 22) 2 23) 4 24) 3 25) 4 26) 1 27) 1 28) 3 29) 2 30) 3 31) 2 32) 3 33) 1 34) 2 35) 4 36) 1 37) 3 38) 2 39) 2
1. మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఓడరేవు ఏది?
ఎ) కృష్ణపట్నం బి) నిజాంపట్నం
సి) మచిలీపట్నం డి) విశాఖపట్నం
2. రైతులు పండించిన పంటను తనఖా పెట్టుకుని వారికి పరపతి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో మార్కెట్ కమిటీలు ప్రవేశపెట్టిన పథకం?
ఎ) రైతుబంధు బి) రైతు బజార్లు
సి) సహకార మార్కెటింగ్ డి) ఏదీకాదు
3. ఆంధ్రప్రదేశ్ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్‌ను 1957, సెప్టెంబర్ 19న ఎక్కడ నెలకొల్పారు?
ఎ) హైదరాబాద్ బి) విజయవాడ
సి) విశాఖపట్నం డి) కర్నూలు
4. రైతులు పండించిన వివిధ పంటలు మార్కెట్‌లోకి రాకముందే ప్రభుత్వం ప్రకటించే ధరను ఏమంటారు?
ఎ) జారీ ధర బి) సేకరణ ధర
సి) కనీస మద్దతు ధర డి) చట్టబద్ధ ధర
5. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి బి) తూర్పు గోదావరి
సి) హైదరాబాద్ డి) గుంటూరు
6. {V>Ò$× జనాభా అధికంగా ఉన్న ప్రాంతం?
ఎ) తెలంగాణ బి) రాయలసీమ
సి) కోస్తాంధ్ర డి) దక్షిణాంధ్ర
7. అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్న పంచదార కర్మాగారం ఏది?
ఎ) ఆంధ్రా షుగర్స్ బి) నిజాం షుగర్స్
సి) బోధన్ షుగర్ ఫ్యాక్టరీ డి) విశాఖ షుగర్స్
8. చిరి చాపలు (తుంగ చాపలు) ఉత్పత్తి చేసే పరిశ్రమ ఎక్కడ ఉంది?
ఎ) శ్రీకాకుళం బి) ఆదిలాబాద్
సి) వరంగల్ డి) మహబూబ్‌నగర్
9. ‘బేలు’ అంటే ఎన్ని కిలో గ్రాముల పత్తికి సమానం?
ఎ) 50 కిలోలు బి) 100 కిలోలు
సి) 150 కిలోలు డి) 170 కిలోలు
10. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
ఎ) 1960 బి) 1963
సి) 1964 డి) 1987
11. దేశంలోనే మొదటిదైన జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీని ఏ జిల్లాలో నెలకొల్పుతున్నారు?
ఎ) హైదరాబాద్ బి) మెదక్
సి) రంగారెడ్డి డి) వైజాగ్
12. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి?
ఎ) జూన్ మొదటి వారం బి) జూన్ రెండో వారంలో 
సి) జూన్ మూడో వారంలో డి) జూన్ చివరి వారం
13. SRI అంటే ఒక?
ఎ) వరి వంగడం బి) గోధుమ వంగడం
సి) ఆధునిక ఉత్పత్తిని ఇచ్చే విత్తనం
డి) వరిసాగు పద్ధతి
14. ఎన్నో విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా నిర్వహించారు?
ఎ) ఒకటో విడత బి) రెండో విడత
సి) మూడో విడత డి) నాలుగో విడత
15. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అడవులు ఎక్కువగా ఉన్నాయి?
ఎ) తెలంగాణ బి) ఆంధ్ర
సి) రాయలసీమ డి) ఉత్తరాంధ్ర
16. పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏది?
ఎ) నాలుగు బి) అయిదు
సి) ఆరు డి) మూడు
17. సూక్ష్మ విత్తం (కజీఛిటౌ ఊజ్చీఛ్ఛి) పై నియమించిన కమిటీ?
ఎ) మోహన్ కందా కమిటీ
బి) మాలెగాం కమిటీ సి) రాకేశ్ మోహన్ కమిటీ
డి) రంగరాజన్ కమిటీ
18. ఎల్‌పీజీ గ్యాస్, కిరోసిన్‌లకు సబ్సిడీలో నగదు బదిలీ అధ్యయనానికి నియమించిన టాస్క్‌ఫోర్స్ చైర్మన్ ఎవరు?
ఎ) నందన్ నీలేకని బి) రతన్ టాటా
సి) రంగరాజన్ డి) మోహన్ కందా
19.ఙ్ట్చఛగ్రామ అధికారుల పదవులను రద్దు చేసిన సంవత్సరం?
ఎ) 1984 బి) 1987 సి) 1991 డి) 1975
20. మండల పరిషత్ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏది?
ఎ) బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
బి) అశోక్ మెహతా కమిటీ
సి) చెన్నారెడ్డి కమిటీ డి) ఏదీకాదు
21. పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన 40వ అధికరణం దేనిలో భాగం?
ఎ) ప్రాథమిక హక్కులు బి) ప్రాథమిక విధులు
సి) రాజ్యాంగ పీఠిక డి) ఆదేశిక సూత్రాలు
22. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అవసరమైన కనీస వయసు ఎంత?
ఎ) 18 సంవత్సరాలు బి) 21 సంవత్సరాలు
సి) 25 సంవత్సరాలు డి) 24 సంవత్సరాలు
23. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన మొదటి రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) ఉత్తర ప్రదేశ్ సి) కేరళ
డి) బీహార్
24. ఒక గ్రామాన్ని గ్రామ పంచాయతీగా గుర్తించాలంటే ఆ గ్రామంలో ఉండాల్సిన కనీస జనాభా ఎంత?
ఎ) 250 బి) 500
సి) 650 డి) 1000
25. ఉపగ్రహ సహాయంతో భూ రికార్డులు సేకరించి, కంప్యూటరీకరణ చేసే భూభారతి పథకాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు?
ఎ) ఆదిలాబాద్ బి) శ్రీకాకుళం
సి) పశ్చిమ గోదావరి డి) నిజామాబాద్
26. లక్నో ఒడంబడిక ఎవరి మధ్య కుదిరింది?
ఎ) మితవాదులు, అతివాదులు
బి) బ్రిటిష్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ
సి) కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్
డి) అంబేద్కర్, గాంధీ
27. భారతదేశంలో పనిచేసిన ఈ కింది బ్రిటిష్ గవర్నర్ జనరల్స్‌ను కాలానుక్రమంలో పొందుపర్చండి?
i) కారన్ వాలీస్ ii) వెల్లెస్లీ 
iii) వారెన్ హేస్టింగ్స్ iv) డల్హౌసీ
ఎ) i, ii, iii, iv బి) ii, iii, i, iv
సి) iv, iii, ii, i డి) iii, i, ii, iv
28. విశ్వానికంతటికీ కేంద్రం ‘భూమి’ అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
ఎ) టాలమీ బి) కోపర్నికస్
సి) మాల్టన్ డి) అరిస్టాటిల్
29. కింద పేర్కొన్న జతలను పరిశీలించి తప్పుగా జతపర్చిన దాన్ని గుర్తించండి?
జీ. ఉత్తర అమెరికా - పంపాలు
ii. దక్షిణ అమెరికా - ప్రయరీలు
iii. ఆస్ట్రేలియా - వెల్డులు
iv. దక్షిణాఫ్రికా - డౌనులు
ఎ) iv మాత్రమే బి) i, ii, iv
సి) iii మాత్రమే డి) పైవన్నీ
30. ‘విష వత్తులు’ అని ఏఏ రోజులను పిలుస్తారు?
ఎ) మార్చి 21, జూన్ 21
బి) మార్చి 21, సెప్టెంబర్ 23
సి) జూన్ 21, డిసెంబర్ 22
డి) సెప్టెంబర్ 23, డిసెంబర్ 22
31. కింది వాటిలో శాసన మండలికి ఎవరెవరు ఎంతమందిని ఎన్నుకుంటారో ఇవ్వడం జరిగింది.
i) శాసనసభ్యులు - 1/3వ వంతు మందిని
ii) పట్టభద్రులు - 1/12వ వంతు మందిని
iii) ఉపాధ్యాయులు - 1/6వ వంతు మందిని
iv) స్థానిక సంస్థల ప్రతినిధులు-1/3వ వంతు మందిని
పై వాటిలో తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి?
ఎ) i మాత్రమే బి) ii మాత్రమే
సి) iii మాత్రమే డి) i, iv మాత్రమే
32. కింది వాటిలో మూలధన వస్తువు ఏది?
ఎ) ట్రాక్టర్ బి) ఎరువులు
సి) నాగలి డి) ఇనుము
33. ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి ప్రక్రియ ప్రైవేటు యాజమాన్యంలో ఉంటే ఆ వ్యవస్థని ఏమంటారు?
ఎ) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
బి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
డి) దేశీయ ఆర్థిక వ్యవస్థ
34. తలసరి ఆదాయాన్ని గణించే పద్ధతి?
ఎ) జాతీయాదాయం/ దేశ జనాభా
బి) జాతీయాదాయం/ దేశ జనాభా ్ఠ 100
సి) దేశ జనాభా/ జాతీయాదాయం
డి) దేశ జనాభా/ జాతీయాదాయం ్ఠ 100
35. నీటి సరఫరా, గ్యాస్ సరఫరాలను ఏ రంగంలో పరిగణిస్తారు?
ఎ) వ్యవసాయ రంగం బి) ద్వితీయ రంగం
సి) తృతీయ రంగం డి) ప్రాథమిక రంగం
36. నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ చైర్మన్?
ఎ) నందన్ నీలేకని
బి) శ్యాం పిట్రోడా సి) కపిల్ సిబాల్
డి) సి. రంగరాజన్
37. సూపర్ కంప్యూటర్ ‘కె’ను ఆవిష్కరించిన దేశం?
ఎ) జపాన్ బి) చైనా
సి) అమెరికా డి) భారతదేశం
38. ‘అగ్ని-1’ క్షిపణి ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు?
ఎ) 500 కిలో మీటర్లు బి) 200 కిలో మీటర్లు
సి) 700 కిలో మీటర్లు డి) 1400 కిలో మీటర్లు
39. ‘ముల్లపెరియార్ ప్రాజెక్ట్’ వివాదం ఏఏ రాష్ట్రాల మధ్య నెలకొంది?
ఎ) ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు
బి) కర్ణాటక - తమిళనాడు
సి) కర్ణాటక - కేరళ డి) తమిళనాడు - కేరళ
40. రంగారెడ్డి జిల్లా ఏర్పాటైన సంవత్సరం?
ఎ) 1979 బి) 1980 సి) 1985 డి) 1978
41. వైశాల్యం ప్రకారం ప్రపంచంలో భారతదేశ స్థానం?
ఎ) 6 బి) 7 సి) 8 డి) 9
42. ఐక్యరాజ్యసమితిలో ఇటీవల సభ్యత్వం పొందిన దక్షిణ సుడాన్ సమితిలో ఎన్నో దేశంగా నిలిచింది?
ఎ) 192 బి) 194 సి) 193 డి) 191
43. దేశంలో అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సంస్థ?
ఎ) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
బి) నేషనల్ హైడల్ పవర్ కొర్పొరేషన్
సి) ఎన్‌ఈఈపీసీఓ డి) టీహెచ్‌డీసీ
44. మొదటి అంతరిక్ష యాత్ర చేసిన మేజర్ యూరిగగారిన్ ఏ దేశస్థుడు?
ఎ) అమెరికా బి) జపాన్
సి) రష్యా డి) ఫ్రాన్స్
45. దేశంలో మొట్టమొదటి రైల్వే సర్వీసు బాంబే-థానేల మధ్య ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
ఎ) 1853 బి) 1955
సి) 1843 డి) 1870
46. చేప, పక్షి, కప్ప, కోతుల హృదయాలలోని గదుల సంఖ్య వరుసగా?
ఎ) 2, 4, 3, 4 బి) 2, 3, 4, 4
సి) 4, 2, 4, 3 డి) 2, 4, 4, 3
47. మానవునిలో సాధారణ రక్తపీడనం స్థాయి?
ఎ) 20/80 బి) 120/90
సి) 120/80 డి) 120/100
48. కణజాల వర్ధనం ద్వారా ఏకస్థితిక మొక్కలను పెంచొచ్చని నిరూపించిన శాస్త్రవేత్త?
ఎ) హేబర్ లాండ్ బి) కారల్ లాండ్ స్టీనర్
సి) రోనాల్డ్ రాస్ డి) సతీష్ మహేశ్వరి
49. హానికర రక్తహీనత దేనిలోపం వల్ల సంభవిస్తుంది?
ఎ) ఐరన్ బి) సయానకోబాలమిన్
సి) కాల్షియం డి) ఫోలిక్ ఆమ్లం
50. నీలి రంగు రక్తం గల జీవులు?
ఎ) బొద్దింక, నత్త బి) పీత, నత్త 
సి) పీత, ఈగ డి) నత్త, సాలీడు
51. కింది వాటిలో సరైనది?
ఎ) ఊ=(9ఇ/5)+32 బి) ఊ=(5ఇ/9)+32
సి) ఇ=(9ఊ/5)+32 డి) ఇ=(9ఊ/5)32
52. లేసర్లను ఒక ప్రత్యేక త్రిమితీయ ఫోటోగ్రఫీలో వినియోగించడాన్ని ఏమంటారు?
ఎ) మైక్రో రామన్ వర్ణపట శాస్త్రం
బి) హాలోగ్రఫీ సి) రేడియో థెరపీ
డి) వివర్తనం
53. ఎలక్ట్రాన్ ఆవేశం ఎన్ని కూలూంబ్‌లు?
ఎ) -1.6 ప 10-19 బి) -1.6 ప 1019
సి) -1.6 ప 10-23 డి) -1.6 ప 1023
54. కిందివాటిలో సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాల్లో విభిన్నమైంది?
ఎ) నిజ ప్రతిబింబం బి) మిధ్యా ప్రతిబింబం
సి) {పతిబింబ పరిమాణం వస్తు పరిమాణానికి సమానం
డి) {పతిబింబంలో కుడి ఎడమలు తారుమారవుతాయి
55. విద్యుదావేశానికి ప్రమాణాలు?
ఎ) ఆంపియర్ బి) ఓమ్
సి) వాట్ డి) కూలూంబ్
56. సంపూర్ణాంతర పరావర్తనానికి నిజజీవిత అనువర్తనం?
ఎ) ప్రతిబింబాలు ఏర్పడటం
బి) ఎండమావులు ఏర్పడటం
సి) వక్రీభవనం డి) పరావర్తనం
57. ఘన పరిమాణం, ఘన పరిమాణ సంబంధాలు ఏ ప్రతిపాదనను వినియోగించుకుంటాయి?
ఎ) బాయిల్ బి) చార్లెస్
సి) గేలూసాక్ డి) అవగాడ్రో
58. వంటగ్యాస్‌లో ఉండే ముఖ్య సంఘటనం?
ఎ) మీథేన్ బి) ప్రోపేన్
సి) బ్యూటేన్ డి) గ్యాసోలిన్
59. కాయలను త్వరగా పళ్లగా మార్చడానికి ఉపయోగించే వాయువు?
ఎ) మీథేన్ బి) ఆక్సిజన్
సి) హైడ్రోజన్ డి) ఎసిటలీన్
60. సాధారణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఒక మోల్‌వాయువు ఎన్ని లీటర్ల ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తుంది?
ఎ) 22.4 లీటర్లు బి) 2.24 లీటర్లు
సి) 0.224 లీటర్లు డి) 224 లీటర్లు


సమాధానాలు
1) ఎ; 2) ఎ; 3) బి; 4) సి; 5) ఎ;
6) బి; 7) ఎ; 8) డి; 9) డి; 10) సి;
11) డి; 12) బి; 13) డి; 14) బి; 15) ఎ;
16) బి; 17) బి; 18) ఎ; 19) ఎ; 20) బి; 
21) డి; 22) బి; 23) డి; 24) బి; 25) డి; 
26) సి; 27) డి; 28) ఎ; 29) డి; 30) బి; 
31) సి; 32) డి; 33) సి; 34) ఎ; 35) బి; 
36) బి; 37) ఎ; 38) సి; 39) డి; 40) డి; 
41) బి; 42) సి; 43) ఎ; 44) సి; 45) ఎ; 
46) ఎ; 47) సి; 48) డి; 49) బి; 50) బి;
51) ఎ; 52) బి; 53) ఎ; 54) ఎ; 55) డి;
56) బి; 57) డి; 58) సి; 59) డి; 60) ఎ

No comments:

Post a Comment