Saturday, 28 July 2012


పిహెచ్.డి. చేయాలంటే ఇదీ మార్గం!

phd-heading talangana patrika telangana culture telangana politics telangana cinemaదేశంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్.డి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. వివిధ శాఖల్లో డాక్టరేట్ చేసేందుకు వందలాది మంది సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పిహెచ్.డి చేసేందుకు కార్యాచరణ.

పరిశోధనాత్మక విద్యగా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రదానం చేసే అత్యున్నత డిగ్రీగా గుర్తింపు పొందినది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ.. సంక్షిప్తంగా పి.హెచ్‌డి. విద్యాధికులు కావాలనుకునే వారి లక్ష్యాన్ని నెరవేర్చే గౌరవప్రద డాక్టరేట్ డిగ్రీ పిహెచ్‌డి. సుదీర్ఘ పరిశ్రమ, ఏకాగ్రత, తులనాత్మక పరిశోధనా దృష్టి, క్లిష్టమైన పరీక్షా విధానాలను విజయవంతంగా పూర్తి చేసినప్పుడే పిహెచ్‌డి డిగ్రీని పొందే అవకాశం ఉంటుంది.

పిహెచ్‌డి ప్రత్యేకత 
పిహెచ్‌డి చేసే విద్యార్థి ఒక స్కాలర్ మార్గ దర్శకత్వంలో పరిశోధన చేయవలసి ఉంటుంది. స్కాలరే విద్యార్థికి ‘రీసెర్చ్ సూపర్‌వైజర్’గా ఉంటారు. ఈ పరిశోధనను 4 సంవత్సరాల పాటు చేయవలసి ఉంటుంది. ఇంత తీవ్రమైన, సూక్ష్మమైన పరిశోధన చేసి ఒక అంశంపై లోతైన విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు కాబట్టి పిహెచ్‌డి చేసిన వారిని ఆయా రంగాల నిష్ణాతులుగానూ, విధాన రూపకల్పనలో అర్హులుగానూ, అ అంశాన్ని ఉన్నత స్థాయిలో బోధించడానికి అర్హులుగాను పరిగణించడం జరుగుతుంది.

పిహెచ్‌డి ప్రవేశ ప్రక్రియ 
భారతదేశంలోని విశ్వ విద్యాలయాలన్నింటిలోనూ పిహెచ్‌డికి సంబంధించిన ఒకే రకమైన నియమాలు ఉన్నాయి. పిహెచ్‌డి చేయాలంటే, ప్రత్యేక అంశంలో పరిశోధనాత్మక విద్య పూర్తి చేయాలంటే ముందుగా దానికి అనుమతి, అర్హత కావాలి. దాన్నే పిహెచ్‌డి ప్రవేశ పరీక్షగా చెప్పుకోవాలి. ఇటీవలే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు పిహెచ్‌డి ప్రవేశానికి ఒక ప్రత్యేక అర్హత పరీక్షను ప్రవేశపెట్టారు. దీనిని అన్ని విశ్వ విద్యాలయాల వారు నిర్వహిస్తారు. పి.హెచ్‌డి చేయడానికి ఈ అర్హత పరీక్ష ద్వారా ప్రవేశం పొందడంతో పాటు అమలులో ఉన్న ఇతర అర్హతలు.
1. యుజిసి వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించే జూనియర్ రీసెర్చ్ ఫెలోనేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్.
2. సీఎస్‌ఐఆర్ పరీక్ష (ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్ష. ఈ పరీక్ష ద్వారా అర్హత పొందిన అభ్యర్థికి పిహెచ్‌డిలో ప్రవేశానికి ప్రాధాన్యత లభింంచడంతో పాటు నెలకు 18 వేల రూపాయల ఫెలోషిప్ కూడా లభిస్తుంది.)
3. ఎం.ఫిల్ పరీక్ష 4. పి.హెచ్‌డి ప్రవేశ పరీక్ష.
పైన ప్రస్తావించినవన్నీ పిహెచ్. డి చేయడానికి అవసరమైన ప్రాథ మిక అర్హతలు మాత్రమే. కేవలం దీని ద్వారానే పి.హెచ్‌డిలో ప్రవేశం లభిస్తుందనుకుంటే పొరపాటే. అర్హత పొందిన తర్వాత ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదా హరణకు ఉస్మానియా యూనివర్సి టీ పద్ధతిని పరిశీలిస్తే అక్కడ పిహెచ్‌డి ప్రవేశ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ కమిటీకి డీన్, హెడ్, బిఓఎస్ ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. అర్హత సంపాదించిన అభ్యర్థులందరూ కమిటీ ఇంటర్వ్యూకి హాజరుకావలసి ఉంటుంది. ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ ఆధారంగా అందుబాటు లోని ఖాళీలను బట్టి అభ్యర్థులకు ప్రవేశం కల్పించడం జరుగుతుంది.

ఈ ప్రవేశ ప్రక్రియ మొత్తానికి కలిపి 100 మార్కులు ఉంటాయి. 
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఫస్ట్‌క్లాస్) 25 మార్కులు
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (డిస్టింక్షన్) 30 మార్కులు
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (గోల్డ్ మెడలిస్ట్) 40 మార్కులు
బోధనా అనుభవం 10 మార్కులు
పరిశోధనా పత్రాలు 10 మార్కులు
(ఒక్కో పేపర్‌కి ఐదు మార్కులు)
సెమినార్ ప్రజంటేషన్స్ 10 మార్కులు
రీసెర్చ్ డిజైన్, ఇంటర్వ్యూ 30 మార్కులు

ప్రస్తుతం పిహెచ్‌డికి విపరీతంగా పోటీ పెరిగిపోయింది. రీసెర్చ్ సూపర్‌వైజర్ దగ్గర ఉన్న ఖాళీల ప్రకారమే సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. ఒక్కో రీసెర్చ్ సూపర్‌వైజర్ ఒక్కసారి 6గురు అభ్యర్థులకు మాత్రమే ‘గైడ్’గా ఉండగలరు. ఒక విభాగంలో ఉన్న సూపర్‌వైజర్‌ల సంఖ్యను 6 సంఖ్యతో గుణిస్తే వచ్చే సంఖ్యే అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యగా గుర్తిస్తారు. ఉదాహరణకి ఒక విభాగంలో ఆరుగురు సూపర్‌వైజర్‌లుంటే ఒక్కొక్కరికీ ఆరుగురు అభ్యర్థుల చొప్పున మొత్తం 36 ఖాళీలుంటాయన్న మాట. ఒక వేళ అప్పటికే అక్కడ 30 మంది పిహెచ్‌డి పరిశోధన చేస్తుంటే కేవలం 6 సీట్లు ఉన్నట్లు భావించాలి. దీన్ని బట్టి పిహెచ్‌డి సీటు సంపాదించడం అంత తేలిక కాదనే విషయం అభ్యర్థులు గ్రహించి పోటీలో ముందుగా నిలవాలంటే రీసెర్చ్ డిజైన్‌పై ఎంతో కృషి చేయవలసి ఉంటుంది.

పిహెచ్‌డి. విజయసూత్రాలు 
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనేది పేరుకి తగ్గట్టుగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఉన్నత విలువలు కలిగిన ఎంతో పవ్రితమైన పరిశోధనాత్మక విద్యగా ప్రతి విద్యార్థి భావించాలి. ఈ విద్యను ఎంతో అంకిత భావంతో అభ్యసించవలసి ఉంటుంది. పిహెచ్‌డి నిర్దిష్ట సమయంలో విజయవంతంగా పూర్తి చేయడమనేది ప్రధా న లక్ష్యంగా ఉండాలి. పిహెచ్.డి అనేది కేవలం ఒక విద్య మాత్రమే కాదు మానవ జీవిత విలువలను, స్థాయిని పెంచే మహోన్నత పరిశోధనా కార్యక్రమం. పిహెచ్.డిని ఆ విధంగా భావించి చేసినప్పుడే ఆ ఉన్నత విద్యకి, విద్యార్థికి సార్థకత చేకూరుతుంది.

ప్రవేశ అర్హతకు సూచనలు 
అభ్యర్థి యం.ఫిల్. చేయకుండా నేరుగా పిహెచ్‌డి ప్రవేశానికి ప్రయత్నిస్తున్నట్లుయితే వారికి రీసెర్చ్ డిజైన్ రూపకల్పన ఎంతో కీలకమైనదని గ్రహించాలి. ఎందుకంటే అభ్యర్థి రీసెర్చ్ డిజైన్ రూపకల్పన ఇంటర్వ్యూలో మంచి మార్కులు సంపాదించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. మంచి రీసెర్చ్ డిజైన్ తయారీకి అభ్యర్థులు క్రింది అంశాలు దృష్టిలో ఉంచు కోవాలి.

1. రీసెర్చ్ అంశాన్ని ప్రొఫెసర్లతో, నిపుణులతో చర్చించి ఎంపిక చేసుకోండి.
2. గతంలో అభ్యర్థులు రూపొందించిన థీసిస్‌లను ఒక సారి పరిశీలించండి.
3. రీసెర్చ్ డిజైన్‌ను ఒక పద్ధతి ప్రకారం రూపొందించండి.
4. ముందుగా ‘టాపిక్ ఇంట్రడక్షన్’ రాయండి.
5. ఎంచుకున్న అంశం లేదా విషయం యొక్క లక్షణాలు, ఆ విషయం ఉద్దేశించి మీరు ఏరకమైన స్టేట్‌మెంట్‌తో పరిశోధన చేయబోతున్నారనేది ప్రస్తావించండి.
6. పరిశోధనా ఉద్దేశాలను తెలియజేయండి.
7. డాటా, సమాచార సేకరణ పద్ధతులు, వాటిని ఎలా, ఎక్కడ నుంచి సంపాదిస్తారు. వాటి సోర్స్ ఏమిటి, వాటిని ఏ విధంగా విశ్లేషిస్తారో చెప్పే విశ్లేషణా విధానాలు, పరిణామాలు, ఊహాత్మక ఫలితాలు, ఉదాహరణగా ఒక నమూనా డిజైన్ మొదలైనవి వివరంగా, శాస్త్రీయంగా తయారు చేయాలి.
8. పరిశోధనాంశాల వర్గీకరణ, తయారైన డిజైన్ స్క్రిప్ట్‌ని ఒక సారి సమీక్షించుకోవాలి. పైన ప్రస్తావించిన అంశాలు, రీసెర్చ్ డిజైన్ తయారీ ప్రక్రియ అన్ని సబ్జెక్టుల వారికి కూడా వర్తిస్తా

Thursday, 19 July 2012

గ్రూప్-2 ఎ.పి. హిస్టరీకరెంట్ ఎగ్జామ్స్ కవరేజిpart - II : unit-IIIఆంధ్రప్రదేశ్ సామాజిక, రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన బ్రిటిష్ వలస పాలన ముఖ్యంగా మచిలీపట్నంలో ఆంగ్లేయులు వర్తక స్థావరాన్ని (1611)ఏర్పాటు చేయడం మొదలు 1947 వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఈ యూనిట్లో పేర్కొనడం జరిగింది.
పరీక్ష కోణంలో ఈ యూనిట్ నుండి అత్యధిక ప్రశ్నలు రావటమే కాకుండా యూనిట్ 4 మరియు 5లను అర్థం చేసుకోవడానికి కూడా ఈ యూనిట్ సిలబస్ ఉపయోగ పడుతుంది. కాబట్టి అభ్యర్థులు 1857 తిరుగుబాటు ప్రభావం మొదలుకొని భారత జాతీయోధ్యమానికి సమాతరంగా ఆంధ్రలో జరిగిన సంఘటనలను చదవటం వల్ల పేపర్-1లోని భారతదేశ చరిత్రలో ‘భారత జాతీయోద్యమం’అంశానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు.
ముఖ్యంగా సామాజిక, సాంస్కృతిక జాగృతికి సంబంధించిన ఉద్యమాలు, వాటి నాయకులు, అదే విధంగా ఆయా ఉద్యమాల యొక్క ఫలితాలు వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి. కాబట్టి ఆ కోణంలో అభ్యర్థులు క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది.
జాతీయోద్యమంలో జరిగిన కీలకమైన ప్రతి సంఘటనలో పాల్గొన్న మొదటి, లేక ఏకైక ఆంధ్ర నాయకుని గూర్చిన ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నందున అభ్యర్థులు విశిష్ఠమైన అంశాలను ఎక్కువసార్లు రివిజన్ చేయాల్సి ఉంటుంది.
1.బ్రిటిష్ వర్తకులు ఆంధ్ర ప్రాంతంలో గోల్కొండ రాజుల అనుమతితో మచిలీపట్నంలో తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న సంవత్సరం? ( )1. క్రీ.శ.1611 2. క్రీ.శ.1612
3. క్రీ.శ.1632 4. క్రీ.శ.1614
2.క్రీ.శ. 1756లో ఫ్రెంచ్‌సేనాని బుస్సీని అధికారం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నిజాం నవాబు? ( )1. నాసర్ జంగ్ 2. ముజఫర్ జంగ్
3. సలాబత్ జంగ్ 4. నిజాం-ఉల్- ముల్క్
3.క్రీ.శ.1757లో బొబ్బిలి కోటపై యుద్ధానికి ఫ్రెంచ్ వారిని ప్రోత్సహించిన విజయనగర రాజు? ( )1. తిరుమలరాయలు
2. మొదటి శ్రీరంగదేవరాయలు
3. రెండో వెంకటరాయలు
4. విజయరామరాజు
4.రాయలసీమలో రైతులకు ఉపయుక్తమైన రైత్వారీ విధానాన్ని అమలు జరిపి ప్రశంసలందుకున్నది.? ( )1. థామస మన్రో 2. డూప్లే
3. కౌంట్ డీ లాలీ 4. బుస్సీ
5.రాజధానిని ఔరంగబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చిన నిజాం నవాబు? ( )1. సలాబత్ జంగ్ 2. నిజాం ఆలీఖాన్
3. నాసర్ జంగ్ 4. ముజఫర్ జంగ్
6.1867లో నిజాం రాజాన్ని ‘జిలాబంది విధానాన్ని’ అనుసరించి 5 సుభాలుగా విభజించటం జరిగింది. అయితే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినది? ( )1. సాలార్ జంగ్ -1 2. సాలార్ జంగ్ -2
3. మహబూబ్ ఆలీఖాన్ 4. సలాబత్ జంగ్
7.హైదరాబాద్‌లో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించినది ? ( )1. నాసిరుద్దౌల 2. సాలార్ జంగ్-1
3. ముబారిజ్ ఉద్దౌల 4. కాశిం రజ్వీrachanalu8.1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును అణిచి వేయుట వల్ల బ్రిటిష వారి చేత ‘స్టార్ ఆఫ్ ఇండియా’గా పిలవబడ్డ నిజాం నవాబు? ( )1. సికిందర్ జా 2. నిజాం ఆలీఖాన్
3. నాసర్ జంగ్ 4. ఆప్జల్ ఉద్దౌల
9.భారతదేశంలో వెలస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన మొదటి పాలకుడు? ( )1. నిజాం ఆలీఖాన్ 2. సలాబత్ జంగ్
3. మహబూబ్ ఆలీఖాన్ 4. ఉస్మాన్ ఆలీఖాన్
10.ఆంగ్లేయుల పరిపాలనలో ప్రచురించబడిన తొలి ఆంధ్రపత్రిక? ( )1. దేశభిమాని 2. ఆంధ్రప్రకాశిక
3. సత్యదూత 4. కృష్ణపత్రిక
11.అత్యంత వివాదాస్పదమైన ఇల్బర్ట్ బిల్లు వివాదంపై బ్రిటిష్ వారు సంప్రదించిన ఏకైక తెలుగు వ్యక్తి? ( )1. కందుకూరి వీరేశలింగం 2. ఏనుగుల వీరాస్వామి
3. గిడుగు రామమూర్తి 4. రాజాగజపతిరావు
12.ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ‘‘వీర గంథము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ’’ అన్న సుప్రసిద్ధ గీతం రచించినది? ( )1. రాచకొండ విశ్వనాథశాస్త్రి
2. త్రిపురనేని రామస్వామి
3. పానుగంటి లక్ష్మీనరసింహారావు
4. రాజాగజపతిరావు
13.సుప్రసిద్ధ దండియాత్రలో పాల్గొన్న ఆంధ్రుడు? ( )1. ముట్నూరి కృష్ణారావు 2.కొక్కొండ వెంకటరత్నం
3. ఎర్నేని సుబ్రహ్మణ్యం 4. అడవి బాపిరాజు
14.ఆంధ్ర ప్రాంతంలో ‘‘హోంరూల్ లీగ్’’ కు కార్యదర్శిగా పని చేసినది? ( )1. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
2. గాడిచర్ల హరిసర్వోత్తమరావు
3. కొండా వెంకటప్పయ్య
4. అయ్యదేవర కాళేశ్వరరావు
15.ఆంధ్ర సోషలిస్టు కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు? ( )1. తెన్నేటి విశ్వనాథం
2. కోటగిరి వెంకటకృష్ణారావు
3. బ్రహ్మజ్యోస్యులు సుబ్రహ్మణ్యం
4. త్రిపురనేని రామస్వామి చౌదరి
16. అల్లూరి సీతారామరాజు మొగల్లులో జన్మించగా, సమాధిని నెలకొల్ప బడిన ప్రాంతం? ( )1. మొగల్లు
2. చింతపల్లి
3. కృష్ణదేవిపేట
4. రంపచోడవరం
17.పెదనందిపాడు ఉద్యమ నాయకుడైన పర్వతనేని వీరయ్య చౌదరికి గల బిరుదు? ( )1. దేశభక్త 2. ఆంధ్ర రత్న
3. ఆంధ్రబీష్మ 4. ఆంధ్ర శివాజీ
18.ఆంధ్రలో వందేమాతర ఉద్యమంలో భాగంగా బిపిన్ చంద్రపాల్ పర్యటనలో పాల్ ఉపన్యాసాలను తెలుగులో అనువదించినది?( )1. న్యాపతి సుబ్బారావు
2. ముట్నూరి కృష్ణారావు
3. పానుగంటి లక్ష్మీనరసింహరావు
4. కొమర్రాజు లక్షణరావుimppersons19.జపాను చరిత్రను తెలుగులోకి అనువదించినది? ( )1. ఆదిపూడి సోమనాధరావు 2. గుఱ్ఱం జాషువా
3. ఏటుకూరి నరసయ్య 4. శ్రీశ్రీ
20.ఆంధ్రలో వందేమాతర ఉద్యమ కాలంలో కోటప్పకొండ సంఘటనకు గాను మరణశిక్షకు గురైనది?( )1. రామచంద్రరావు
2. చిన్నపరెడ్డి
3. మల్లాది వెంకట సుబ్బారావు
4. కన్నెగంటి హనుమంతుడు
21.కందుకూరి వీరేశలింగం ‘హితకారిణి సమాజాన్ని’ స్థాపించిన సంవత్సరం? ( )1. 1919 2. 1909
3. 1908 4. 1901
22.హైదరాబాద్‌లో వెలువడిన మొదటి పత్రిక ‘గోల్కొండ పత్రిక’ కాగా, ఆ పత్రిక స్థాపకుడు ఎవరు? ( )1. దేవులపల్లి రామానుజారావు
2. ముట్నూరి కృష్ణారావు
3. గాజుల లక్ష్మీనరసుశెట్టి
4. సురవరం ప్రతాపరెడ్డి
23.ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచినది? ( )1. నిమ్న జాతుల చరిత్ర జాలా రంగస్వామి
2. నవజీవనం వుండ్రు సుబ్బారావు
3. జీవనజ్యోతి మళ్ల వెంకటరత్నం
4. వీరభారతి ఉన్నవ లక్ష్మీనారాయణ
1. 1 మరియు 2 2. 1,2 మరియు 3
3. 4 4. పైవన్నీ
24.ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్యను హైదరాబాద్‌లో స్థాపించినది? ( )1. కాశీనాథుని నాగేశ్వరరావు 2. భాగ్యరెడ్డివర్మ
3. జాలా రంగస్వామి 4. 1 మరియు 2patrika25.కేరళలో శ్రీనారాయణగురు స్థాపించిన ‘శ్రీనారాయణ ధర్మపరిపాలన యోగం’ అనే సంస్థ ఏ కులస్థుల సంస్కృతీ కరణకు ప్రముఖంగా తోడ్పడినది?( )1. తులు 2. నంబూద్రి
3. ఎజవా 4. నాయకర్లు
26.‘రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం’ ఎక్కడ స్థాపించబడినది? ( )1. హన్మకొండ 2. కర్నూలు
3. హైదరాబాద్ 4. గుంటూరు
27.‘విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి’ స్థాపనలో ప్రముఖంగా కృషి చేసినది? ( )1. రామచంద్ర పిళ్లై
2. కొమర్రాజు లక్ష్మణరావు
3. రావిచెట్టు రంగారావు
4. శ్రీనాయని వెంకటరంగారావు
28.1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది? ( )1. రావి నారాయణరెడ్డి
2. మాడపాటి హనుమంతరావు
3. స్వామి రామానంద తీర్థ
4. రామకృష్ణదూత్answers29.‘ఆత్మగౌరవ ఉద్యమం’ బలపడటానికి ‘పెరియార్’గా ప్రసిద్ధి చెందిన ‘రామస్వామి నాయకర్’ ప్రారంభించిన వార పత్రిక? 1. ద్రవిడ కజగం 2. నిమ్నజాతుల చరిత్ర
3. సోషలిస్ట్ 4. కుడి అరసు ( )
30.జస్టిస్ పార్టీ మొదటి సమావేశానికి ‘పి.రామరాయనింగార్’ అధ్యక్షత వహించగా, ఈ సమావేశం ఎక్కడ జరిగినది?( )1. మద్రాస్ 2. కోయంబత్తూర్
3. రాజమండ్రి 4. నెల్లూరు
ఈ యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో వచ్చిన ప్రశ్నలు
1.ఆంధ్రలో జరిగిన శాసనోల్లంఘనోద్యమంలో డిక్టేటర్‌గా నియమితుడైన నాయకుడు? గూప్-2, 2008)
1. కొండా వెంకటప్పయ్య ( 1 )
2. టంగుటూరి ప్రకాశం
3. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
4.ఎన్.జి.రంగా
2.నెల్లూరు జిల్లాలో జరిగిన జమిందారీ వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినది ఈ క్రింది వారిలో ఎవరు?
1. బెజవాడ గోపాలరెడ్డి ( 3 )
2. పొనకా కనకమ్మ
3. ఓరుగంటి వెంకటసుబ్బయ్య
4. వెన్నెలకంటి రాఘవయ్య నగూప్-2, 2008)
3.తెలుగు సాహిత్యంలో వీరేశలింగం రచించిన తొలి తెలుగు నవల? గూప్-2 2011)( 1 )1. రాజశేఖర చరిత్ర 2. లోకరంజని
3. సతీహిత బోధిని 4. రసికోల్లాసిని
4.భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వాడెవరు? నగూప్-2, 2011) ( 2 )1. పి.సీతారామయ్య 2. పి.ఆనందాచార్యులు
3. టిపకాశం 4. ఎన్.సంజీవరెడ్డి
5.ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలుత ఏర్పడినపుడు దాని కార్యస్థానం ఎక్కడ ఉండేది? నగూప్-2, 2008)1. విశాఖపట్నం 2. బెజవాడ ( 2 )
3. గుంటూరు 4. మద్రా

కరెంట్ అపైర్స్

Expected_Qఈజిప్ట్‌లో ఎన్నికైన తొలి అధ్యక్షుడు ఎవరు?1.కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు? ( )1. సంజయ్‌రెడ్డి 2. వినోద్‌పిళ్ళై3. జవహర్‌ఠాకుర్ 4. ఎవరూ కాదు2. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు సుధీంధ్రా అనే క్రికెటర్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. దీంతో ఈ శిక్షను ఎదుర్కొన్న మూడో క్రికెటర్ సుధీంధ్రా. జీవితకాల నిషేధానికి గురైన మిగతా ఇద్దరు క్రికెటర్లెవరు? ( )1. అజారుద్దీన్, అజయ్‌జడేజా2. అజారుద్దీన్, అజయ్‌శర్మ3. అజారుద్దీన్, మనోజ్ ప్రభాకర్4. ప్రవీణ్ ఆమ్రే, అజయ్ జడేజా3.మధ్యప్రదేశ్‌కు చెందిన సుధీంద్రా ఐపీఎల్‌లో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ( )1. డెక్కన్ ఛార్జర్స్ 2. చెన్నై సూపర్‌కింగ్స్3. పంజాబ్ కింగ్స్11 4. పూణె వారియర్స్4.ఐఎస్‌ఎసి విస్తరించుము? ( )1. ఇండియన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్2. ఇస్రో స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్3. ఇండియన్ శాటిలైట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్4. ఇస్రో శాటిలైట్ సెంటర్5.రాష్ర్టపతి ఎన్నికలకు సంబంధించి కింది అంశాలను జతపరుచుము? ( )అంశం గణాంకాలు1. ఎలక్టోరల్ కాలేజీలోనిఎంపీలు ఎ. 5,49,4742. ఎలక్టోరల్ కాలేజీలోనిఎమ్మేల్యేలు బి. 7763. ఎమ్మేల్యేల ఓటు విలువ సి. 5,49,4084. ఎంపీల ఓటు విలువ డి. 41201. 1బి, 2డి, 3ఎ, 4సి2. 1బి, 2డి, 3సి, 3ఎ3. 1బి, 2ఎ, 3డి, 4సి 4. పైవేవీ కావు6. ఈజిప్ట్‌లో ఎన్నికైన తొలి అధ్యక్షుడు ఎవరు? ( )
1. హోస్ని ముబారక్ 2. మహ్మద్ వెూరీ3. అబ్దుల్ రహ్మాన్ 4. పైవేవీకావు7.మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం రాసిన కొత్త పుస్తకం ‘టర్నింగ్ పాయింట్స్, ఏ జర్నీ త్రూ ఛాలెంజెస్’ ఇది ఏ పుస్తకానికి సీక్వెల్‌గా కలాం రాశారు? ( )1. వింగ్స్ ఆఫ్ ఫైర్ 2. ఇగ్నైటెడ్ మైండ్స్3. విజన్ 20-20 4. ఏదీకాదు
8.‘2జి’ స్పెక్ట్రంపైన వేసిన ‘ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’కు ఎవరు నాయకత్వం వహించనున్నారు?1. కపిల్‌సిబాల్ 2. ఎ.కె.ఆంటోనీ ( )3. శరద్‌పవార్ 4. జైపాల్‌రెడ్డి9.ప్రపంచపు అత్యుత్తమ అథ్లెట్‌ల జాబితాను ఇంగ్లాండ్‌కు చెందిన స్పోర్ట్ ప్రో విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన ‘మేరీకాం’ ఎన్నో స్థానంలో ఉన్నారు?( )1.37 2. 38 3.39 4. 4010.రాష్ర్ట చీఫ్ సెక్రటరీగా మిన్నీ మాథ్యూ నియామకం అయ్యారు. రాష్ర్టంలోని ఈ అత్యున్నత పదవిని అలంకరించిన రెండో మహిళ మిన్ని మాథ్యూ కాగా తొలి మహిళ ఎవరు? ( )1. సథినాయర్ 2. ఎం.ఎస్.లక్ష్మీ3. రేచల్ ఛటర్జీ 4. ఎవరూకాదు11. ‘యూరోజోన్’కు సంబంధించి కింది వానిలో సరైనవేవి? (ఇటీవల చర్యలకు సంబంధించి) ( )1. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు (యూరో) చేయూతనివ్వడానికి 500 బిలియన్ యూరోలతో యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజం ఏర్పాటుకు నిర్ణయం2. మార్కెట్లు స్థిరంగా ఉండేలా ఈ బెయిల్ ఔట్ ప్యాకేజీని సరళమైన పద్ధతిలో ఇస్తారు.3. స్పెయిన్, ఇటలీ దేశాలకు ఈ ప్యాకేజీ ఉద్దేశించినది.4. పైవన్నీ12. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరు?1. జోస్ ఇమ్మాన్యువల్ బారోసో ( )
2. హెర్మన్ వ్యాన్ రొంపు3. ఏంజెలా మెర్కెల్
4. పైఎవరూ కాదుexampoint13. బీసీసీఐ కొత్తగా ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక విభాగం చీఫ్ ఎవరు? ( )1. అరుణ్‌జైట్లీ 2. ఎన్‌యశీనివాసన్3. రవి సవాని 4. నిరంజన్‌షా14. ‘ఈయూ’ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దేశం ఏది?1. జర్మనీ 2. ఫ్రాన్స్ 3. బ్రిటన్ 4. సైప్రస్15.ఇటీవలే ముగిసిన ‘యూరోకప్‌కు సంబంధించి కింది వానిలో సరైనది? ( )1. జూన్ 8 నుంచి జూలై 1 వరకు నిర్వహించిన యూరో 2012లో స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది.2. 31 మ్యాచ్‌లతో కొనసాగిన ఈ టోర్నీ నిర్వహణలో ఉక్రెయిన్ భాగస్వామి.3. యూరోటోర్నీ ప్రారంభమైన తర్వాత వరుసగా రెండుసార్లు స్పెయిన్ విజేతగా ఆవిర్భవించి సంచలనం సృష్టించింది.4. పైవన్నీ 16.స్పెయిన్ ఇటీవల సాధించిన టోర్నీలేవి? ( )1. ప్రపంచకప్ - 2010 2. యూరోకప్-20083. యూరోకప్ - 20121. కేవలం 2,3 2. కేవలం 1,23. పైవన్నీ 4. కేవలం 1,3answersఎంత సులభం?ప్రశ్నః అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టిన మందు?జ. పెన్సిలిన్ (డిగ్రీ కాలేజి లెక్చరర్స్ ఎగ్జామ్- 9.6.2012)ఎంత కష్టం?ప్రశ్న ః భాలీ అనె కొండజాతి ప్రజలు ఉండే రాష్ట్రం ?జ. ఘాలయా(డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఎగ్జామ్ - 9.6. 2012)

Monday, 16 July 2012



తేదీలు - దినోత్సవములు


జనవరి
1: రహదారి భద్రతా దినోత్సవం
2: ప్రపంచ శాంతి దినోత్సవం
3: మహిళా టీచర్స్ డే
4: వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం
5: సైనిక దినోత్సవం
9: ప్రవాస భారతీయ దివస్
10: ప్రపంచ నవ్వుల దినోత్సవం
11: జాతీయ విద్యాదినోత్సవం
12: జాతీయ యువజన దినోత్సవం
స్వామీ వివేకానంద జయంతి
15: వరల్డ్ రిలిజియన్ దినోత్సవం, సైనిక దినోత్సవం
17: ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
21: మణిపూర్, మేఘాలయ,
త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
23: సుభాష్‌చంబ్రోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం
25: ఇండియా టూరిజం దినోత్సవం,
ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
26: భారత గణతంత్ర దినోత్సవం,
ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం
30: అమరవీరుల సంస్మరణ దినం, గాంధీజీ వర్థంతి, కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.
ఫిబ్రవరి
1: భారత తీర రక్షక దళ దినోత్సవం
2: వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం
4: వరల్డ్ క్యాన్సర్ డే, శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవం
11: ప్రపంచ వివాహ దినోత్సవం
12: జాతీయ ఉత్పాదనా దినోత్సవం,
గులాబీల దినోత్సవం.
14: ఇంటర్ నేషనల్ కండోమ్ డే, ప్రేమికుల దినోత్సవం
20: మిజోరామ్, అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినం
21: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
22: ప్రపంచ స్కౌట్ దినోత్సవం, కవలల దినోత్సవం
24: సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
25: జాతీయ సైన్స్ దినోత్సవం.
మార్చి
4: జాతీయ భద్రతా దినోత్సవం
5: అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం
ప్రపంచ బధిరుల దినం
8: అంతర్జాతీయ మహిళా దినం
9: వరల్డ్ కిడ్నీ డే
10: కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల డే
15: ప్రపంచ పౌర హక్కుల దినం
18: మానవ హక్కుల దినం
20: సాంఘిక సాధికారత స్మారక దినం
21: ప్రపంచ అటవీ దినం, ప్రపంచ అంగ వికలుర దినం, ప్రపంచ కవితా దినం
22: ప్రపంచ జల దినోత్సవం
23: ప్రపంచ వాతావరణ దినోత్సవం,
అమర వీరుల దినోత్సవం
24: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం
26: బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం
27: అంతర్జాతీయ నాటక దినోత్సవం
28: నేషనల్ షిప్పింగ్ దినోత్సవం
ఏప్రిల్
1: ఒరిస్సా రాష్ట్ర అవతరణ దినోత్సవం
2: పోలీస్ పతాక దినం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
5: నేషనల్ మారిటైమ్ డే
7: ప్రపంచ ఆరోగ్య దినం
8: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం
10: ప్రపంచ హోమియోపతి డే
12: ప్రపంచ రోదసీ దినోత్సవం
13: జలియన్ వాలాబాగ్ సంస్మరణ
దినోత్సవం
14: అగ్నిమాపక దినోత్సవం, అంబేద్కర్ జయంతి, మహిళా పొదుపు దినోత్సవం
15: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం
16: తెలుగు రంగస్థల దినోత్సవం
17: ప్రపంచ హిమోఫిలియా దినం
18: ప్రపంచ సాంస్కృతిక దినం
21: జాతీయ సమాచార హక్కుల దినం,
జాతీయ పబ్లిక్ రిలేషన్స్ దినం
22: ప్రపంచ ధరిత్రి దినోత్సవం
23: ప్రపంచ పుస్తకాల దినోత్సవం
25: ప్రపంచ మలేరియా దినం
26: సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం,
ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం
28: ప్రపంచ భద్రతా దినోత్సవం,
ప్రపంచ పశుచికిత్సా దినం
29: అంతర్జాతీయ నృత్య దినోత్సవం
30: బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.
మే
1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం
3: ప్రపంచ ఆస్తమా దినోత్సవం, ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినోత్సవం
4: బొగ్గు గని కార్మిక దినోత్సవం
5: వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం,
అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం
6: ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం
7: ఠాగూర్ జయంతి, నవ్వుల దినోత్సవం
8: ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
11: జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం
12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం,
అంతర్జాతీయ వలస పక్షుల దినం
13: మాతృ దినోత్సవం
15: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
17: ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
18: ఇంటర్నేషనల్ మ్యూజియమ్స్ డే
21: తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
22: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
24: కామనె్వల్త్ దినోత్సవం
27: నెహ్రూ వర్థంతి
29: వౌంట్ ఎవరెస్ట్ దినోత్సవం,
అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం
30: గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం
యు.ఎస్. స్ట్ఫా దినోత్సవం
31: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.
జూన్
1: అంతర్జాతీయ బాలల దినోత్సవం,
ప్రపంచ పాల దినోత్సవం
4: అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం
5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం
8: ప్రపంచ సముద్ర దినోత్సవం
12: ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం
14: పతాక దినోత్సవం
18: గోవా స్వాతంత్య్ర దినోత్సవం
20: తండ్రుల దినోత్సవం, మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ శరణార్థుల దినోత్సవం
21: ప్రపంచ సంగీత దినోత్సవం
23: ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం
25: ప్రపంచ అవయవ దాన, మార్పిడి దినోత్సవం
26: ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం
28: పేదల దినోత్సవం
29: గణాంక దినోత్సవం.
జూలై
1: వైద్యుల దినోత్సవం, వాస్తు దినోత్సవం, ప్రపంచ వ్యవసాయ దినోత్సవం, వన మహోత్సవ వారోత్సవాలు జూలై 1నుండి జూలై 7 వరకు.
2: ప్రపంచ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం
5: అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం
6: ప్రపంచ రేబిస్ దినోత్సవం
11: ప్రపంచ జనాభా దినోత్సవం
12: నాబార్డ్ స్థాపక దినోత్సవం
17: పాఠశాలల భద్రత దినోత్సవం,
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
26: కార్గిల్ విజయోత్సవ దినం
29: ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే
ఆగస్టు
1: తల్లిపాల దినోత్సవం
2: ఆంగ్లో ఇండియన్ దినోత్సవం
6: హిరోషిమా దినోత్సవం
8: క్విట్ ఇండియా దినోత్సవం
9: నాగసాకి దినోత్సవం
10: డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినం
12: లైబ్రేరియన్స్ డే
13: లెఫ్ట్‌హ్యాండర్స్ డే
15: స్వాతంత్య్ర దినోత్సవం,
పశ్చిమ బెంగాల్ దినోత్సవం
18: అంతర్జాతీయ స్వదేశీవాదుల దినం
19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినం
20: సద్భావన దినం (రాజీవ్ గాంధీ జయంతి)
మలేరియా నివారణ దినం
24: సంస్కృత దినోత్సవం
29: తెలుగు భాష దినోత్సవం, జాతీయక్రీడా దినోత్సవంసెప్టెంబర్
1: పోషక పదార్థాల వారోత్సవం
2: కొబ్బరికాయల దినోత్సవం
4: అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ
దినోత్సవం (ఆంధ్రప్రదేశ్)
5: ఉపాధ్యాయ దినం- రాధాకృష్ణన్
జన్మదినం
8: ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం
9: వరల్డ్ ఫస్ట్‌ఎయిడ్ డే
10: హర్యానా, పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం
14: హిందీ దినోత్సవం
15: ఇంజినీర్స్ దినోత్సవం, సంచాయక దినోత్సవం
16: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
17: మహిళల మైత్రీ దినోత్సవం
20: రైల్వే భద్రతాదళ వ్యవస్థాపక దినం
21: బయోస్ఫియర్ దినం,
అంతర్జాతీయ శాంతి, అహింస దినోత్సవం,
ప్రపంచ అల్జిమర్స్ దినోత్సవం
22: క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం, గులాబీల దినోత్సవం
24: ప్రపంచ హృదయ దినోత్సవం, ప్రపంచ నదుల దినోత్సవం, ఎన్.ఎస్.ఎస్. దినోత్సవం.
26: చెవిటి వారి దినోత్సవం
27: ప్రపంచ పర్యాటక దినోత్సవం
28: అంతర్జాతీయ సమాచార హక్కుల దినం, గన్నర్స్ డే, వరల్డ్ హార్ట్ డే,
ప్రపంచ నదుల దినోత్సవం.
సెప్టెంబర్ 4వ ఆదివారం- కూతుళ్ల దినోత్సవం.
అక్టోబర్
1: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, వన్యప్రాణి వారోత్సవాలు, జాతీయ తపాలా దినోత్సవం, స్వచ్ఛంద రక్తదాన దినం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం.
ప్రపంచ ఆవాస దినోత్సవం.
2: మానవ హక్కుల పరిరక్షణ దినం, గాంధీ జయంతి, గ్రామ్‌స్వరాజ్ డే,
ఖైదీల దినోత్సవం.
ప్రపంచ జంతువుల దినోత్సవం
4: ప్రపంచ జంతు సంక్షేమ దినం
5: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
6: వరల్డ్ స్మైల్ డే,
ప్రపంచ గృహవసతి దినం
8: భారత వాయుసేన దినోత్సవం
రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ
దినోత్సవం
9: ప్రపంచ పోస్ట్ఫాస్ దినోత్సవం,
న్యాయ సేవా దినం,
జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం.
10: ప్రపంచ మానసిక ఆరోగ్య దినం
12: ప్రపంచ దృష్టి దినోత్సవం
13: ప్రపంచ గుడ్డు దినోత్సవం
14: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
15: అంతర్జాతీయ అంధుల ఆసరా దినం,
గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే,
ప్రపంచ కవిత్వ దినం.
16: ప్రపంచ ఆహార దినం
17: అంతర్జాతీయ దారిద్ర నిర్మూలన
దినోత్సవం
21: పోలీస్ సంస్మరణ దినం
23: అంతర్జాతీయ పాఠశాల గ్రంథాలయ
దినోత్సవం
24: ఐక్యరాజ్యసమితి దినోత్సవం,
ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం, ఇండో-టిబెటియన్ సరిహద్దు దళాల
అవతరణ దినోత్సవం
27: పదాతిదళ దినోత్సవం, శిశుదినోత్సవం
28: అత్తవార్ల దినోత్సవం
30: ప్రపంచ పొదుపు దినోత్సవం
31: జాతీయ సమైక్యత దినోత్సవం,
జాతీయ పునరంకిత దినం,
ఇందిరాగాంధీ వర్ధంతి.
నవంబర్
1: ఆంధ్రప్రదేశ్, కర్నాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భవ దినోత్సవం.
గర్వాల్ రైఫిల్ దినం
7: ఎన్.టి.పి.సి. స్థాపన దినోత్సవం,
బాలల సంరక్షణ దినం
8: వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే
9: లీగల్ సర్వీసెస్ దినం,
ప్రపంచ నాణ్యతా దినోత్సవం
10: రవాణా దినం
11: వెటరన్స్ డే, జాతీయ విద్యా
దినోత్సవం
14: ప్రపంచ మధుమేహ దినోత్సవం,
ప్రపంచ బాలబాలికల దినోత్సవం,
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు,
జాతీయ పుస్తక వారోత్సవాలు, సహకార సంఘాల వారోత్సవాలు.
17: ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం.
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
19: ప్రపంచ సాంస్కృతిక,
వారసత్వ దినం, పౌరుల దినోత్సవం
20: యూనివర్సల్ చిల్డ్రన్స్ డే
21: ప్రపంచ మత్స్య పరిశ్రమ దినం, ప్రపంచ టెలివిజన్ దినం.
25: అంతర్జాతీయ స్ర్తిలపై జరిగే అకృత్యాల వ్యతిరేక దినం, జాతీయ జంతు సంక్షేమ దినం, ఎన్‌సిసి దినోత్సవం.
26: జాతీయ న్యాయ దినోత్సవం,
సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.
డిసెంబర్
1: ప్రపంచ ఎయిడ్స్ దినం,
నాగాలాండ్ దినోత్సవం,
సరిహద్దు భద్రత దళ ఏర్పాటు దినోత్సవం
2: ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా
దినోత్సవం
4: భారత నౌకాదళ దినోత్సవం
5: అంతర్జాతీయ వాలంటీర్స్ దినం
6: పౌర రక్షణ దినం
7: సైనికదళాల పతాక దినం,
అంతర్జాతీయ పౌర విమానయాన
దినోత్సవం
8: హోమ్‌గార్డ్స్ ఏర్పాటు దినోత్సవం
జలాంతర్గాముల దినోత్సవం
9: జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం
10: అంతర్జాతీయ మానవ హక్కుల దినం.
ప్రపంచ జంతువుల హక్కుల దినం
11: యునిసెఫ్ దినోత్సవం, అంతర్జాతీయ పర్వత దినోత్సవం
12: అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం
14: జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
15: ఇంటర్నేషనల్ టీ డే
17: పెన్షనర్స్ డే
18: అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం,
మైనారిటీ హక్కుల దినం (భరతదేశం)
19: గోవా విముక్తి దినోత్సవం.
22: ప్రపంచ గణిత దినం
23: కిసాన్ దినోత్సవం
24: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, సెంట్రల్ ఎక్సైజ్ డే
26: జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
31: వరల్డ్ స్పిరిట్యువల్ డే

Tuesday, 10 July 2012



మే 2 
¤ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ వారంరోజుల పర్యటన కోసం దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా చేరుకున్నారు.
    » ప్రిటోరియాలోని చారిత్రక యూనియన్ బిల్డింగ్ (అధ్యక్ష భవనం) వద్ద దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌జుమాతో ప్రతిభాపాటిల్ సమావేశమయ్యారు
 
 
    » విద్యుత్, ఐటీ, ఆరోగ్యం, టూరిజం, మౌలికాభివృద్ధి లాంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని భారత్, దక్షిణాఫ్రికా నిర్ణయించాయి
మే 3 
¤ దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ జైలుశిక్ష అనుభవించిన ఓల్డ్‌ఫోర్ట్ జైలులోనే రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
    » చారిత్రక ఓల్డ్‌ఫోర్ట్ జైలును ప్రస్తుతం దక్షిణాఫ్రికా దేశ అత్యున్నత న్యాయస్థానంగా మార్చారు
.
    » దక్షిణాఫ్రికా స్వాతంత్య్రానికి ముందు అణచివేత కేంద్రాలుగా నిలిచిన కారాగారాలు, ఇతర కేంద్రాలను మ్యూజియమ్‌లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చేస్తున్నారు. 
మే 6 
 ¤ మూడురోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ కోల్‌కతా చేరుకున్నారు (ఆమె బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చారు).  
¤ దక్షిణాఫ్రికాలో శాస్త్ర సాంకేతిక విద్యారంగం అభివృద్ధి, యువతలో నైపుణ్యాల పెంపు దిశగా తోడ్పడే ఒక ఐటీ కేంద్రానికి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ డర్బన్‌లో శంకుస్థాపన చేశారు.
    » 1904లో మహాత్మాగాంధీ స్థాపించిన 'ఫీనిక్స్ సెటిల్‌మెంట్' ఆశ్రమ ప్రాంతంలోనే 'మహాత్మాగాంధీ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు
మే 7 
¤ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ న్యూఢిల్లీలో రేస్‌కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలో మన్మోహన్‌తో సమావేశమయ్యారు (మూడు దేశాల ఆసియా పర్యటనలో భాగంగా ఆమె భారత్ చేరుకున్నారు).
    » భారత పర్యటనకు ముందు హిల్లరీ చైనా, బంగ్లాదేశ్‌లలో పర్యటించారు
.
    » హిల్లరీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కోల్‌కతాలో సమావేశమయ్యారు.
¤ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా 1893లో జాతి వివక్షతో మహాత్మాగాంధీని రైల్లోనుంచి తోసేసిన చరిత్రాత్మక ఘటనకు సాక్షిగా నిలిచిన పీటర్ మారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌ను రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సందర్శించారు
మే 8 
¤ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
    » పౌరసమాజం చేపట్టే వినూత్న ఆవిష్కరణలను గుర్తించి, పెట్టుబడి పెట్టడానికి అమెరికాతో సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టుకు 50 లక్షల డాలర్లు ఇస్తున్నట్లు భారత్ ప్రకటించింది. హిల్లరీ క్లింటన్‌తో సమావేశమైన కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహరాల శాఖ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
¤ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చివరి విదేశీ పర్యటన ముగిసింది. తొమ్మిది రోజుల సీషెల్స్, దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం ఆమె ఢిల్లీ చేరుకున్నారు.
మే 27
¤ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మూడురోజుల పర్యటన నిమిత్తం మయన్మార్ చేరుకున్నారు
.
    » గడిచిన 25 ఏళ్లలో మయన్మార్ పర్యటనకు వెళ్లిన తొలి ప్రధాని మన్మోహన్ కావడం విశేషం
.
మే 28
¤ మయన్మార్ పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ద్వైపాక్షిక సహకారంపై ఆ దేశాధ్యక్షుడు థెయిన్ సెయిన్‌తో చర్చలు జరిపారు.
    » వాణిజ్యం, ఇంధనం తదితర 12 రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈమేరకు మనదేశం మయన్మార్‌కు 50 కోట్ల డాలర్ల రుణ సాయం అందించనుంది
 
 
మే 29 
¤ మయన్మార్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ దేశ ప్రజాస్వామ్య యోధురాలు ఆంగ్‌సాన్ సూకీని యాంగాన్‌లో కలుసుకున్నారు.
మే 31
 ¤ భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీపావెల్ రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిలతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు 
    » భారత్‌లోని బ్రిటన్ హైకమిషనర్ బేవాన్, ఇండోనేషియా రాయబారి అండీగాలిబ్ కూడా సీఎం, గవర్నర్‌లతో సమావేశమయ్యారు.


మే 1 
¤ 2012లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ రేటు పెరిగి 202 మిలియన్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) విడుదల చేసిన 'ప్రపంచ పని నివేదికలో పేర్కొంది
మే 3 
¤ గ్రామీణ, పట్టణ ప్రజల తలసరి ఆదాయం, ఖర్చులపై జులై 2009 - జూన్ 2010 మధ్య జాతీయ శాంపిల్ సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ) నిర్వహించిన సర్వేను విడుదల చేశారు
.
సర్వేలోని ముఖ్యాంశాలు
:
     » దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సరాసరి నెల ఖర్చు రూ.1054 (రోజుకు రూ.35). పట్టణ, నగర ప్రాంతాల్లో అది రూ.1984 (రోజుకు రూ
.66).
     » గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత దిగువస్థాయిలోని 10శాతం మంది నిరుపేదలు రోజుకి రూ.15 (నెలకు రూ.453) ఖర్చు చేస్తుంటే, పట్టణ పేదలు రోజుకి రూ.20 (నెలకు రూ.599) తో బతుకు వెళ్లదీస్తున్నారు
.
     » గ్రామీణ ప్రాంతాల్లో నెలకు తలసరి వినియోగ ఖర్చు (ఎంపీసీఈ)లో బీహార్, చత్తీస్‌గఢ్ రూ.780తో వెనుకబడి ఉన్నాయి. వాటికంట్ కాస్త మెరుగైన స్థానంలో ఒడిశా, జార్ఖండ్ ఉన్నాయి.(రూ.820).
     » గ్రామీణ ఎంపీసీఈలో కేరళలో అత్యధికంగా నెలకు రూ.1835, పంజాబ్‌లో రూ.1649, హర్యానాలో రూ.1510 ఖర్చు చేస్తున్నారు
.
     » పట్టణ ఎంపీసీఈలో రూ. 2437తో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో కేరళ (రూ. 2413), హర్యానా (రూ. 2321) ఉన్నాయి. రూ. 1238 ఖర్చుతో బీహార్ అట్టడుగున ఉంది.
     » ఆహారంపై గ్రామీణ ప్రాంతాల్లో 57 శాతం, పట్టణాల్లో 44 శాతం ఖర్చు చేస్తున్నారు
.
     » గ్రామాల్లో తృణధాన్యాల వినియోగం నెలకు 11.3 కేజీలు ఉంటే, నగరాల్లో అది 9.4 కేజీలుగా ఉంది
.
     » ఎన్ఎస్ఎస్ఓ అంచనాల ఆధారంగానే ప్రణాళికా సంఘం 2009-10లో దారిద్య్రరేఖను నిర్ధారించింది. పట్టణ ప్రాంతాల్లో అది రూ. 28.65 వద్ద, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 22.42 వద్ద ఉన్నట్లు పేర్కొంది
.
     » ప్రణాళికా సంఘం అంచనాల ప్రకారం 2009-10లో 35.46 కోట్లమంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. 2004-05లో ఈ సంఖ్య 40.72 కోట్లు. 
మే 8 
¤ 'అంతర్జాతీయ వయసు, పెద్దల ఆరోగ్యంపై అధ్యయనం' పేరిట అమెరికా గణాంక విభాగం నిర్వహించిన సర్వే ప్రకారం 2050 నాటికి భారతదేశ మొత్తం జనాభాలో మూడోవంతు మంది 50 ఏళ్లకు పైబడినవారు ఉంటారు.
     » 2010 భారత జనాభా లెక్కల ప్రకారం దేశంలో 50 ఏళ్ల వయసువారు 19.18 కోట్లమంది ఉన్నారు. మొత్తం జనాభాలో ఇది 16.4 శాతం.
     » 2020 నాటికి ఇది 20 శాతానికి (26.49 కోట్లు), 2050 నాటికి 32.6 శాతానికి (54.04 కోట్లు) చేరుతుంది. 
మే 16
¤ 1990-2010 మధ్య మాతృ మరణాల ధోరణిపై ఐరాస జనాభా నిధి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస బాలల నిధి, ప్రపంచ బ్యాంకు కలిసి ఒక నివేదికను విడుదల చేశాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు:
     » ప్రపంచవ్యాప్తంగా 2010లో 2,87,000 మంది గర్భిణులు మరణించారు. 1990తో పోలిస్తే ఇది 47% తక్కువ.
     » 2010లో భారత్‌లో 56,000 (19%), నైజీరియాలో 40,000 (14%) మాతృ మరణాలు చోటుచేసుకున్నాయి.
     » కాంగో (15 వేలు), పాకిస్థాన్ (12 వేలు), సూడాన్ (10 వేలు), ఇండోనేషియా (9 వేలు), టాంజానియా (8,500), బంగ్లాదేశ్ (7,200), అఫ్గనిస్థాన్ (6,400) మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
     » మొత్తం 180 దేశాల్లో సర్వే నిర్వహించారు. మాతృ మరణాల సూచి 154 దేశాల్లో తగ్గితే 26 దేశాల్లో పెరిగింది.
     » మాతృ మరణాల సూచిలో తగ్గుదల సాధించిన తొలి అయిదు దేశాలు ఇస్తోనియా (95%), మాల్దీవులు (93%), రుమేనియా (84%), భూటాన్ (82%), ఈక్వటోరియల్ గినియా (81%).
     » ఈ దేశాలు 2015 లక్షిత సంవత్సరం కంటే చాలా ముందుగానే తగ్గుదలను సాధించడం విశేషం. 
మే 21
¤ టి.ఆర్. బాలు నేతృత్వంలో 31 మంది సభ్యులతో రైల్వేలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది.
     » రైల్వేస్టేషన్లు, రైళ్లలో సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడంపై స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
మే 25
¤ నీల్సన్ - ఇండియా టుడే సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని యూనివర్సిటీల్లో 2012 సంవత్సరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 6వ స్థానం లభించింది.
     » దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీల్లో ఓయూకి ప్రథమ స్థానం దక్కడం విశేషం
.
     » గత ఏడాది 6వ స్థానంలో ఉన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఈ ఏడాది 9వ స్థానం దక్కింది.


మే 23  
¤ విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల అంశంపై అధ్యయనం జరిపిన జె.సి. కలా కమిటీ తన నివేదికను కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించింది.
    » ఈ కమిటీ తవ్వకాలకు సానుకూలంగా పలు సిఫార్సులు చేసింది. దీంతో పాటు ప్రభావిత ప్రాంతాల ప్రజల అభిప్రాయాలకు పెద్దపీట వేయాలని, మరోసారి గిరిజన సలహా మండలి తీర్మానం తీసుకోవాలని సూచించింది
.
    » బాక్సైట్ తవ్వకాల వల్ల ప్రజలు నేరుగా ఎక్కడా నిర్వాసితులయ్యే ప్రసక్తి లేదని నివేదికలో పేర్కొన్నారు
.
    » తవ్వకాలు జరిగే ప్రాంతం రాతినేలలు కావడం, ఇతర ప్రతికూల కారణాల వల్ల అక్కడ పచ్చదనం లేదని; చెప్పుకోదగిన పర్యావరణ సున్నిత ప్రాంతాలూ లేవని నివేదికలో తెలిపారు
.
    » తవ్వకాల వల్ల ఆదిమ జాతులకు ఎలాంటి ముప్పులేదని, చారిత్రక, సాంస్కృతిక కట్టడాలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు
.
మే 25  
¤ బొగ్గు, సహజ వాయువు, భూమి లాంటి సహజ వనరుల కేటాయింపు, ధరల నిర్ణయంలో పారదర్శకత కోసం అశోక్‌చావ్లా కమిటీ చేసిన 69 సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది
.
    » చావ్లా కమిటీ గతేడాది మేలో తన నివేదికను సమర్పించింది. మొత్తం 81 సిఫార్సులు చేయగా 69 సిఫార్సులకు ప్రభుత్వ ఆమోదం లభించింది

ఏప్రిల్ 4
¤ మల్టీనేషనల్ డిజైన్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ (ఎండీఈపీ) సంస్థలో నూతన సభ్యురాలిగా భారత్ చేరింది. ఈ సంస్థను అమెరికా, ఫ్రాన్స్ ప్రారంభించాయి. ఇందులో ఈ రెండు దేశాలతోపాటు కెనడా, చైనా, ఫిన్లాండ్, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రిటన్ దేశాలకు సభ్యత్వం ఉంది.
   » నూతన అణుశక్తి నమూనాకు సంబంధించి ఈ దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి.
ఏప్రిల్ 6
¤ ప్రపంచంలో మొదటిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితోనే పారా మిలటరీ పైప్ బ్యాండ్ (సంగీత బృందం)ను ఏర్పాటుచేసిన ఘనతను కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) దక్కించుకుంది.
   » దేశంలోని మూడు మహిళా సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ల నుంచి ఎంపిక చేసిన 22 మందితో ఈ సంగీత బృందం ఏర్పాటైంది.
   » 1986లో మహిళా సీఆర్‌పీఎఫ్ తొలి బెటాలియన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు దళాలు పనిచేస్తున్నాయి.
   » అన్ని కేంద్ర దళాలు, రాష్ట్రాల పోలీసు శాఖలకు ఉన్నట్లే సీఆర్‌పీఎఫ్‌కు కూడా పురుషుల బ్యాండ్ ఉంది.
   » సీఆర్‌పీఎఫ్ డీఐజీ - నీతూ భట్టాచార్య (మహిళా విభాగం)
   » సీఆర్‌పీఎఫ్ డీఐజీ - విజయ్‌కుమార్
ఏప్రిల్ 7
¤ 2010లో భారతదేశాన్ని సందర్శించిన పర్యటకుల వివరాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ముఖ్యాంశాలు:    » 2010లో ఆంధ్రప్రదేశ్ 15.57 కోట్ల మంది పర్యటకులను ఆకర్షించింది. దేశం మొత్తం మీద దేశీయ పర్యటకుల వాటాలో 21 శాతాన్ని కైవసం చేసుకుంది.
   » ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసిన మొత్తం పర్యటకుల సంఖ్య 15.58 కోట్లు. ఇందులో 99 శాతం (15.57 కోట్లు) దేశీయ పర్యటకులే. వీరిలో అధికులు సందర్శించిన ప్రాంతం తిరుపతి.
   » తర్వాతి స్థానాలు హైదరాబాద్, విశాఖపట్నం.
   » మన రాష్ట్రాన్ని సందర్శించిన విదేశీ పర్యటకుల సంఖ్య 3,22,825.
   » 2009తో పోలిస్తే 2010లో మన రాష్ట్రాన్ని సందర్శించిన దేశీయ పర్యటకుల సంఖ్య 1.1% తగ్గింది. విదేశీ పర్యటకుల సంఖ్య 59.4 శాతం తగ్గింది.
   » దేశీయ సందర్శకుల సంఖ్యలో మన తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (14.6 కోట్లు), తమిళనాడు (11.44 కోట్లు), మహారాష్ట్ర (4.84 కోట్లు), కర్ణాటక (3.80 కోట్లు) ఉన్నాయి. ఈ అయిదు రాష్ట్రాల వాటా 67.4%; మన రాష్ట్ర వాటా 21%.
   » విదేశీ పర్యటకులను ఎక్కువగా ఆకర్షించింది మాత్రం మహారాష్ట్ర (50 లక్షలు). తర్వాత తమిళనాడు (28 లక్షలు), ఢిల్లీ (18 లక్షలు), ఉత్తరప్రదేశ్ (16 లక్షలు), బీహార్ (6 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (3.22 లక్షలు).
   » మొత్తం మీద భారత్‌లో దేశీయ పర్యటకుల సంఖ్య 74.02 కోట్లు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వృద్ధి 10.7 శాతం.
   » భారత్‌కు విచ్చేసిన విదేశీ పర్యటకుల సంఖ్య 1.78 కోట్లు. కిందటి ఏడాదితో పోలిస్తే వృద్ధి 24.2%.
   » విదేశీ పర్యటకుల రాకలో ప్రపంచంలో భారత్ వాటా 0.61%. ప్రపంచ పర్యటకంలో భారత్ స్థానం 40.
   » పర్యటకం కోసం 2011-12లో కేటాయించిన నిధులు రూ. 1100 కోట్లు.
   » 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12)లో కేటాయించిన నిధులు రూ. 5156 కోట్లు.
   » ఆంధ్రప్రదేశ్‌కు 2011-12లో కేటాయించిన నిధులు రూ. 20.38 కోట్లు. 2010-11లో
రూ. 37.29 కోట్లు, 2009-10లో రూ. 109.89 కోట్లు కేటాయించారు.
ఏప్రిల్ 10
¤ దేశంలోనే తొలిసారి భారతీ ఎయిర్‌టెల్ సంస్థ కోల్‌కతాలో నాలుగోతరం (4జీ) సేవలను ప్రారంభించింది.
    » భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ సంజయ్ కపూర్.
 
 ¤ భారత మొదటి జల వారోత్సవాలను ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు.  
ఏప్రిల్ 12
¤ ప్రైవేటు పాఠశాలలు పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా ఇచ్చి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా హక్కు చట్టానికి రాజ్యంగ గుర్తింపును సమర్థిస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే మైనార్టీ విద్యాసంస్థలకు దీన్నుంచి మినహాయింపు ఇచ్చింది.
¤ మతంతో సంబంధం లేకుండా వివాహ నమోదును (రిజిస్ట్రేషన్) తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనన మరణాల చట్టం, 1969లో సవరణ కోసం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది.
    » బాల్య వివాహాలను అరికట్టడానికి వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు, 18వ లా కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
    » సిక్కుల వివాహాలను హిందూ వివాహ చట్టం కింద కాకుండా 'ఆనంద్ వివాహ చట్టం, 1909' కింద ప్రత్యేకంగా నమోదు చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను కూడా కేంద్రం ఆమోదించింది. దీనికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం సిక్కులు, జైనులు, బౌద్ధుల వివాహాలను హిందూ వివాహ చట్టం కిందే నమోదు చేస్తుండటంతో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
¤ 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఏఐసీటీఈ రెండు సరికొత్త మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందులో ఒకటి అయిదేళ్ల మేనేజ్‌మెంట్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కాగా, ఇంకోటి బీటెక్, బీఆర్క్, బీఫార్మా డిగ్రీలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం. 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరూ ఈ రెండు కోర్సులకు అర్హులే.
¤ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ) ఉత్తరప్రదేశ్‌లో రూ. 10,000 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయతలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.
    » ప్రతిపాదిత వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలును సుసాధ్యం చేసేందుకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్ ఎస్‌పీవీ (జీఎస్‌టీఎన్ ఎస్‌పీవీ)గా వ్యవహరించనున్నారు. ఇది కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐటీ సంబంధ మౌలిక సదుపాయాలను, సేవలను సమకూరుస్తుంది. దీన్ని రూ. 10కోట్ల మూల ధనంతో ఏర్పాటు చేస్తారు.
ఏప్రిల్ 13
¤ ఎంపీ ల్యాడ్స్ పథకం నుంచి వివిధ క్రీడా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడానికిప్రభుత్వం ఎంపీలకు అనుమతించింది.
   » పంచాయత్ యువ క్రీడా ఖేల్ అభియాన్ (పీవైకేకేఏ), అర్బన్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీం(యూఎస్ఐఎస్పథకాలను ఎంపీ ల్యాడ్స్‌తో కలిపేందుకు  నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ 19
¤  రైల్వే ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ. 3 నుంచి రూ. 5 కు పెంచాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
   » పెంచిన ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి.
¤ అసోం శాసన సభ 75వ వార్షికోత్సవ సమావేశాన్ని గౌహతిలో నిర్వహించారు.
   » ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఏప్రిల్ 22
¤ ప్రపంచంలో భారీ టెలీస్కోప్ నిర్మాణ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరాలని భారత్ నిర్ణయించింది.ఇందుకోసం రూ. 700 కోట్లను అణుశక్తి శాఖ మంజూరు చేసింది   » అమెరికాలో నిర్మిస్తున్న  టెలీస్కోప్ ద్వారా స్పష్టమైన చిత్రాలుడేటాను పొందవచ్చు   » అమెరికాకెనడాజపాన్చైనాలకు  ప్రాజెక్టులో సభ్యత్వం ఉందిదీని నిర్మాణం 2019లోపూర్తవుతుందని భావిస్తున్నారు   » ప్రపంచంలో అతిపెద్దదైన హబుల్ టెలీస్కోప్ కంటే ఇది 10 రెట్లు ఎక్కువ శక్తిమంతమైంది
ఏప్రిల్ 24
¤ గిరిజన ప్రాంతాల్లోని కేంద్రీయ విద్యాసంస్థల్లో రాష్ట్రాల కోటా కింద ఎస్సీఎస్టీఓబీసీలకు రిజర్వేషన్కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.
¤ 
రాజ్యసభ సభ్యులుగా 50 మంది ప్రమాణ స్వీకారం చేశారువీరిలో అరుణ్‌జైట్లీమాయావతి,విలాస్‌రావ్ దేశ్‌ముఖ్రాజీవ్ శుక్లాచిరంజీవిజయా బచ్చన్ మొదలైనవారు ఉన్నారు   » భాజపా నేత అరుణ్ జైట్లీని రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.
ఏప్రిల్ 25
¤ పార్లమెంటు భద్రత కోసం 1500 మంది బలగాలతో ప్రత్యేక దళం ఏర్పాటుకు ప్రభుత్వంఆమోదించింది   » ప్రత్యేక శిక్షణ పొందిన సీఆర్‌పీఎఫ్ బలగాలతో 'పార్లమెంటు డ్యూటీ గ్రూప్పేరిట  దళంపార్లమెంటు ప్రాంగణంలో విధులు నిర్వహిస్తుంది
ఏప్రిల్ 26
¤ ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్)పై వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం నుంచి 8.6శాతానికి పెంచుతున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది
ఏప్రిల్ 28
¤ 2011లో దేశ వ్యాప్తంగా పాముకాటు వల్ల 1440 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖప్రకటించింది   » అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 380 మంది పాము కాటు వల్ల చనిపోయారురెండోస్థానంలోఒడిశా (మృతులు సంఖ్య 296), మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ (258 మంది మృతులునిలిచాయి   » రేబిస్ వల్ల గతేడాది దేశ వ్యాప్తంగా 223 మంది చనిపోయారుఅత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 73మంది మరణించారుతర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (45 మంది), ఒడిశా (24 మంది), తమిళనాడు (21మందికర్ణాటక (18 మందినిలిచాయి.

మే 3 
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2012-13) సంబంధించి ద్రవ్య వినిమయ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీని ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ.54 లక్షల కోట్లు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు చిక్కుతుంది.
     » ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. 

¤ రసాయన ఆయుధాల బిల్లుకు సవరణలు చేపట్టడానికి ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది
.
మే 5
 ¤ కేంద్ర జలవనరుల మంత్రి పవన్కుమార్ బన్సల్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర ముఖ్యమంత్రులుఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిపృథ్వీరాజ్ చవాన్ప్రాణహిత నీటి వినియోగ పర్యవేక్షణకుఅంతరాష్ట్ర మండలి ఏర్పాటుకుసంతకాలు చేశారు 
మే 7
¤ ఏడాది పాటు దేశ, విదేశాల్లో సాగిన రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది.
     » ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఠాగూర్ అంతర్జాతీయ పురస్కారాన్ని తొలిసారిగా సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు ప్రకటించారు. ఈ అవార్డు విలువ రూ. కోటి.  
     » ఈ సందర్భంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం రూ. 150 కోట్ల గ్రాంటు ప్రకటించింది.
¤ విదేశీ మదుపుదారులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ జనరల్ యంటీ - అవాయిడెన్స్ రూల్స్ (జీఏఏఆర్ - 'గార్') అమలును ఏడాదిపాటు వాయిదా వేశారు.
     » పన్ను ఎగవేతను అరికట్టే లక్ష్యంతో 2012-13 బడ్జెట్‌లో గార్‌ను ప్రతిపాదించారు.
     » గార్ నిబంధనావళి 2013-14 ఆర్థిక సంవత్సరం, ఆపై సంవత్సరాల నుంచి అమలవుతుందని ఆర్థికమంత్రి ప్రకటించారు.
మే 8
¤ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రెండోదశ అమల్లోకి వచ్చింది.
     » దేశంలోని వేర్వేరు ప్రాంతాల క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడానికి రెండోదశ ఉపాధి హామీ పథకాన్ని (ఎంఎన్ఆర్ఈజీఏ 2.0) రూపొందించారు.
     » ఇకపై ఎంఎన్ఆర్ఈజీఏ పనులను నీటి యాజమాన్యం, సాగునీరు, వరద నియంత్రణ, వ్యవసాయం, పశువుల పెంపకం, చేపలు పట్టడం, తీరప్రాంతాల పనులు, గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్యం తదితర విభాగాలకు విస్తరించనున్నారు. ఏయే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలనేది గ్రామసభల్లో ఆయా గ్రామ పంచాయతీలు నిర్ణయిస్తాయి.
మే 9
¤ అన్ని పాఠశాలల్లోనూ వికలాంగ బాలలకు ఉచిత నిర్బంధ విద్య అందించేందుకు ఉద్దేశించిన బిల్లు (విద్యా హక్కు సవరణ బిల్లు)ను లోక్‌సభ ఆమోదించింది.
     » రాజ్యసభ ఈ బిల్లును ఏప్రిల్ 24నే ఆమోదించింది.
మే 10
¤ సూక్ష్మ రుణసంస్థల పరిశ్రమ నియంత్రణకు సంబంధించిన 'సూక్ష్మ రుణ రంగ అభివృద్ధి, నియంత్రణ బిల్లు- 2011'ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
     » ఇకపై ఈ రుణసంస్థలు రిజర్వు బ్యాంక్ నియంత్రణలో పనిచేస్తాయి.
     » ఈ బిల్లు ప్రకారం రుణసంస్థలు రిజర్వు బ్యాంక్ వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. సొంత నికర నిధులు కనీసం రూ. 5 లక్షలు ఉండాలి. సూక్ష్మ రుణ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తారు.
మే 13
¤ పార్లమెంటు వజ్రోత్సవాల సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి (ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించారు).   
     » సాయంత్రం 5.30కు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ సమావేశంలో ప్రసంగించారు.
     » ఈ సందర్భంగా 1952 నాటి తొలి సభకు ప్రాతినిధ్యం వహించిన కందాళ సుబ్రహ్మణ్యం, కానేటి మోహనరావు (ఇద్దరూ తెలుగువారు), రేషమ్ లాల్ జంగ్డే, రిషాంగ్ కీషింగ్‌లను ఘనంగా సన్మానించారు.
     » రిషాంగ్ కీషింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు కావడం విశేషం.
     » కందాళ సుబ్రహ్మణ్యం విజయనగరం లోక్‌సభ స్థానానికి, కానేటి మోహనరావు రాజమండ్రి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
     » 1952 మే 13న భారతదేశ సర్వసత్తాక పార్లమెంట్ తొలి సమావేశం నిర్వహించారు. తాత్కాలిక స్పీకర్ గణేష్ వాసుదేవ మౌలాంకర్ ఆధ్వర్యంలో తొలి భేటీకి అంకురార్పణ జరిగింది. మే 15, 1952న మౌలాంకర్‌ను తొలి స్పీకర్‌గా ఎన్నుకున్నారు.
     » రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పార్లమెంట్ వజ్రోత్సవాలకు చిహ్నంగా రూ. 5, రూ. 10 నాణేలను విడుదల చేశారు.
మే 16
¤ చక్కెర ఎగుమతి నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. ఎగుమతి కోటాను 10 వేల టన్నుల నుంచి 25 వేల టన్నులకు పెంచింది.
మే 17
¤ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కాపీరైట్ సవరణ బిల్లు - 2012కు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
     » కేంద్ర హెచ్ఆర్‌డీ మంత్రి కపిల్ సిబాల్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
మే 18
¤ అంతరాష్ట్ర మండలి స్థాయీ సంఘాన్ని పునర్ వ్యవస్థీకరించారు. హోం మంత్రి చిదంబరం దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
     » పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అంతరాష్ట్ర మండలి స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉంటారు.
మే 20
¤ ఇకపై కాబోయే వైద్యులు ఎంబీబీఎస్ పట్టా పొందే ముందు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతంలో తప్పనిసరిగా పని చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది.
     » గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఏడాది కాలంలో వైద్యులు జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్ఆర్‌హెచ్ఎం)తో అనుసంధానమై పని చేయాల్సి ఉంటుంది.
మే 21
¤ యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యాయి.
¤ నల్లధనం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 97 పేజీల ఈ శ్వేతపత్రాన్ని ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
     » నల్లధనం నియంత్రణకు నాలుగంచెల వ్యూహాన్ని ఇందులో ప్రతిపాదించారు.
1. ఆస్తుల స్వచ్ఛంద వెల్లడికి వెనకంజ వేయించే అంశాలను తగ్గించడం 2. ఆర్థిక లొసుగులు ఉండే రంగాల్లో సంస్కరణలు 3. సమర్థమైన, విశ్వసనీయమైన నియంత్రణ చర్యలు 4. నియంత్రణలో వెన్నుదన్నుగా నిలిచే చర్యలు.
మే 22
¤ ఆనంద్ వివాహచట్టం సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీంతో సిక్కు మతస్థుల వివాహాల నమోదుకున్న చిక్కులు తొలగి పోయినట్లయ్యింది.
     » ఆనంద్ వివాహ చట్టం 1909లోనే రూపొందినా వివాహాల నమోదు (రిజిస్ట్రేషన్)కు సంబంధించిన నిబంధనను అందులో చేర్చలేదు. దీంతో సిక్కు మతస్థులు కూడా హిందూ వివాహ చట్టం- 1955ను అనుసరించే తమ వివాహాలను నమోదు చేసుకుంటూ, ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. దీంతో వారినీ హిందువులుగానే పరిగణించాల్సి వస్తోంది.
¤ 18 ఏళ్లలోపు పిల్లలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.
     » చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులను వేగంగా విచారించేందుకు ఈ చట్టం కింద ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. దోషులకు జీవితఖైదు లాంటి కఠినమైన శిక్షలు విధిస్తారు.
¤ కాపీరైట్ సవరణ బిల్లు 2012కు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభ మే 17నే ఈ బిల్లును ఆమోదించింది.
     » పాటల రచయితలు, కళాకారులు, ప్రదర్శకులు ఇకనుంచి తమ సృజనకు రాయల్టీ (శాశ్వత చెల్లింపులు)లను పొందవచ్చు. ఇప్పటి దాకా నిర్మాతలే సృజనకు హక్కుదారులుగా ఉన్నారు.
¤ యూపీఏ-2 అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో 'రిపోర్ట్ టు ద పీపుల్ 2011-2012' నివేదికను ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ విడుదల చేశారు.
     » బ్రిక్స్ సదస్సులో దేశాధ్యక్షులతో ప్రధాని ఫోటో, చిరునవ్వుతో పంటచేలో పనిచేస్తున్న రైతు, బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం, ఆధార్‌కార్డు, అగ్నిక్షిపణితో కూడిన ముఖచిత్రంతో 90 పేజీల నివేదికను విడుదల చేశారు.
మే 24
¤ పేదరికం అంచనాకు అనుసరించిన పద్ధతిపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలోప్రత్యామ్నాయ పద్ధతులను సూచించే నిమిత్తం ప్రభుత్వం ప్రముఖ ఆర్థికవేత్తప్రధానిఆర్థిక సలహా మండలి ఛైర్మన్ సి.రంగరాజన్ నేతృత్వంలో నిపుణుల బృందాన్నినియమించింది     » పేదరికాన్ని అంచనా వేయడానికి సురేష్ టెండూల్కర్ ప్రతిపాదించిన పద్ధతిని బృందం పునఃసమీక్షిస్తుంది     » సురేష్ టెండూల్కర్ పద్ధతి ప్రకారం - రోజువారీ వినియోగానికి పట్టణాల్లో రూ. 28.65, గ్రామాల్లో రూ. 22.42 చొప్పున ఖర్చు పెట్టగలిగేవారు మాత్రమేనిరుపేదలంటూ దారిద్య్రరేఖను స్థిరపరచడంతో విపక్షాలుప్రజల నుంచి తీవ్ర ఆగ్రహంవ్యక్తమైంది నేపథ్యంలో ప్రణాళికా సంఘం  కమిటీని ఏర్పాటు చేసింది     » టెండూల్కర్ కమిటీ సూత్రం ప్రకారం దేశంలో పేదరికం 2004-05లో 37.2శాతం ఉండగా 2009-10 నాటికి 29.8 శాతానికి తగ్గిందిపేదల సంఖ్య 40.7 కోట్లనుంచి 35.5 కోట్లకు తగ్గింది
మే 28
¤ ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీఉన్న 27 శాతం రిజర్వేషన్లలోమైనార్టీలకు 'ఉపకోటాకింద 4.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది     » ఓబీసీ రిజర్వేషన్లను రెండు భాగాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం 2011డిసెంబరు 22 రెండు ఆదేశాలు విడుదల చేసిందిఓబీసీలకున్న 27 శాతంరిజర్వేషన్ల కోటాలో ఓబీసీలకు 22.5 శాతం మిగతా 4.5 శాతం సామాజిక,విద్యపరంగా వెనుకబడిన మైనార్టీలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది
మే 31
¤ 1999 నాటి టెలికం విధానం స్థానంలో తీసుకురానున్న కొత్త టెలికం విధానం - 2012కు ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందిదీనిప్రకారం రోమింగ్ ఛార్జీలు ఉండవుదేశంలో ఎక్కడ  నెట్‌వర్క్‌కు మారినా ప్రస్తుతంఉపయోగిస్తున్న నంబరునే ఉంచుకోవచ్చునంబర్ పోర్టబులిటీ ప్రక్రియను టెలికంవిభాగం తక్షణం ప్రారంభిస్తుందికొత్త టెలికం విధానంలోని ముఖ్యాంశాలు:      » దేశంలోని గ్రామీణా ప్రాంతాల్లో టెలికం సేవలు ప్రస్తుతం 39 శాతందీన్ని 2017నాటికి 70 శాతం, 2020 నాటికి 100 శాతం చేయాలన్నది లక్ష్యం     » అందరికీ బ్రాడ్‌బ్యాండ్బ్రాడ్‌బ్యాండ్ కనీస వేగం 2 ఎంబీపీఎస్‌కు పెంపుమార్పు తక్షణం అమల్లోకి     » మొబైల్‌ఫోన్లుఇతర టెలికం ఉపకరణాల తయారీ దేశంలోనే చేపట్టడం.భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చడం     » స్పెక్ట్రమ్ చట్టం రద్దువిధాన రూపకల్పన అధికారం ప్రభుత్వం వద్దేటెలికంనియంత్రణ సంస్థ (ట్రాయ్ఎలాంటి విధానాలను రూపొందించదు
¤ ప్రవాస భారతీయ కార్మికుల కోసం మే 1 ప్రారంభించిన పింఛనుబీమా పథకంపేరును మహాత్మగాంధీ ప్రవాసి సురక్ష యోజనగా మార్చాలని ప్రభుత్వంనిర్ణయించిందివిదేశాల్లో వర్క్ పర్మిట్ లేదా ఉపాధి కాంట్రాక్టు ఉండిపాస్‌పోర్టులపై'ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వెర్‌డ్స్టాంప్ ఉన్న భారతీయ కార్మికులకు  పథకంవర్తిస్తుంది