Wednesday, 4 July 2012

సచిన్ టెండూల్కర్
1. భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు సంబంధించి కింది వానిలో ఏవి సరైనవి? ( ) 
1. సచిన్ టెస్టుల్లో 50 సెంచరీలు, వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేశారు
2. సచిన్ టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేశారు
3. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్
4. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీల విషయంలో, సచిన్ తర్వాత రికీపాంటింగ్ ఉన్నారు
1. కేవలం 1,3,4 సరైనవి 2. కేవలం 2,3,4 సరైనవి
3. అన్నీ సరైనవి 4. ఏదీ కాదు
2. 2012 మార్చి 16న సచిన్ తన 100వ సెంచరీ ఎక్కడ, ఏ జట్టుపై సాధించారు? ( )
1. ఢాకా, బంగ్లాదేశ్ 2. ఢాకా, పాకిస్తాన్
3. మిర్పూర్,బంగ్లాదేశ్ 4. మిర్పూర్, పాకిస్థాన్
3. కింది వానిలో ఏది నిజం? ( )
1. సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేశారు
2. టెస్టుల్లో తొలి సెంచరీనీ ఇంగ్లాండ్‌పై ఓల్డ్ ట్రాఫర్డ్‌లో చేశాడు.
3. టెస్టుల్లో సచిన్ చేసిన మొత్తం సెంచరీల్లో 29 విదేశాలలోనే
4. పైవన్నీ 
4. సచిన్ చేసిన 100 సెంచరీల్లో భారత్ మొత్తం ఎన్నిసార్లు నెగ్గింది? ( )
1. 51 2. 52 3. 53 4. 54
5. సచిన్ వన్డేల్లో తన తొలి సెంచరీని, ఎవరిపై ఏ స్టేడియంలో సాధించాడు? ( )
1.ఆస్ట్రేలియాపై ప్రేమదాస స్టేడియంలో
2. శ్రీలంకపై, కొలంబొలో 
3. పాకిస్థాన్‌పై, రావల్పిండిలో
4. న్యూజిలాండ్‌పై, ఫ్రాంచైజీ స్టేడియంలో
సౌరతుపాన్ 
6. అయిదేళ్ళ కాలంలో అతి పెద్ద భారీ సౌర తుపాను ఇటీవల ఎప్పుడు సంభవించింది? ( )
1. మార్చి 5, 2012 2. మార్చి 6, 2012
3. మార్చి 7, 2012 4. మార్చి 8, 2012
7. సౌర తుపానులో భాగంగా తలెత్తే అంశం ఏది? ( )
1. కరోనల్ మాస్ ఎజెక్షన్ 2. కార్నియల్
3. సునామీ 4.ఏదీ కాదు
8. సౌర తుపానువల్ల దెబ్బతినే వ్యవస్థలేవి? ( )
1. పవర్‌గ్రిడ్లు 2. శాటిలైట్లు 3. 1,2 4. ఏదీ కాదు
9. NOAA ను విస్తరించుము? ( ) 
1. నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్
2. నార్త్ ఓషియన్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్
3. నేషనల్ ఓషియానిక్ అట్లాంటిక్ ఆటమ్ 
4. పైవేవీ కావు
పేదరిక ప్రమాణాలు
10. అయిదేళ్ళలో పేదరికం శాతం ఎంత మేర తగ్గిందని ప్రణాళిక సంఘం లెక్కలు కట్టింది? ( )
1. 7.2% 2. 7.3% 3. 7.4% 4. 7.5%
11. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా తలసరి వినియోగం ఎంత ఉంటే పేదలు కాదని ప్రణాళికా సంఘం పేర్కొంది?
1. రూ.28.65 (పట్టణ ప్రాంతాలు), రూ.22.42 నగామీణ ప్రాంతాలు
2. రూ.28.40 (పట్టణ ప్రాంతాలు), రూ.22.42 నగామీణప్రాంతాలు
3. రూ.28.65 (పట్టణ), రూ.22.48 గ్రామీణ ప్రాంతాలు
4. ఏదీ కాదు ( )
12. ప్రణాళిక సంఘం ఇటీవలి కొలమానాలు ఏ కమిటీ సూచనలు మేరకు చేసింది? ( )
1. రంగరాజన్ కమిటీ 2. టెండూల్కర్ కమిటీ
3. మాంటెక్ సింగ్ కమిటీ 4. ఏదీ కాదు
13. ఏ మూడు అంశాల ప్రాతిపదికన ఖర్చులను గణిస్తూ పేదరికాన్ని అంచనావేస్తారు. ( )
1. విద్య, వైద్యం, గృహం 2. గృహం, వైద్యం, ఆహారం
3. విద్య, గృహం, వస్త్రం 4. విద్య, వైద్యం, ఆహారం
14. ప్రణాళికా సంఘం అంచనాల ప్రకారం ఈ కింది వానిలో ఏది సరైనది? ( )
1. 2004-05లో పేదలు 40.72 కోట్లు
2. 2009-10 నాటికి 34.47 కోట్లు
3. తగ్గుదల పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది
4. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలే అత్యంత పేదలుగా ఉన్నారు.
1. 1,2 సరైనవి 2. 2,3,4 సరైనవి
3. 1,3,4 సరైనవి 4. అన్నీ సరైనవి
వివాహ చట్ట సవరణ బిల్లు
15. వివాహ చట్టం (సవరణ) బిల్లు, 2010కి సంబంధించి కింది వానిలో ఏది సరైనది? ( )
1.ఈ బిల్లును రెండేళ్ళ కిందటే రాజ్యసభలో ప్రవేశపెట్టారు
2. జయంతి నటరాజన్ నేతృత్వంలోని స్థాయి సంఘం సిఫారసులు ఆధారంగా బిల్లుకు తుది మార్పులు చేశారు.
1. 1 మాత్రమే సరైనది 2. 2 మాత్రమే సరైనది
3. 1,2 సరైనవి 4. రెండూ సరైనవి కావు
16. భార్యాభర్తల గొడవల విషయంలో వేచి చేసే గడువు (కూలింగ్ ఆఫ్ పీరియడ్)కు సంబంధించి వివాహ చట్టాల (సవరణ) బిల్లు - 2010లో వచ్చిన మార్పులేమిటి? ( )
1. 1 నెలల నుంచి 6 నెలలకు ‘వేచిచూసే గడువు’ను తగ్గించింది.
2. ఈ అంశాన్ని కోర్టులకు వదిలేసింది
3. ఈ అంశంలో విడిపోవాలను కుంటున్న జంటే విచక్షణాధి కారం ఇవ్వబడింది. 
4. పైవేవీ కావు
17. ఆస్తికి సంబంధించి వివాహ చట్టాల సవరణ బిల్లు - 2010 ప్రకారం సరైనదేది? ( )
1. భార్యకు భర్త ఆస్తిలో వాటా ఉండదు.
2. పెళ్ళి అయిన తర్వాత భర్త సంపాదనలో 50% వాటా భార్యకు లభించనుంది
3. ఈ అంశాన్ని కోర్టులే నిర్ధారిస్తాయి.
4. పైవేవీకావు
1. రూ.60,000 లోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలను దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు పరిగ ణించాల్సిందిగా సూచించిన కమిటీ? ( )
1. టెండూల్కర్ కమిటీ 2. వై.కే.అలగ్‌కమిటీ
3. వాధ్వా కమిటీ 4. ఏదీ కాదు
19. 5 మంది ఉన్న కుటుంబానికి నెలకు కనీసం ఎంత ఆదాయం లేనిదే ఇంటికి, ఆహారానికి, వస్త్రాలకు ఇబ్బంది ఉండదని ప్రపంచబ్యాంక్ పేర్కొంది? ( )
1. రూ. 8000 2. రూ. 8250
3. రూ. 8500 4. రూ. 8,750
అణుభద్రతా సదస్సు
20. ఇటీవల రెండో అణుభద్రతా సదస్సు ఎక్కడ నిర్వహించారు? ( )
1. క్యోటో 2. వాషింగ్టన్ 
3. సియోల్ 4. టోక్యో
21. 2014లో అణుభద్రతా సదస్సు ఎక్కడ నిర్వహించ నున్నారు? 
1. జపాన్ 2. నెదర్లాండ్స్ ( )
3. స్విట్జర్లాండ్ 4. అమెరికా
22. 2015 నాటికి ఎంత మేర వాణిజ్యం పెంపునకు భారత దక్షిణ కొరియాలు ఒప్పందం చేసుకున్నాయి? ( )
1. 10 మిలియన్ డాలర్లు 2. 20 మిలియన్ డాలర్లు
3. 30 మిలియన్ డాలర్లు 4. 40 మిలియన్ డాలర్లు
23. దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు? ( )
1.బాన్-కీ-మూన్ 2. లీ మ్యూంగ్ బక్
3. ఛానెల్-ఈ-బుక్ 4. పై వారెవరూ కాదు

No comments:

Post a Comment