Sunday, 8 July 2012

జులై తేదీలు-సంఘటనలు
Julyఅంతర్జాతీయం
-జులై 1:జపాన్‌లోని పుకుషిమా అణు ప్రమాదం తర్వాత తొలిసారిగా ఇందులోని రియాక్టర్ ఒకటి నిరసనల నడుమ ప్రారంభమయింది. ఓహి ప్లాంట్‌లోని మూడో నంబరు రియాక్టర్‌ను ప్రారంభిస్తున్న తరుణంలో పెద్దసంఖ్యలో నిరసనకారులు బయట గుమికూడి నినాదాలు చేశారు.
-జులై 3:ప్రపంచం లోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జిని రష్యా ప్రధాని దిమిత్రీ మెద్వదేవ్ ప్రారం భించారు. రష్యాలో విసి రేసినట్లుండే తూర్పు ప్రాంతంలోని వ్లాదివోస్టోక్ నుంచి రస్కీ ఐలండ్ మధ్య దీన్ని నిర్మించారు. దీని పొడవు 1104 మీటర్లు. దీని నిర్మాణ వ్యయం 20 బిలియన్ డాలర్లు. మన రూపాయిల్లో.. అక్షరాలా లక్షకోట్ల రూపాయలు.
-జులై 4:దైవకణం ఆచూకీని నిర్ధారించినట్టు సిఈఆర్‌ఎన్ (సెర్న్) డైరెక్టర్ జనరల్ రాల్ఫ్ హ్యూర్ ప్రకటించారు. హిగ్స్ బోసన్ లక్షణాలున్న కణం ఉనికి స్పష్టమైన నేపథ్యంలో భౌతికశాస్త్రంలో నూతన అధ్యాయం ప్రారంభమయింది. లార్జ్ హాడ్రాన్ కొల్లాయిడర్ (ఎల్‌హెచ్‌సీ) పేరుతో కొన్నేళ్ళుగా దైవకణం ఉనికిని నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌హెచ్‌సీలోని అట్లాస్ విభాగం శావేత్తలు కూడా తాము ఒక కొత్త కణాన్ని కనుక్కున్నామని, హిగ్స్ తదితరులు ప్రతిపాదించినట్లుగా దీని ద్రవ్యరాశి దాదాపు 126 గిగా ఎలక్ట్రాన్ వోల్టుల వరకు ఉంటుందని ప్రకటించారు. హిగ్స్ బోసన్ కణాన్ని కొందరు దైవకణం అని పిలుస్తుండటం తెలిసిందే. లిహెన్ లాడర్‌మ్యాన్ అనే భౌతికశాస్త్రవేత్త 1993లో ‘ది గాడ్ పార్టికల్...ఇఫ్ ది యూనివర్స్ ఈజ్ ద ఆన్సర్ వాటీజ్ ద క్వశ్చన్’ పేరుతో రాసిన పుస్తకంలో తొలిసారిగా ఈ పదాన్ని ఉపెూగించారు. విశ్వవ్యాప్తంగా అదృశ్యంగా ఉండే హిగ్స్ ఫీల్డ్ గురించి, అన్ని ప్రాథమిక కణాలకు అతిముఖ్యమైన ధర్మం ద్రవ్యరాశిని ఇచ్చేది కాబట్టి ఆ కణానికి ‘దైవకణం’ అన్న పేరు పెట్టారు.


-జూన్ 29:బ్రిటన్ రాజకుటుంబీకుల ప్రత్యేక ఆభరణాల శ్రేణి ప్రదర్శన బకింగ్‌హాం రాజప్రాసాదంలో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఎలిజెబెత్‌రాణి వజ్రాల శ్రేణిని తొలిసారిగా ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇందులో 1911లో భారత్‌లో జరిగిన ఢిల్లీ దర్బారును పురస్కరించుకొని రాణి మేరి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ‘ఢిల్లీ దర్బార్ కిరీటాన్ని కూడా ప్రదర్శిస్తారు. 1911 డిసెంబరులో జార్జి రాజు, రాణి మేరీల పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని ‘ఢిల్లీ దర్బారును’ను నిర్వహించారు.


జాతీయం
-జులై 1:పడమటి కనుమలను ఇకనుంచి ‘ప్రపంచ వారసత్వ సంపద’గా పరిగణిస్తారు. ఈమేరకు రష్యాలోని సెంట్ పీటర్స్ బర్గ్‌లో జరిగిన వరల్ట్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దీని ప్రకారం పడమటి కనుమల్లోని మొత్తం 39 ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తారు.
-జులై 2:ప్రసూతి ఆరోగ్యానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి నిర్దేశించినల లక్ష్యాలను భారత్ సాధిం చే అవకాశాలు కనిపించడంలేదు. ఈ లక్ష్యాల్లో ముఖ్యమై న ప్రసూతి మరణాలు ఎక్కువ ఉండటమే దీనికి కారణం. ప్రస్తుతం దేశం లో ప్రతి పదినిముషాలూ ఒక తల్లి మరణిస్తోందని ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో తేలింది. నివేదికను జవహ ర్‌లాల్ నెహ్రూ వర్సిటీకి చెందిన ఆర్థికవేత్త జయంతీ ఘోష్ విడుదల చేశారు. కాగా 2010లో ప్రపంచ వ్యాప్తంగా 2.87 లక్షల ప్రసూతి మరణాలు సంభవించాయని ఐరాస నివేదిక పేర్కొంది. 1990నాటి పరిస్థితులతోపోలిస్తే ప్రస్తుతం ఈ మరణాలు 47శాతం తగ్గాయి.
-జులై 3:సిగరెట్ ప్యాకెట్‌పై కొత్త హెచ్చరికను ముద్రించ బోతున్నారు. థాయ్‌లాండ్ నుంచి అనుమతి తీసుకొని ముద్రించబోతున్న ఈ చిత్రంలో ఎవరి ముఖమూ కనిపించదు. ప్రస్తుతం ముద్రిస్తున్న హెచ్చరికలో బ్రిటన్ ఫుట్‌బాల్ ఆటగాడు జాన్‌టెర్రీ చిత్రాన్ని ఉపయోగిస్తున్నారు. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని జాన్ టెర్రీ లాయ ర్లు హెచ్చరించడంతో ప్రభుత్వం కొత్త చిత్రాన్ని ముద్రించాలని నిర్ణయించింది. కొత్త హెచ్చరిక ముద్రించడానికి తయారీదార్లకు మరో ఆరు నెల్ల కాల వ్యవధి ఇచ్చే అవకాశముంది. బొమ్మ మారుతు న్నప్పటికీ పొగాకు ఉపయోగించడం వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేసే సందేశం మాత్రం మారదు.
-జులై 3:పాఠ్యపుస్తకాల్లో ఆయా రాజకీయ నాయకులపై ఉన్న పలు కార్టూన్లను తొలగించాలంటూ సుఖదేవ్ థోరాట్ కమిటి సిఫారసు చేసింది. దీని సిఫారసులను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి పరిశీలిస్తుంది. ఎన్‌సిఇఆర్‌టికి చెందిన పాఠ్యపుస్తక సమీక్ష కమిటీ ఈ ప్రక్రియ చేపడుతుంది. ఒక పాఠ్యపుస్తకంలో బీ.ఆర్.అంబేద్కర్‌పై వేసిన ఓ వ్యంగ్య చిత్రం తీవ్ర వివాదాన్ని సృష్టించిన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆరుగురు సభ్యులతో గత మేనెలలో థోరాట్ కమిటీని నియమించింది. ఇది గత వారం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్‌కు తన నివేదికను అందజేసింది.


-జులై 3:ప్రముఖ ఆర్థికవేత్త వివేక్ దేవ్ రాయ్ 11 సంపుటాల్లో మహాభారతాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తున్నారు. ఇప్పటికే ఆయన వేదాలను, పురాణాలను, ఉపనిషత్తులను, భగవద్గీతను తర్జుమా చేసారు. ఈయన మహాభారతం తొలి సంపుటాన్ని 2009లో విడుదల చేశారు.
-జులై 4:ప్రముఖ అస్సామీ రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత హిరేన్ భట్టాచార్య మరణించారు. ఆయన కొంత కాలంగా అస్వస్థులుగా ఉన్నారు. 80ఏళ్ళ భట్టాచార్యకు భార్య, కుమార్తె ఉన్నారు. ‘హిరుడ’ అనే పేరుతో ఆయన బహుళ ప్రాచుర్యం పొందారు. ఆయన తన పద్యాల్లో సరళమైన పదాలను వాడేవారు. ఆవిధంగా ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.


రాష్ట్రీయం
-జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూ బాధ్యతలను స్వీకరించారు. ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రెండో మహిళా ఐఏఎస్ అధికారి ఈమె. చంద్రబాబు ప్రభుత్వంలో 2002 సెప్టెంబర్‌లో సతీ నాయర్ సీఎస్ అయ్యారు. ఆర్నెల్ల పాటు ఆమె పదవిలో కొనసాగారు. మిన్నీ మాథ్యూకు ఏడు నెలల సర్వీసు ఉన్నది. భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌గా ఉన్న ఈమెను నూతన సీఎస్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రస్తుత, సీఎస్ పదవీవిరమణ చేశారు. కాగా మాథ్యూస్ హైదరాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన ఏకైక ఐఎఎస్ అధికారి.


ఆర్థికం
-జులై 1:ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో ఉపగ్రహాల ప్రయోగం కోసం మూడో లాంచ్ ప్యాడ్‌ను నిర్మించను న్నట్లు ఇస్రో ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ వెల్లడించారు. షార్ నుంచి వచ్చే ఐదేళ్ళలో 60 ఉపగ్రహాలను ప్రయోగించనున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న రెండు లాంచ్ ప్యాడ్‌లపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ కొత్త లాంచ్‌ప్యాడ్‌ను భారీ ఉపగ్రహాలను వెూసుకెళ్ళే జీఎస్‌ఎల్‌వీ మార్క్3 ప్రయోగానికి కూడా ఉపెూగిస్తామని చెప్పారు.


సైన్స్ & టెక్నాలజీ
-జులై 1:ప్రతిష్ఠాత్మక నాయుడమ్మ అవార్డుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) రీజినల్ హెడ్ వి. రాజన్నను ఎంపిక చేసినట్లు నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ సంస్థ ప్రకటించింది.


-జూన్ 30:మధుమేహ పీడితులకు ఇన్సులిన్ ఇవ్వకుండానే వ్యాధిని నియంత్రించే దిశగా సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యూలార్ బయాల జీ (సీసీఎంబీ)కి కీలక ఆధారం దొరికింది. జంతువుల్లో ‘జీన్ నాకౌట్’ విధానాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు అనూహ్యంగా మధుమేహ నియంత్రణకు మూలాలు దొరికాయి. సిసిఎంబి ఇటీవల డబ్ల్యూడీఆర్ 13 అనే జన్యువు పనితీరుపై అధ్యయనం చేస్తున్నది. ఈ సందర్భంగా ఈ జన్యువును తొలగించి (జీన్ నాకౌట్) చుంచెలుకలను పరిశీలించారు. రెండున్నరేళ్ళ పాటు ఇవి జీవిస్తాయి. 11 నెలల తర్వాత వీటిల్లో స్థూలకాయం లక్షణాలు కనిపించాయి. దీనికి కారణాలు అన్వేషించగా ఈ చుంచెలుకల్లో ఇన్సులిన్ ఉండాల్సిన స్థాయికంటే అధికంగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. సాధారణ జంతువుల్లో ఒక ప్రత్యేక జన్యువును తొలగించడం వల్లనే ఇన్సులిన్ వృద్ధి చెందింది. దీన్నే మానవుల్లో కూడా అమలు జరిపి ఇన్సులిన్‌ను దరిచేరకుండా చేయవచ్చునన్న ఆశాభావంతో శాస్త్రవేత్తలున్నారు.
-జూన్ 30:రోజుకొక్క మాత్రతో హెచ్‌ఐవీ బాధితులకు చికిత్స అందించే విధానం త్వరలో అం దుబాటులోకి వచ్చే అవకాశాలు న్నాయి. వీరికోసం నాలుగు ఔషధాలతో కూడిన ‘క్వాడ్’ అనే మాత్రను కొత్తగా రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులకంటే దీని పనితీరు మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్వాడ్ అధ్యయనకర్త పేరు పాల్ సాక్స్. ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినవారు.
-జులై 2:విశ్వం పుట్టుక తదితర ప్రాథమిక రహస్యాలను వెల్లడించే దైవకణం (హిగ్స్‌ఆసన్ మూలకం) ఆచూకీ లభించింది. దీనిపై శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేయనున్నారు. దీనిపై అధ్యయనం చేస్తున్న యూరప్‌లోని అణు పరిశోధన సంస్థ ‘సెర్న్’ నిర్వహిస్తున్న సదస్సు కోసం ఇప్పటికే ప్రముఖ శాస్త్రవేత్తలకు ఆహ్వానం అందింది. దీంతో 99.99 శాతం ఖచ్చితత్వంతో దైవకణాన్ని కనుగొన్నామని సెర్న్ ప్రకటించే అవకాశముంది. దైవ కణాన్ని ప్రతిపాదించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త పీటర్ హిగ్స్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నా రు. హిగ్స్ బాసన్ కణాలవల్లే పరమాణువులకు ద్రవ్యరాశి ఉంటుందని, దానివల్లనే ఈ విశ్వం ఏర్పడిందని భౌతిక శావేత్తలు భావిస్తున్నారు. దైవకణం లేకపోతే అనువులు ఏర్పడటం సాధ్యం కాదని దాంతో విశ్వంలో గ్రహాల దగ్గరి నుంచి జీవం వరకు దేనికీ స్థానం ఉండేది కాదని పరిశోధకుల అంచనా. ఈ దైవకణాన్ని కనుగొనడానికి స్విట్జర్లాండ్ సరహద్దుల్లో ‘సెర్న్’ ఒక భారీ భూగర్భ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించింది. ఇందుకోసం ‘లార్జ్ హాడ్రన్ కొల్లైడర్’ అనే 18 మైళ్ళ పొడవున్న సొరంగాన్ని ఏర్పాటు చేసింది. విశ్వం ఆవిర్భావానికి మూలంగా భావిస్తున్న బిగ్ బ్యాంగ్‌ను ఈ సొరంగంలో కృత్రిమంగా సృష్టించింది. రెండు ఫోటాన్ పరమాణువులను కాంతివేగంతో ఢీకొట్టించడం వల్ల జనించే మూలకాలపై పరిశోధన జరిపింది. ఇందులో హిగ్స్ బాసన్ కణం ఉనికిని తాజాగా కనుగొన్నట్లు సమాచారం.
-జులై 4ఎయిడ్స్‌కు దారితీసే హెచ్‌ఐవీ వైరస్‌ను ఎవరికివారు ఇంట్లోనే సొంతంగా గుర్తించేందుకు తోడ్పడే పరీక్ష కిట్‌కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆవెూదం తెలిపింది. ‘ఓరాక్విక్ ఇన్‌హోమ్ హెచ్‌ఐవీ టెస్ట్’ అనే ఈ కిట్ లాలాజలం ద్వారా వైరస్‌ను పసిగడుతుంది. నోట్లోని చిగుళ్ళ లోపలి స్రావాల నమూనాను దూదితో వెలికితీసి ఈ కిట్‌లోని సీసాలో వేయాల్సి ఉంటుంది. అనంతరం 2040 నిమిషాల్లో హెచ్‌ఐవీ ఉన్నదీ లేనిదీ బయటపడుతుంది. ఈ పరీక్ష 92 శాతం ఖచ్చితంగా హెచ్‌ఐవీని గుర్తిస్తున్నట్లు తేలింది.


-జులై 4ప్రపంచంలో అత్యంత మార్కెట్ విలువ కలిగిన క్రీడాకారుల్లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని 16వ స్థానంలో నిలిచాడు. బ్రిటన్‌కు చెందిన స్పోర్ట్స్ ప్రో అనే బ్రిటిష్ మాసపత్రిక ప్రకటించిన ఈ జాబితాలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్‌కు 38వ స్థానం లభించింది.
-జులై 6:జాతీయ అంతర్ రాష్ర్ట సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ సత్తి గీత మరోసారి సత్తా చాటింది. ఇప్పటికే రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్న గీత మహిళల రెండువందల మీటర్ల పరుగుపందెంలో రజతం సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ రేసును గీత 24.33 సెకండ్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది.

No comments:

Post a Comment