¤ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ వారంరోజుల పర్యటన కోసం దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా చేరుకున్నారు. » ప్రిటోరియాలోని చారిత్రక యూనియన్ బిల్డింగ్ (అధ్యక్ష భవనం) వద్ద దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌జుమాతో ప్రతిభాపాటిల్ సమావేశమయ్యారు. | |
» విద్యుత్, ఐటీ, ఆరోగ్యం, టూరిజం, మౌలికాభివృద్ధి లాంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని భారత్, దక్షిణాఫ్రికా నిర్ణయించాయి.
¤ దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ జైలుశిక్ష అనుభవించిన ఓల్డ్‌ఫోర్ట్ జైలులోనే రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. » చారిత్రక ఓల్డ్‌ఫోర్ట్ జైలును ప్రస్తుతం దక్షిణాఫ్రికా దేశ అత్యున్నత న్యాయస్థానంగా మార్చారు. » దక్షిణాఫ్రికా స్వాతంత్య్రానికి ముందు అణచివేత కేంద్రాలుగా నిలిచిన కారాగారాలు, ఇతర కేంద్రాలను మ్యూజియమ్‌లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చేస్తున్నారు.
| ¤ మూడురోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ కోల్‌కతా చేరుకున్నారు (ఆమె బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చారు). |
¤ దక్షిణాఫ్రికాలో శాస్త్ర సాంకేతిక విద్యారంగం అభివృద్ధి, యువతలో నైపుణ్యాల పెంపు దిశగా తోడ్పడే ఒక ఐటీ కేంద్రానికి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ డర్బన్‌లో శంకుస్థాపన చేశారు. » 1904లో మహాత్మాగాంధీ స్థాపించిన 'ఫీనిక్స్ సెటిల్‌మెంట్' ఆశ్రమ ప్రాంతంలోనే 'మహాత్మాగాంధీ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
¤ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ న్యూఢిల్లీలో రేస్‌కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలో మన్మోహన్‌తో సమావేశమయ్యారు (మూడు దేశాల ఆసియా పర్యటనలో భాగంగా ఆమె భారత్ చేరుకున్నారు). » భారత పర్యటనకు ముందు హిల్లరీ చైనా, బంగ్లాదేశ్‌లలో పర్యటించారు. » హిల్లరీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కోల్‌కతాలో సమావేశమయ్యారు. ¤ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా 1893లో జాతి వివక్షతో మహాత్మాగాంధీని రైల్లోనుంచి తోసేసిన చరిత్రాత్మక ఘటనకు సాక్షిగా నిలిచిన పీటర్ మారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌ను రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సందర్శించారు.
¤ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. » పౌరసమాజం చేపట్టే వినూత్న ఆవిష్కరణలను గుర్తించి, పెట్టుబడి పెట్టడానికి అమెరికాతో సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టుకు 50 లక్షల డాలర్లు ఇస్తున్నట్లు భారత్ ప్రకటించింది. హిల్లరీ క్లింటన్‌తో సమావేశమైన కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహరాల శాఖ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ¤ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చివరి విదేశీ పర్యటన ముగిసింది. తొమ్మిది రోజుల సీషెల్స్, దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం ఆమె ఢిల్లీ చేరుకున్నారు.
¤ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మూడురోజుల పర్యటన నిమిత్తం మయన్మార్ చేరుకున్నారు. » గడిచిన 25 ఏళ్లలో మయన్మార్ పర్యటనకు వెళ్లిన తొలి ప్రధాని మన్మోహన్ కావడం విశేషం.
¤ మయన్మార్ పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ద్వైపాక్షిక సహకారంపై ఆ దేశాధ్యక్షుడు థెయిన్ సెయిన్‌తో చర్చలు జరిపారు. » వాణిజ్యం, ఇంధనం తదితర 12 రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈమేరకు మనదేశం మయన్మార్‌కు 50 కోట్ల డాలర్ల రుణ సాయం అందించనుంది. | |
¤ మయన్మార్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ దేశ ప్రజాస్వామ్య యోధురాలు ఆంగ్‌సాన్ సూకీని యాంగాన్‌లో కలుసుకున్నారు.
| ¤ భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీపావెల్ రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిలతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. |
» భారత్‌లోని బ్రిటన్ హైకమిషనర్ బేవాన్, ఇండోనేషియా రాయబారి అండీగాలిబ్ కూడా సీఎం, గవర్నర్‌లతో సమావేశమయ్యారు. |
|
No comments:
Post a Comment