¤ విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల అంశంపై అధ్యయనం జరిపిన జె.సి. కలా కమిటీ తన నివేదికను కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించింది. » ఈ కమిటీ తవ్వకాలకు సానుకూలంగా పలు సిఫార్సులు చేసింది. దీంతో పాటు ప్రభావిత ప్రాంతాల ప్రజల అభిప్రాయాలకు పెద్దపీట వేయాలని, మరోసారి గిరిజన సలహా మండలి తీర్మానం తీసుకోవాలని సూచించింది. » బాక్సైట్ తవ్వకాల వల్ల ప్రజలు నేరుగా ఎక్కడా నిర్వాసితులయ్యే ప్రసక్తి లేదని నివేదికలో పేర్కొన్నారు. » తవ్వకాలు జరిగే ప్రాంతం రాతినేలలు కావడం, ఇతర ప్రతికూల కారణాల వల్ల అక్కడ పచ్చదనం లేదని; చెప్పుకోదగిన పర్యావరణ సున్నిత ప్రాంతాలూ లేవని నివేదికలో తెలిపారు. » తవ్వకాల వల్ల ఆదిమ జాతులకు ఎలాంటి ముప్పులేదని, చారిత్రక, సాంస్కృతిక కట్టడాలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు.
¤ బొగ్గు, సహజ వాయువు, భూమి లాంటి సహజ వనరుల కేటాయింపు, ధరల నిర్ణయంలో పారదర్శకత కోసం అశోక్‌చావ్లా కమిటీ చేసిన 69 సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. » చావ్లా కమిటీ గతేడాది మేలో తన నివేదికను సమర్పించింది. మొత్తం 81 సిఫార్సులు చేయగా 69 సిఫార్సులకు ప్రభుత్వ ఆమోదం లభించింది |
|
No comments:
Post a Comment