మే 3
|
» ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు.
¤ రసాయన ఆయుధాల బిల్లుకు సవరణలు చేపట్టడానికి ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
మే 5
|
| ¤ కేంద్ర జలవనరుల మంత్రి పవన్కుమార్ బన్సల్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర ముఖ్యమంత్రులుఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, పృథ్వీరాజ్ చవాన్ప్రాణహిత నీటి వినియోగ పర్యవేక్షణకుఅంతరాష్ట్ర మండలి ఏర్పాటుకుసంతకాలు చేశారు. | |
మే 7
|
| » ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఠాగూర్ అంతర్జాతీయ పురస్కారాన్ని తొలిసారిగా సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు ప్రకటించారు. ఈ అవార్డు విలువ రూ. కోటి. | ![]() |
¤ విదేశీ మదుపుదారులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ జనరల్ యంటీ - అవాయిడెన్స్ రూల్స్ (జీఏఏఆర్ - 'గార్') అమలును ఏడాదిపాటు వాయిదా వేశారు.
» పన్ను ఎగవేతను అరికట్టే లక్ష్యంతో 2012-13 బడ్జెట్‌లో గార్‌ను ప్రతిపాదించారు.
» గార్ నిబంధనావళి 2013-14 ఆర్థిక సంవత్సరం, ఆపై సంవత్సరాల నుంచి అమలవుతుందని ఆర్థికమంత్రి ప్రకటించారు.
మే 8
|
» దేశంలోని వేర్వేరు ప్రాంతాల క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడానికి రెండోదశ ఉపాధి హామీ పథకాన్ని (ఎంఎన్ఆర్ఈజీఏ 2.0) రూపొందించారు.
» ఇకపై ఎంఎన్ఆర్ఈజీఏ పనులను నీటి యాజమాన్యం, సాగునీరు, వరద నియంత్రణ, వ్యవసాయం, పశువుల పెంపకం, చేపలు పట్టడం, తీరప్రాంతాల పనులు, గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్యం తదితర విభాగాలకు విస్తరించనున్నారు. ఏయే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలనేది గ్రామసభల్లో ఆయా గ్రామ పంచాయతీలు నిర్ణయిస్తాయి.
మే 9
|
» రాజ్యసభ ఈ బిల్లును ఏప్రిల్ 24నే ఆమోదించింది.
మే 10
|
» ఇకపై ఈ రుణసంస్థలు రిజర్వు బ్యాంక్ నియంత్రణలో పనిచేస్తాయి.
» ఈ బిల్లు ప్రకారం రుణసంస్థలు రిజర్వు బ్యాంక్ వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. సొంత నికర నిధులు కనీసం రూ. 5 లక్షలు ఉండాలి. సూక్ష్మ రుణ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తారు.
మే 13
|
| ¤ పార్లమెంటు వజ్రోత్సవాల సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి (ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించారు). | ![]() |
» ఈ సందర్భంగా 1952 నాటి తొలి సభకు ప్రాతినిధ్యం వహించిన కందాళ సుబ్రహ్మణ్యం, కానేటి మోహనరావు (ఇద్దరూ తెలుగువారు), రేషమ్ లాల్ జంగ్డే, రిషాంగ్ కీషింగ్‌లను ఘనంగా సన్మానించారు.
» రిషాంగ్ కీషింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు కావడం విశేషం.
» కందాళ సుబ్రహ్మణ్యం విజయనగరం లోక్‌సభ స్థానానికి, కానేటి మోహనరావు రాజమండ్రి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
» 1952 మే 13న భారతదేశ సర్వసత్తాక పార్లమెంట్ తొలి సమావేశం నిర్వహించారు. తాత్కాలిక స్పీకర్ గణేష్ వాసుదేవ మౌలాంకర్ ఆధ్వర్యంలో తొలి భేటీకి అంకురార్పణ జరిగింది. మే 15, 1952న మౌలాంకర్‌ను తొలి స్పీకర్‌గా ఎన్నుకున్నారు.
» రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పార్లమెంట్ వజ్రోత్సవాలకు చిహ్నంగా రూ. 5, రూ. 10 నాణేలను విడుదల చేశారు.
మే 16
|
మే 17
|
» కేంద్ర హెచ్ఆర్‌డీ మంత్రి కపిల్ సిబాల్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
మే 18
|
» పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అంతరాష్ట్ర మండలి స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉంటారు.
మే 20
|
» గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఏడాది కాలంలో వైద్యులు జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్ఆర్‌హెచ్ఎం)తో అనుసంధానమై పని చేయాల్సి ఉంటుంది.
మే 21
|
¤ నల్లధనం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 97 పేజీల ఈ శ్వేతపత్రాన్ని ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
» నల్లధనం నియంత్రణకు నాలుగంచెల వ్యూహాన్ని ఇందులో ప్రతిపాదించారు.
1. ఆస్తుల స్వచ్ఛంద వెల్లడికి వెనకంజ వేయించే అంశాలను తగ్గించడం 2. ఆర్థిక లొసుగులు ఉండే రంగాల్లో సంస్కరణలు 3. సమర్థమైన, విశ్వసనీయమైన నియంత్రణ చర్యలు 4. నియంత్రణలో వెన్నుదన్నుగా నిలిచే చర్యలు.
మే 22
|
» ఆనంద్ వివాహ చట్టం 1909లోనే రూపొందినా వివాహాల నమోదు (రిజిస్ట్రేషన్)కు సంబంధించిన నిబంధనను అందులో చేర్చలేదు. దీంతో సిక్కు మతస్థులు కూడా హిందూ వివాహ చట్టం- 1955ను అనుసరించే తమ వివాహాలను నమోదు చేసుకుంటూ, ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. దీంతో వారినీ హిందువులుగానే పరిగణించాల్సి వస్తోంది.
¤ 18 ఏళ్లలోపు పిల్లలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.
» చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులను వేగంగా విచారించేందుకు ఈ చట్టం కింద ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. దోషులకు జీవితఖైదు లాంటి కఠినమైన శిక్షలు విధిస్తారు.
¤ కాపీరైట్ సవరణ బిల్లు 2012కు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభ మే 17నే ఈ బిల్లును ఆమోదించింది.
» పాటల రచయితలు, కళాకారులు, ప్రదర్శకులు ఇకనుంచి తమ సృజనకు రాయల్టీ (శాశ్వత చెల్లింపులు)లను పొందవచ్చు. ఇప్పటి దాకా నిర్మాతలే సృజనకు హక్కుదారులుగా ఉన్నారు.
¤ యూపీఏ-2 అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో 'రిపోర్ట్ టు ద పీపుల్ 2011-2012' నివేదికను ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ విడుదల చేశారు.
» బ్రిక్స్ సదస్సులో దేశాధ్యక్షులతో ప్రధాని ఫోటో, చిరునవ్వుతో పంటచేలో పనిచేస్తున్న రైతు, బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం, ఆధార్‌కార్డు, అగ్నిక్షిపణితో కూడిన ముఖచిత్రంతో 90 పేజీల నివేదికను విడుదల చేశారు.
మే 24
|
మే 28
|
మే 31
|
¤ ప్రవాస భారతీయ కార్మికుల కోసం మే 1న ప్రారంభించిన పింఛను, బీమా పథకంపేరును మహాత్మగాంధీ ప్రవాసి సురక్ష యోజనగా మార్చాలని ప్రభుత్వంనిర్ణయించింది. విదేశాల్లో వర్క్ పర్మిట్ లేదా ఉపాధి కాంట్రాక్టు ఉండి, పాస్‌పోర్టులపై'ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వెర్డ్' స్టాంప్ ఉన్న భారతీయ కార్మికులకు ఈ పథకంవర్తిస్తుంది


No comments:
Post a Comment