పిహెచ్.డి. చేయాలంటే ఇదీ మార్గం!
దేశంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్.డి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. వివిధ శాఖల్లో డాక్టరేట్ చేసేందుకు వందలాది మంది సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పిహెచ్.డి చేసేందుకు కార్యాచరణ.పరిశోధనాత్మక విద్యగా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రదానం చేసే అత్యున్నత డిగ్రీగా గుర్తింపు పొందినది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ.. సంక్షిప్తంగా పి.హెచ్‌డి. విద్యాధికులు కావాలనుకునే వారి లక్ష్యాన్ని నెరవేర్చే గౌరవప్రద డాక్టరేట్ డిగ్రీ పిహెచ్‌డి. సుదీర్ఘ పరిశ్రమ, ఏకాగ్రత, తులనాత్మక పరిశోధనా దృష్టి, క్లిష్టమైన పరీక్షా విధానాలను విజయవంతంగా పూర్తి చేసినప్పుడే పిహెచ్‌డి డిగ్రీని పొందే అవకాశం ఉంటుంది.
పిహెచ్‌డి ప్రత్యేకత
పిహెచ్‌డి చేసే విద్యార్థి ఒక స్కాలర్ మార్గ దర్శకత్వంలో పరిశోధన చేయవలసి ఉంటుంది. స్కాలరే విద్యార్థికి ‘రీసెర్చ్ సూపర్‌వైజర్’గా ఉంటారు. ఈ పరిశోధనను 4 సంవత్సరాల పాటు చేయవలసి ఉంటుంది. ఇంత తీవ్రమైన, సూక్ష్మమైన పరిశోధన చేసి ఒక అంశంపై లోతైన విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు కాబట్టి పిహెచ్‌డి చేసిన వారిని ఆయా రంగాల నిష్ణాతులుగానూ, విధాన రూపకల్పనలో అర్హులుగానూ, అ అంశాన్ని ఉన్నత స్థాయిలో బోధించడానికి అర్హులుగాను పరిగణించడం జరుగుతుంది.
పిహెచ్‌డి ప్రవేశ ప్రక్రియ
భారతదేశంలోని విశ్వ విద్యాలయాలన్నింటిలోనూ పిహెచ్‌డికి సంబంధించిన ఒకే రకమైన నియమాలు ఉన్నాయి. పిహెచ్‌డి చేయాలంటే, ప్రత్యేక అంశంలో పరిశోధనాత్మక విద్య పూర్తి చేయాలంటే ముందుగా దానికి అనుమతి, అర్హత కావాలి. దాన్నే పిహెచ్‌డి ప్రవేశ పరీక్షగా చెప్పుకోవాలి. ఇటీవలే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు పిహెచ్‌డి ప్రవేశానికి ఒక ప్రత్యేక అర్హత పరీక్షను ప్రవేశపెట్టారు. దీనిని అన్ని విశ్వ విద్యాలయాల వారు నిర్వహిస్తారు. పి.హెచ్‌డి చేయడానికి ఈ అర్హత పరీక్ష ద్వారా ప్రవేశం పొందడంతో పాటు అమలులో ఉన్న ఇతర అర్హతలు.
1. యుజిసి వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించే జూనియర్ రీసెర్చ్ ఫెలోనేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్.
2. సీఎస్‌ఐఆర్ పరీక్ష (ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్ష. ఈ పరీక్ష ద్వారా అర్హత పొందిన అభ్యర్థికి పిహెచ్‌డిలో ప్రవేశానికి ప్రాధాన్యత లభింంచడంతో పాటు నెలకు 18 వేల రూపాయల ఫెలోషిప్ కూడా లభిస్తుంది.)
3. ఎం.ఫిల్ పరీక్ష 4. పి.హెచ్‌డి ప్రవేశ పరీక్ష.
పైన ప్రస్తావించినవన్నీ పిహెచ్. డి చేయడానికి అవసరమైన ప్రాథ మిక అర్హతలు మాత్రమే. కేవలం దీని ద్వారానే పి.హెచ్‌డిలో ప్రవేశం లభిస్తుందనుకుంటే పొరపాటే. అర్హత పొందిన తర్వాత ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదా హరణకు ఉస్మానియా యూనివర్సి టీ పద్ధతిని పరిశీలిస్తే అక్కడ పిహెచ్‌డి ప్రవేశ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ కమిటీకి డీన్, హెడ్, బిఓఎస్ ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. అర్హత సంపాదించిన అభ్యర్థులందరూ కమిటీ ఇంటర్వ్యూకి హాజరుకావలసి ఉంటుంది. ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ ఆధారంగా అందుబాటు లోని ఖాళీలను బట్టి అభ్యర్థులకు ప్రవేశం కల్పించడం జరుగుతుంది.
ఈ ప్రవేశ ప్రక్రియ మొత్తానికి కలిపి 100 మార్కులు ఉంటాయి.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఫస్ట్‌క్లాస్) 25 మార్కులు
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (డిస్టింక్షన్) 30 మార్కులు
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (గోల్డ్ మెడలిస్ట్) 40 మార్కులు
బోధనా అనుభవం 10 మార్కులు
పరిశోధనా పత్రాలు 10 మార్కులు
(ఒక్కో పేపర్‌కి ఐదు మార్కులు)
సెమినార్ ప్రజంటేషన్స్ 10 మార్కులు
రీసెర్చ్ డిజైన్, ఇంటర్వ్యూ 30 మార్కులు
ప్రస్తుతం పిహెచ్‌డికి విపరీతంగా పోటీ పెరిగిపోయింది. రీసెర్చ్ సూపర్‌వైజర్ దగ్గర ఉన్న ఖాళీల ప్రకారమే సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. ఒక్కో రీసెర్చ్ సూపర్‌వైజర్ ఒక్కసారి 6గురు అభ్యర్థులకు మాత్రమే ‘గైడ్’గా ఉండగలరు. ఒక విభాగంలో ఉన్న సూపర్‌వైజర్‌ల సంఖ్యను 6 సంఖ్యతో గుణిస్తే వచ్చే సంఖ్యే అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యగా గుర్తిస్తారు. ఉదాహరణకి ఒక విభాగంలో ఆరుగురు సూపర్‌వైజర్‌లుంటే ఒక్కొక్కరికీ ఆరుగురు అభ్యర్థుల చొప్పున మొత్తం 36 ఖాళీలుంటాయన్న మాట. ఒక వేళ అప్పటికే అక్కడ 30 మంది పిహెచ్‌డి పరిశోధన చేస్తుంటే కేవలం 6 సీట్లు ఉన్నట్లు భావించాలి. దీన్ని బట్టి పిహెచ్‌డి సీటు సంపాదించడం అంత తేలిక కాదనే విషయం అభ్యర్థులు గ్రహించి పోటీలో ముందుగా నిలవాలంటే రీసెర్చ్ డిజైన్‌పై ఎంతో కృషి చేయవలసి ఉంటుంది.
పిహెచ్‌డి. విజయసూత్రాలు
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనేది పేరుకి తగ్గట్టుగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఉన్నత విలువలు కలిగిన ఎంతో పవ్రితమైన పరిశోధనాత్మక విద్యగా ప్రతి విద్యార్థి భావించాలి. ఈ విద్యను ఎంతో అంకిత భావంతో అభ్యసించవలసి ఉంటుంది. పిహెచ్‌డి నిర్దిష్ట సమయంలో విజయవంతంగా పూర్తి చేయడమనేది ప్రధా న లక్ష్యంగా ఉండాలి. పిహెచ్.డి అనేది కేవలం ఒక విద్య మాత్రమే కాదు మానవ జీవిత విలువలను, స్థాయిని పెంచే మహోన్నత పరిశోధనా కార్యక్రమం. పిహెచ్.డిని ఆ విధంగా భావించి చేసినప్పుడే ఆ ఉన్నత విద్యకి, విద్యార్థికి సార్థకత చేకూరుతుంది.
ప్రవేశ అర్హతకు సూచనలు
అభ్యర్థి యం.ఫిల్. చేయకుండా నేరుగా పిహెచ్‌డి ప్రవేశానికి ప్రయత్నిస్తున్నట్లుయితే వారికి రీసెర్చ్ డిజైన్ రూపకల్పన ఎంతో కీలకమైనదని గ్రహించాలి. ఎందుకంటే అభ్యర్థి రీసెర్చ్ డిజైన్ రూపకల్పన ఇంటర్వ్యూలో మంచి మార్కులు సంపాదించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. మంచి రీసెర్చ్ డిజైన్ తయారీకి అభ్యర్థులు క్రింది అంశాలు దృష్టిలో ఉంచు కోవాలి.
1. రీసెర్చ్ అంశాన్ని ప్రొఫెసర్లతో, నిపుణులతో చర్చించి ఎంపిక చేసుకోండి.
2. గతంలో అభ్యర్థులు రూపొందించిన థీసిస్‌లను ఒక సారి పరిశీలించండి.
3. రీసెర్చ్ డిజైన్‌ను ఒక పద్ధతి ప్రకారం రూపొందించండి.
4. ముందుగా ‘టాపిక్ ఇంట్రడక్షన్’ రాయండి.
5. ఎంచుకున్న అంశం లేదా విషయం యొక్క లక్షణాలు, ఆ విషయం ఉద్దేశించి మీరు ఏరకమైన స్టేట్‌మెంట్‌తో పరిశోధన చేయబోతున్నారనేది ప్రస్తావించండి.
6. పరిశోధనా ఉద్దేశాలను తెలియజేయండి.
7. డాటా, సమాచార సేకరణ పద్ధతులు, వాటిని ఎలా, ఎక్కడ నుంచి సంపాదిస్తారు. వాటి సోర్స్ ఏమిటి, వాటిని ఏ విధంగా విశ్లేషిస్తారో చెప్పే విశ్లేషణా విధానాలు, పరిణామాలు, ఊహాత్మక ఫలితాలు, ఉదాహరణగా ఒక నమూనా డిజైన్ మొదలైనవి వివరంగా, శాస్త్రీయంగా తయారు చేయాలి.
8. పరిశోధనాంశాల వర్గీకరణ, తయారైన డిజైన్ స్క్రిప్ట్‌ని ఒక సారి సమీక్షించుకోవాలి. పైన ప్రస్తావించిన అంశాలు, రీసెర్చ్ డిజైన్ తయారీ ప్రక్రియ అన్ని సబ్జెక్టుల వారికి కూడా వర్తిస్తా
No comments:
Post a Comment