Saturday, 5 January 2013

కరెంట్ అఫైర్స్ రౌండప్ 2012 (క్రీడాంశాలు)


కరెంట్ అఫైర్స్ రౌండప్ 2012 (క్రీడాంశాలు)

ప్రపంచ మహిళల టీమ్ చెస్ టోర్నీ
ప్రపంచ మహిళల టీమ్ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 27 టర్కీలోని మార్డీన్‌లో ముగిసింది. ఇందులో చైనా మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించింది. రష్యా, జార్జియాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి స్వర్ణ పతకం గెలుచుకుంది.

ధోనికి ఫెయిర్ ప్లే అవార్డు
ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషన ల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ (ఏఐపీఎస్) ‘ఫెయిర్ ప్లే’ పురస్కా రానికి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎంపిక య్యాడు. ఈ అవార్డుకు ఎంపికై న తొలి క్రికెటర్ థోనీ. ఈ పురస్కారం గతంలో ఫుట్‌బాల్ క్రీడాకారులు డిగో మారడోనా బెక్‌హమ్, క్రిష్టియానో రోనాల్డ్‌లకు దక్కింది.

కెరీర్ స్లామ్ సాధించిన తొలి భారత ఆటగాడు ‘పేస్’
మేటి డబుల్స్ ఆటగాడు లియాండర్ ఫేస్ కెరీర్‌స్లామ్ సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. జనవరి 28న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రాడెక్ స్టెపానెక్ (చెక్)తో జోడీగా టాప్‌సీడ్ బ్రయాన్ బ్రదర్స్ (అమెరికా)ను చిత్తుచేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పేస్‌కు ఇదే తొలి టైటిల్. మొత్తంగా 13వది. పేస్ తాజా టైటిల్‌తో అరుదైన కెరీర్ స్లామ్ పూర్తిచేసి భారత పతకాన్ని రెపరెప లాడించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగానూ రికాక్డులెక్కాడు. మహేష్ భూపతి ఖాతాలో 11 టైటిళ్ళున్నాయి.

రంజీ విజేత రాజస్థాన్
దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీని రాజస్థాన్ జట్టు గెలుచుకుంది. చెన్నైలో జనవరి 19 నుంచి 23 వరకు జరిగిన ఫైనల్లో తమిళనాడు జట్టును ఓడించింది. వరుసగా రెండేళ్లపాటు టైటిల్ నెగ్గిన ఐదో జట్టుగా కూడా రాజస్థాన్ రికార్డు సృష్టించింది.

ఆసియాకప్ విజేత పాకిస్థాన్
ఆసియా కప్ క్రికెట్ టైటిల్‌ను పాకిస్థాన్ జట్టు గెలుచుకుంది. మార్చి 22న మీర్పూర్ (బంగ్లా దేశ్)లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ ను ఓడించి రెండోసారి ఆసియా కప్‌ను సాధించింది. బంగ్లాదేశ్, ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు.

‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సన్నీ
భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో లాంఛనంగా చోటు లభించింది. ఫిబ్రవరి 8న దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ ‘ప్రతిష్టా త్మక క్యాప్’ను సన్నీకి అందజేశాడు. హాల్ ఆఫ్ ఫేమ్‌లో ప్రస్తుతం ఉన్న 72 మంది (పురుష, మహిళ) క్రికెటర్ల సరసన ఈ మాజీ కెప్టెన్ స్థానం సంపాదించాడు.

సచిక్‌కు ఎస్‌సిజీ గౌరవ సభ్యత్వం
సచిన్‌కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ) గౌరవ జీవితకాల సభ్యత్వం లభించింది. ఎస్‌సీజీ సభ్యత్వం పొందిన తొలి విదేశీ ఆటగాడు సచినే. న్యూసౌత్‌వేల్స్ రాష్ర్ట ముఖ్యమంత్రి బారా ఓఫెరల్ సచిన్‌కు ఈ పురస్కారం అందించారు.

భారత్‌కు తొలి మహిళల కబడ్డీ ప్రపంచ ఛాంపియన్‌షిప్
తొలిసారి నిర్వహించిన మహిళల కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ను భారత్ గెలుచుకుంది. మార్చి 4న పాట్నాలో జరిగిన ఫైనల్‌లో భారత్, ఇరాన్ జట్టుపై 25-19 తేడాతో విజయం సాధించింది.

ఆసియా బిలియర్డ్స్ ఛాంప్ అద్వానీ
ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌ను పంకజ్ అద్వానీ (భారత్) గెలుచుకున్నాడు. ఏప్రిల్ 8న గోవా రాజధాని పనాజీలో జరిగిన ఫైనల్లో తవత్ సుజారిత్ తౌకర్న్ (థాయ్‌లాండ్) పై విజయం సాధించాడు. పంకజ్‌కు ఇది ఐదో ఆసియా టైటిల్. ఇంతకు ముందు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. గతంలో అద్వానీ ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్‌ను కూడా గెలుచుకున్నాడు.

లండన్‌లో ధ్యాన్ చంద్ స్టేషన్
లండన్ ఒలింపిక్స్ నిర్వాహకులు 358 రైల్వేస్టేషన్‌లకు ఒలింపిక్ దిగ్గజాల పేర్లను పెట్టారు. ఇందులో ఆరుగురు హాకీ ఆటగాళ్ళు. ఈ ఆరుగురిలో ముగ్గురు భారత దిగ్గజాలే. ఒకరు థ్యాన్‌చంద్. మరొకరు అతడి సోదరుడు రూప్‌సింగ్.. ఇంకొకరు లెస్లీ వాల్టర్ క్లాడియస్.

సానియా 500వ విజయం
హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా తన ప్రొఫెషనల్ కెరీర్‌లో 500వ విజయాన్ని నవెూదు చేసింది. డబ్ల్యూటీఏ బ్రసెల్స్ ఓపెన్‌లో అమెరికా భాగస్వామి బెథానీ మాటెక్ శాండ్స్‌తో కలిసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. డబుల్స్‌లో సానియాకిది 230వ గెలుపు. సింగిల్స్‌లో 270 విజయాలు నవెూదు చేసింది.

ప్రపంచకప్ ఆర్చరీలో దీపికకు స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు చెందిన దీపిక కుమారి వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. మే 5న అంటాల్యా (టర్కీ) లో జరిగిన ఫైనల్లో లీసుంగ్‌జిన్ (కొరియా) పై విజయం సాధించింది. ఇప్పటికే లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీపిక జూనియర్ ప్రపంచ ఛాంపియన్ కూడా. ఆమె 2009లో క్యాడెట్ ప్రపంచ టైటిల్‌ను కూడా గెలిచింది. పురుషుల విభాగంలో భారత్‌కు రజితం దక్కింది.

ఆసియా బీచ్ కబడ్డీ విజేత భారత్
ఆసియా బీచ్ క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. జూన్ 19న హయాంగ్ (చైనా)లో జరిగిన ఫైనల్లో థాయ్‌లాండ్‌ను ఓడిం చింది. పురుషుల విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. బాస్కెట్‌బాల్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. జూన్ 19న జరిగిన ఫైనల్లో చైనాను ఓడించింది. పురుషుల విభాగంలో తుర్క్‌మెనిస్థాన్ స్వర్ణపతకాన్ని సాధించింది.

భారత్‌కు అండర్ 19 ప్రపంచకప్
అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ను భారత్ గెలుచు కుంది. టౌన్స్‌విల్లే (ఆస్ట్రేలి యా)లో ఆగస్టు 26న జరిగిన ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ టోర్న మెంట్‌ను భారత్ మూడోసారి గెలుచుకుంది. (2000, 2008 లోకూడా విజేతగా నిలిచింది) భారత జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా, ఆస్ట్రేలియా కెప్టెన్ ఒసిస్టో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యారు.

2011 ఫిఫా అవార్డులు 
ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) 2011 సంవత్సరానికి ఫుట్‌బాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి అవార్డులను జనవరి 10న జ్యురిచ్‌లో ప్రదానం చేసింది.

వివరాలు...
ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా) వరుసగా మూడోసారి ఈ ఘనతను దక్కించుకున్నాడు. ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : హోమారెసావా ఫాన్స్), కోచ్ ఆఫ్ ది ఇయర్ : పెప్ గారియోలా (బార్సిలోనా), మెన్ కోచ్ ఆఫ్ ది ఇయర్ : ఉరియో సిసాకి (జపాన్), ప్రెసిడెన్షియల్ అవార్డు : అలెక్స్ ఫెర్గూనోసన్ (మాంచెస్టర్ యునైటెడ్)
sports

olypic

No comments:

Post a Comment