'జామ్'లో జయీభవ!
|
|---|
ఐఐటీలు సాంకేతిక విద్యతోపాటు సైన్స్ కోర్సులను కూడా అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్నాయి. బేసిక్, అప్లయిడ్ సైన్సెస్‌లో పీజీ, పరిశోధన కోర్సులను ఐఐటీలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి నిర్వహించే జామ్ (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎం.ఎస్‌సి) 2013 నోటిఫికేషన్ విడుదలైంది. బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) కూడా జామ్ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తుంది. పరీక్ష స్వభావాన్ని అర్థం చేసుకొని, ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తే ఈ పరీక్షలో తేలిగ్గా విజయం సాధించవచ్చు.
|
అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది, ఆధునిక మౌలిక సౌకర్యాలు, పరిశోధనలకు అవసరమైన ప్రోత్సాహం అందించడం ఐఐటీలు, ఐఐఎస్‌సీ ప్రత్యేకతలు. ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్, పరిశోధన కోర్సులకు ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించాయి. శాస్త్రరంగానికి అవసరమైన నిపుణులను తయారుచేయడం లక్ష్యంగా అత్యున్నత ప్రమాణాలతో సైన్స్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే జామ్ పరీక్ష ద్వారా ఎం.ఎస్‌సి, జాయింట్ ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ, ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆయా సంస్థలు అనేక అసిస్టెంట్‌షిప్‌లను అందిస్తున్నాయి. ఈ ఏడాది జామ్ నిర్వహణ బాధ్యతలను ఐఐటీ ఢిల్లీ చేపట్టింది.
| ![]() |
|---|
జామ్ 2013 పరీక్షలో కింది మార్పులు చేశారు...
* ఐఐఎస్‌సి, బెంగళూరు నిర్వహిస్తోన్న ఇంటెగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి జామ్ స్కోరును పరిగణనలోకి తీసుకోనున్నారు.
* బయోలాజికల్ సైన్సెస్‌లో నూతన పరీక్షను ప్రవేశపెట్టారు.
* అమ్మాయిలకు దరఖాస్తు ఫీజు లేదు.
* నాన్ ప్రోగామబుల్ కాలిక్యులేటర్‌ను పరీక్షకు అనుమతిస్తారు.
* ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ (కాన్పూర్, ముంబయి)లలో కొన్ని ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు.

జామ్ పరీక్ష ద్వారా బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ, భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, ఇండోర్ ఐఐటీలు సైన్స్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఐఐఎస్‌సి మొదటిసారిగా ఈ ఏడాది జామ్ పరిధిలోకి వచ్చింది. శాస్త్రరంగంలో విశ్వవ్యాప్తంగా జరిగే పరిణామాలను, పరిశోధనలను దృష్టిలో ఉంచుకొని కోర్సులను నిరంతరం అప్‌డేట్ చేయడం ఈ సంస్థల విశిష్ఠత. బీఎస్సీ తర్వాత నేరుగా ఇంటెగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పించడం ఐఐఎస్‌సీ ప్రత్యేకత.
జామ్ పరీక్ష విధానం
జామ్ పరీక్షలో ఈ పేపర్లు ఉంటాయి... బయోలాజికల్ సైన్సెస్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, జియాలజీ, జియోఫిజిక్స్, మేథమేటిక్స్, మేథమేటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్. వీటిలో బయోలాజికల్ సైన్సెస్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ పేపర్లు పూర్గిగా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి. తప్పు సమాధానాలకు 1/3 శాతం నెగటివ్ మార్కులు ఉంటాయి.
మిగిలిన ప్రశ్నపత్రాలన్నీ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతుల్లో ఉంటాయి. ప్రశ్న పత్రాలతోపాటే సమాధానాలు రాయడానికి బుక్‌లెట్ ఇస్తారు. ఈ పేపర్లలో ప్రశ్నల విభజన ఇలా ఉంటుంది...
* ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు: 20 శాతం వెయిటేజీ
* ఖాళీలను పూరించడం: 30 శాతం వెయిటేజీ
* డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు: 50 శాతం వెయిటేజీ
వీటిలో ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు మాత్రమే నెగటివ్ మార్కులు ఉంటాయి.

బయోలాజికల్ సైన్సెస్ పేపర్ ఎలా?
ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన బయోలాజికల్ సైన్సెస్ పేపర్ స్వభావాన్ని పరిశీలిద్దాం. ఈ పేపర్‌లో ర్యాంకులు, ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా ఐఐఎస్‌సీలో ఇంటెగ్రేటెడ్ పీహెచ్‌డీ ఇన్ కెమిస్ట్రీ / ఫిజిక్స్, ఐఐటీ బాంబేలో ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీలో ప్రవేశం లభిస్తుంది. బయాలజీ సిలబస్‌కు ప్రాధాన్యం ఉన్నప్పటికీ మేథమేటిక్స్ అంశాలు కూడా ఉన్నాయి. బయాలజీలో ముఖ్యంగా జనరల్ బయాలజీ, బేసిక్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, మాలెక్యులర్ బయాలజీ, మైక్రోబయాలజీ, సెల్ బయాలజీ అండ్ ఇమ్యునాలజీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మేథమేటికల్ సైన్సెస్‌లో మేథమేటికల్ ఫంక్షన్స్ (algebraic, exponential, trigonometric), their derivatives (derivatives and integrals of simple functions), permutations and combinations,తదితర అంశాలను బాగా నేర్చుకోవాలి.
ఇలా సిద్ధమైతే...
డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రిపరేషన్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. సరైన ప్రణాళికను రూపొందించుకొని నిబద్ధతతో చదివితేనే మంచి ర్యాంకు తెచ్చుకోగలరు. ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ కోర్సును బాంబే, రూర్కీ ఐఐటీలు మాత్రమే అందిస్తున్నాయి. అందువల్ల ఈ సబ్జెక్టుకు పోటీ అధికంగా ఉంటుంది. బయోటెక్నాలజీ ప్రశ్నపత్రంలో బయాలజీ, కెమిస్ట్రీతోపాటు మేథమేటిక్స్, ఫిజిక్స్‌ల నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. బీఎస్సీ స్థాయి బయాలజీ సిలబస్‌ను క్షుణ్నంగా చదవాలి. బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్, మాలెక్యురల్ బయాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, మేథమేటిక్స్, ఫిజిక్స్‌లలో ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి.
కెమిస్ట్రీ పరీక్ష రాసే విద్యార్థులు ఫిజికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మేథ్స్‌లో పేర్కొన్న సిలబస్‌ను కూడా అధ్యయనం చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ; ఫిజికల్ కెమిస్ట్రీలో క్వాంటమ్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, థర్మోడైనమిక్స్, తదితర అంశాలను బాగా చదవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్ కెమిస్ట్రీ అంశాలను కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలి.
ఫిజిక్స్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఫిజికల్ ఆప్టిక్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ అసిలేషన్స్, వేవ్స్ అండ్ అసిలేషన్స్, స్పెక్ట్రోస్కోపి, న్యూక్లియర్ అండ్ అటామిక్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, హీట్, ఆప్టిక్స్, మోడరన్ ఫిజిక్స్ సంబంధిత అంశాలను అనువర్తిత పద్ధతిలో అధ్యయనం చేయాలి.

దరఖాస్తు విధానం...
జామ్ 2013కు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రింటెడ్ దరఖాస్తులు కెనరా బ్యాంకు శాఖల్లో లభిస్తాయి. రాష్ట్రంలోని హైదరాబాద్ (ఆబిడ్స్ రోడ్), కడప (చిన్నా చౌక్), కాకినాడ (జవహర్ స్ట్రీట్), నెల్లూరు (జొన్నగడ్డవారి వీధి), సికింద్రాబాద్ (ఎంజీ రోడ్), విజయవాడ (శివాలయం వీధి), విశాఖపట్నం (దాబా గార్డెన్స్) శాఖల నుంచి దరఖాస్తులు పొందవచ్చు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 అక్టోబరు 2012
* జామ్ 2013 తేదీ: 10 ఫిబ్రవరి 2013
ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, కడప, నెల్లూరు కేంద్రాల్లో పరీక్ష రాయవచ్చు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 అక్టోబరు 2012
* జామ్ 2013 తేదీ: 10 ఫిబ్రవరి 2013
ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, కడప, నెల్లూరు కేంద్రాల్లో పరీక్ష రాయవచ్చు.
ముఖ్యమైన సూచనలు...
* ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో ప్రాథమిక భావనలు, విశ్లేషణాత్మక సామర్థ్యాలకు పెద్దపీట వేస్తారు. అందువల్ల సబ్జెక్టులను విశ్లేషణాత్మకంగా చదవడం, వివిధ అంశాలను అన్వయించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
* ఐఐఎస్‌సీ, ఐఐటీలు (బాంబే, కాన్పూర్) నిర్వహించే ఇంటర్వ్యూలో సాధారణంగా సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలనే అడుగుతారు. సబ్జెక్టును అనువర్తిత, ఆచరణాత్మక ధోరణిలో అధ్యయనం చేయడం ద్వారా ఇంటర్వ్యూను సమర్థంగా ఎదుర్కొనవచ్చు.
* డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి ముఖ్యమైన అంశాలకు అధిక సమయం కేటాయించాలి. సమయం తక్కువగా ఉంది కాబట్టి రోజూ కనీసం 5-6 గంటలు జామ్‌కు కేటాయిస్తేనే ఫలితం బావుంటుంది.
* డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఇంగ్లిష్‌లో వ్యాసరూప ప్రశ్నలను రాయడం సాధన చేయాలి.
* పీజీ చేయాలనుకునే విద్యార్థులు... డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చినా సరే, జామ్‌కు ప్రయత్నించడం మంచిది. అధిక సమయం కేటాయించి, సబ్జెక్టులోని ప్రాథమిక భావనలపై పట్టు పెంచుకోవాలి. సానుకూల దృక్పథంతో కష్టపడి చదివితే జామ్‌లో విజయం సాధించవచ్చు.
పాత ప్రశ్నపత్రాలు జామ్ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. వీటితోపాటు సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలిస్తే పరీక్షపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. దీని ఆధారంగా డిగ్రీ సిలబస్, జామ్‌లో సబ్జెక్టు సిలబస్ మధ్య తేడాలను తెలుసుకోవచ్చు. అదనపు పాఠ్యాంశాలను గుర్తించి వాటిని చదువుకుంటే మంచి ర్యాంకు తెచ్చుకోవడం వీలవుతుంది.

జామ్ ప్రశ్నపత్రం, సంబంధిత కోర్సులు...
1.బయోలాజికల్ సైన్సెస్:
* ఇంటెగ్రేటెడ్ పీహెచ్‌డీ: బయోలాజికల్ సైన్సెస్ / కెమికల్ సైన్సెస్
* ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ
2. బయోటెక్నాలజీ
* ఇంటెగ్రేటెడ్ పీహెచ్‌డీ ఇన్ బయోలాజికల్ సైన్సెస్
* ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ
* ఎం.ఎస్‌సి - పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ: బయోటెక్నాలజీ / ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
3. కెమిస్ట్రీ
* ఇంటెగ్రేటెడ్ పీహెచ్‌డీ: కెమికల్ సైన్సెస్ / బయోలాజికల్ సైన్సెస్
* జాయింట్ ఎం.ఎస్‌సి- పీహెచ్‌డీ ఇన్ కెమిస్ట్రీ
* ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ
* ఎం.ఎస్‌సి.- పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ: కెమిస్ట్రీ / ఎనర్జీ / ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ / బయోటెక్నాలజీ
4. కంప్యూటర్ అప్లికేషన్స్
* మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్
5. జియాలజీ
* జాయింట్ ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ: ఎర్త్ సైన్స్ / జియాలజీ
* ఎం.ఎస్‌సి. అప్లయిడ్ జియాలజీ
* ఎం.టెక్. జియోలాజికల్ టెక్నాలజీ
* ఎం.ఎస్‌సి. -పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ ఇన్ అప్లయిడ్ జియాలజీ
6. జియోఫిజిక్స్
* ఎం.ఎస్‌సి. అప్లయిడ్ జియోఫిజిక్స్
* ఎం.ఎస్‌సి. -పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ ఇన్ అప్లయిడ్ జియోఫిజిక్స్
* ఎం.టెక్. జియోఫిజికల్ టెక్నాలజీ
7. మేథమేటిక్స్
* ఇంటెగ్రేటెడ్ పీహెచ్‌డీ: మేథమేటికల్ సైన్సెస్ / బయోలాజికల్ సైన్సెస్
* ఎం.ఎస్‌సి. మేథమేటిక్స్
* జాయింట్ ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ ఇన్ మేథమేటిక్స్
* ఎం.ఎస్‌సి.: మేథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్ / అప్లయిడ్ మేథమేటిక్స్ / ఇండస్ట్రియల్ మేథమేటిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్
* ఎం.ఎస్‌సి. -పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ: ఆపరేషన్స్ రిసెర్చ్ / ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ / ఎనర్జీ
8. మేథమేటికల్ స్టాటిస్టిక్స్
* ఎం.ఎస్‌సి.: అప్లయిడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ / స్టాటిస్టిక్స్
* ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ ఇన్ ఆపరేషన్స్ రిసెర్చ్
9. ఫిజిక్స్
* ఇంటెగ్రేటెడ్ పీహెచ్‌డీ: ఫిజికల్ సైన్సెస్ / బయోలాజికల్ సైన్సెస్ / కెమికల్ సైన్సెస్
* జాయింట్ ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ ఇన్ ఫిజిక్స్
* ఎం.ఎస్‌సి. ఫిజిక్స్
* ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ: ఫిజిక్స్ / ఎనర్జీ / ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ / బయోటెక్నాలజీ
* ఎం.ఎస్‌సి. ఫిజిక్స్ - ఎం.టెక్. మెటీరియల్స్ సైన్సెస్ (నానోసైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌త

No comments:
Post a Comment